ఇలా ఆలోచించి, అలా చేస్తే, ఇక డబ్బు మీ వెనకే వస్తుంది!

ఇలా ఆలోచించి, అలా చేస్తే, ఇక డబ్బు మీ వెనకే వస్తుంది!
x
Highlights

ఫ్రెండ్స్, డబ్బు సంపాదించాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఎక్కడో వారి మనస్సులో, " ఈ డబ్బు సంపాదించాలనే ఆలోచన, కోరిక తప్పు ఆలోచనేమో" అని వారిలోనే, ఒక...

ఫ్రెండ్స్, డబ్బు సంపాదించాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఎక్కడో వారి మనస్సులో, " ఈ డబ్బు సంపాదించాలనే ఆలోచన, కోరిక తప్పు ఆలోచనేమో" అని వారిలోనే, ఒక అనుమానం తో కూడా ఎక్కువ మంది వుంటారు.

1. డబ్బు సంపాదించడం మీ హక్కు అని గుర్తించండి.

ఒక టీవీ ప్రకటనలో చెప్పినట్టు..."డబ్బులు ఎవరికీ ఊరికనే రావు", మన ద్రుష్టి దానిపై పెట్టి సంపాదించాలి. అయితే ముఖ్యంగా మనం అర్ధం చేసుకోవాల్సింది, ఈ రోజుల్లో డబ్బు కనీస అవసరం, ప్రస్తుతం వున్న సమాజంలో మన ఎ అవసరం తీరుచుకోవాలన్న కావాల్సింది డబ్బు, కాబట్టి డబ్బుకు సంబంధించి ముఖ్యంగా రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి.

డబ్బుకు సంబంధించి ఏమైనా అపనమ్మకాలు మీ మీద మీకు ఉంటే వాటిని తొలగించుకోవాలి. కొద్దిమంది వారు డబ్బు సంపాదించటానికి కావాల్సిన అర్హతలు లేవని, లేదా వారికీ రాదని ఇలా కొన్ని అనవసర అపనమ్మకాలతో వుంటారు. ముఖ్యంగా డబ్బు సంపాదించాలంటే ఏదో ప్రత్యేకమైన టాలెంట్ వుండాలని, లేదా వారి కుటుంబంలో ఇప్పటివరకు ఎవరు ఎక్కువగా సంపాదించలేదు, కాబట్టి వారు సంపాదించలేము అనుకుంటారు.

అలాగే బాగా చదువుకోలేదని, లేదా వయస్సు తక్కువని, లేదా వయస్సు ఎక్కువని, వారి ప్రాంతం వారికీ సంపాదించరాదని ఎన్నో అనవసర నమ్మకాలూ కలిగివుంటారు. ఇలాంటి అపనమ్మకాలు ఏమైనా మనలో వుంటే ముందుగా తొలగించుకోవాలి.

అలాగే చాలామందికి డబ్బు మీద కొన్ని అపోహలు వుంటాయి, అవి ఎలాంటివి అంటే..డబ్బు అందరు సంపాదించలేరని, డబ్బు ఉన్నవారి వద్దకే డబ్బు వెళుతుందని, కొద్దిమందికి పుట్టుకతోటే ఈ విద్య వస్తుందని, డబ్బు చాల చెడ్డదని, మనుషుల మద్య గొడవలు పెడుతుందని లేదా డబ్బు ఎక్కువగా సంపాదించాలి అంటే తప్పక తప్పులు చెయ్యాలని, ఇలా ఎన్నో అపోహలు డబ్బు మీద కలిగి వుంటారు. ఇవన్ని అపోహలు మాత్రమే నిజాలు కావని మనం గుర్తించి, వీటిని తొలగించుకోవాలి.

2. జీవితం అంటే మార్పు, అభివృద్ధి అందులో భాగం.

చాల మందికి కారు, బంగ్లా కొనుక్కోవాలని, అన్ని సుఖాలు అనుభవించాలని ఆశ వుంటుంది, కాని వారి జీవితంలో ఎ మార్పు చేసుకోడానికి వారు ఇష్టపడరు. మనం అర్ధం చేసుకోవాల్సింది మన జీవితంలో మార్పు సహజం అని, ముఖ్యంగా మార్పుతోపాటు మనం కోరుకునే అభివృద్ధి చెందడం కూడా ఒక అవసరం అని. ప్రపంచంలో మనం ఎటు చూసిన కూడా, పుట్టుక, ఎదుగుదల, ఆ తర్వాత క్షీణించడం అనేధీ సహజంగా జరుగుతుంది. అలాగే ప్రతి మనిషీ తన శ్రమతో డబ్బు సంపాదించి, దాన్ని కొంతకాలం తన అదుపులో పెట్టుకుని, ఆ తర్వాత ఇతరులతో పంచుకోవడం కూడా అత్యంత సహజమైన ప్రక్రియనే.

ఇది సాదించటానికి ముందుగా మనం, మన వృత్తిలో ఎదగాలి. మనం రోజు చేసే పనిలో ప్రత్యేకతని సాదించడం ద్వార, డబ్బుని ఎక్కువగా సంపాదించి మన నెట్వర్త్ పెంచుకోగలాగాలి. కాబట్టి ముందుగా మీకు ఏ పని బాగా వచ్చు, ఆ పనికి మార్కెట్లో ఎలాంటి ఆదాయం వుంది అనే విషయాలను అర్ధం చేసుకోవాలి. మనం సరైన జ్ఞానం సంపాదించి ఆచరించగానే, లక్మిదేవి చక్కగా మన ఇంటికి ఎంతో ధనాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొని నడచుకుంటూ వస్తుంది అంటారు.

3. మనలోని అన్ని కోణాల్లో ఎదగటానికి చాల అవసరం డబ్బు.

ఒక సినిమాలో రావుగోపాల్ రావు చెప్పినట్టు...మనిషన్నాక కొంత కళ పోషణ వుండాలి. అందుకే మనిషికి డబ్బు ఒక్క తిండి, బట్ట, ఇంటి కోసమే కాదు, మనిషికి ఒక్క శారీరక అవసరాలు మాత్రమే వుండవు, ప్రతి మనిషికి కొన్ని మేధోపరమైన అవసరాలు, అనగా తనకి ఇష్టమైన చదువు చదవగలటం, అలాగే తనకి ముఖ్యమైన వ్యక్తుల అవసరాలు తీర్చగలటం, అలాగే వారి ప్రేమని పొందటం కూడా ఒక అవసరం, అలాగే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఈ రోజుల్లో డబ్బు చాలా అవసరము అని మనం గుర్తించాలి. ఇలా అన్ని విధాలుగా ఎదగటానికి ఈ రోజుల్లో డబ్బు చాల అవసరం.

4. మనం ఇతరుల అవసరాలు తీర్చగలగాలి.

ఒకప్పుడు కూటి కోసం "కోటి విద్యలు" అనేవారు, ఇప్పుడు కూడా మనం డబ్బు సంపాదించటానికి రకరకాల పనులు చేస్తువుంటాము. అందులో మనము డబ్బు సంపాదించడానికి ముఖ్యమైన రెండు దారులు వుంటాయి. అందులో ఒకటి ఇతరుల అవసరాలు తీర్చడానికి మన సేవలను అందించడం. రెండవది ఇతరుల అవసరాలు లేదా కోరికలు తీర్చడానికి వస్తువులను తయారు చేయడం. అంటే వారికీ ఉపయోగపడే వస్తువు యొక్క ఉత్పత్తి చేయడం లేదా సేవని అందించడం. ఈ రెండు విధానాల్లో మనము ఒక విధానం ఎంచుకోవాల్సిన అవసరం వుంటుంది. అలా ఇతరులకి అవసరమైన సేవని లేదా వస్తువుని అందించడం ద్వార మనం డబ్బు సంపాదిన్చగలము .

5. సంపాదించిన దాన్ని సరైన పద్దతిలో వాడాలి.

డబ్బు ఒక శక్తివంతమైన గన్ లాంటిది, దానిని సరిగ్గా వాడటం తెలియకుంటే మనకే ప్రమాదం సంభవించవచ్చు. అందుకే అంటారు..డబ్బు మనకి మంచి సేవకుడు అవ్వగలదు, కాని మంచి యజమాని కాలేదు అని, డబ్బు జీవితంలో ముఖ్యం, కాని డబ్బే జీవితం కాదు అని గుర్తుంచుకోవాలి. అందుకే మీరు చుస్తే మనలో చాలామంది డబ్బులు సంపాదించవచ్చు కానీ నిజంగా ధనవంతులు అయ్యేది మాత్రం కొద్దిమందే, ఎందుకంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం ద్వార మాత్రమే ధనవంతులు కాలేము. ఆ సంపాదించిన డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నాము అనే విషయం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆ వ్యక్తి అవసరాలు తీరిన తర్వాత, ఆ మిగిలిన డబ్బును ఎక్కడ, ఎలా పెట్టుబడిగా పెడుతున్నాడు అనే దాని మీదే ... ఒక వ్యక్తి ధనవంతుడు అవుతాడ, లేదా అనే విషయం ఆధారపడి ఉంటుంది.

6. ఇతరులతో మన డబ్బు పంచుకోగలగాలి.

ఆనందం పంచుకుంటే పెరిగినట్టే, డబ్బు కూడా సరైన విధంగా పంచుకుంటే పెరుగుతుంది. అందుకే డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే, ఆ సంపాదించిన డబ్బుని మనం ఎలా వాడుతున్నామనే విషయం కూడా చాల ముఖ్యం. మనం పెట్టుబడి పెట్టినా డబ్బు ద్వారా వచ్చే లాభాలని, మనము సరైన దారిలో వాడాలి అనుకుంటే ముఖ్యంగా రెండు రకాలుగా ఉపయోగించాలి. అందులో మొదటిది ఈ ప్రపంచంలో మెరుగైన విషయాలు, మెరుగైన పనులు చేయటం కోసం, అంటే ఎ పనులు చేస్తే ఈ ప్రపంచం ఇంకా బాగుగా ఉంటుందో, ఆ పనులు చేయడానికి ఆ డబ్బును వినియోగించడం. రెండు ఈ ప్రపంచంలో డబ్బు అత్యంత అవసరమైన వారికి, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారికి, మీరు సహాయపడటం ద్వారా కూడా మీ డబ్బులు సరైన విధంగా ఉపయోగించుకోవచ్చు. తెలివైన వ్యక్తి డబ్బుని లెక్కల్లో చూసుకోవాలి కాని, లెక్క లేకుడా ఖర్చు మాత్రం చెయ్యవద్దు.

ఫ్రండ్స్! పెద్దలు "దనం మూలం ఇదం జగత్" అంటారు... అందుకే మనం ఇలా డబ్బు గురించి అర్ధం చేసుకొని, ఆచరించటం ద్వార ఎంతో సంతృప్తిగా డబ్బుని వాడిన వ్యక్తి అవుతాము. సో అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories