ఆర్ధిక సమస్యల నుండి ఆర్ధిక స్థిరత్వం వైపు వెళ్ళడం ఎలా?

ఆర్ధిక సమస్యల నుండి ఆర్ధిక స్థిరత్వం వైపు వెళ్ళడం ఎలా?
x
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం...... ఆర్ధిక సమస్యల నుండి ఆర్ధిక స్థిరత్వం వైపు వెళ్ళడం ఎలా? ఒక మనిషి కాలమనే తారురోడ్డు పై జీవితం అనే...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం...... ఆర్ధిక సమస్యల నుండి ఆర్ధిక స్థిరత్వం వైపు వెళ్ళడం ఎలా?

ఒక మనిషి కాలమనే తారురోడ్డు పై జీవితం అనే ప్రయాణం కొనసాగిస్తూవుంటాడు.... ఆ ప్రయాణంలో ఆ వ్యక్తికి ఎన్నో రకరకాల అనుభవాలు, అలాగే ఎన్నో తనకి తప్పని కనీస అవసరాలు, వాటిని తీర్చుకునే క్రమంలో తనకు ఎన్నో అనుభూతులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ప్రతి మనిషికి తిండి, బట్ట ,గూడు లాంటి ఎన్నో కనీస అవసరాలు ఉంటాయి అని అనుకున్నాము కదా! ఆ అవసరాలు తీర్చుకోవడానికి కావలసినంత ఆర్ధిక స్థోమత కూడా ఆ వ్యక్తికి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా లేకుంటే మాత్రం తానూ చాల ఇబ్బంది పడే అవకాశం వుంది.

అయితే తన అవసరాలకనుగుణంగా ఆర్థిక వనరులు ఉంటే మాత్రం, ఆ మనిషి కొంత ప్రశాంతంగా జీవించగలుగుతాడు. అలా లేకుంటే మాత్రం ఎన్నో సమస్యలకి, కష్టాలకి గురి అవుతాడు. ముఖ్యంగా ఆ వ్యక్తి అవసరాలే కాకుండా, ఆ వ్యక్తి పైన మాత్రమే ఆధారపడిన మిగిలిన వ్యక్తుల యొక్క అవసరాలు కూడా, తీర్చాల్సిన బాధ్యత కుటుంబపెద్ద గా ఆ వ్యక్తిపైన ఉంటుంది. కాబట్టి కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి ఇతరుల అవసరాలు గుర్తించడమే కాకుండా, తన కుటుంబ సభ్యులలో ఎవరి అవసరాలు ఎలాంటివి, అలాగే ఆ అవసరాలకు కావాల్సిన ఆర్థిక వనరులు ఎంత అని తెలుసుకొని, ఆ వనరులను కూడా సమకూర్చాల్సిన బాధ్యత ఆ వ్యక్తి పై ఉంటుంది.

ఇలాంటి సమయంలో, సందర్భాలలో కుటుంబ బాధ్యతలను మోస్తూ, రకరకాల ఆర్థిక ఇబ్బందులను చూస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి, చాల మందికి వస్తువుంటుంది. వారికీ వున్నఅవసరాలు తీరాలి, వారి ఈ ప్రయాణం బాగా జరగాలి అంటే, ఆ వ్యక్తి తన కుటుంబ ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకుంటే కొంత ఆర్థిక అంశాల విషయంలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తన ప్రణాళికకి అనుగుణంగా కావలసిన వనరులను సమకూర్చుకోవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం.

సరైన ఆర్థిక ప్రణాళిక నిర్మించుకోవాలి అంటే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు, మన కుటుంబంలో ఉన్న బాధ్యతలను గుర్తించాలి. కుటుంబ పరంగా ఎలాంటి బాధ్యతలు మీకు వున్నాయో వాటన్నిటిని ఒక పేపర్ పై వ్రాయండి. ఉదాహరణకి మీరు మీ కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి అనుకుంటే, అప్పుడు మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు మీ పైనే ఆధారపడి ఉన్నారని అర్ధం కదా. ఇప్పటికే మీకు కొంత ఆస్తిపాస్తులు ఉన్నాయనుకుందాము. అయిన కూడా భవిష్యత్తు లో మీకు రాబోయే అవసరాలు ఏమిటి? ఆ అవసరాలకు సరిపోయేంత ఆర్థిక వనరులు ఏంటి? అని మనము ముందుగా నిర్ణయించుకోవాలి, అదెలాగో ఇప్పుడు చూద్దాము.

ఒక వ్యక్తి జీవితంలోని కాలగమనాన్ని చూస్తే ఆ వ్యక్తి పిల్లవాడిగా చదువుకుంటున్నప్పుడు, తన స్కూల్ ఫీజులు, తన కాలేజీ ఫీజులు వారి తల్లిదండ్రుల కడతారు. అప్పటివరకు తనకు అవసరాలే కాని, పెద్దగా ఆర్థిక బాధ్యతలు లేకపోవచ్చు. అదే వ్యక్తి తన స్వతహాగా డబ్బులు సంపాదించడం మొదలయ్యాక, తన ఆర్ధిక అవసరాలకోసం, తన కోరికలకోసం తనే డబ్బుని ఖర్చు చేయటం ఆరంబిస్తాడు. అలాగే తనకి బాధ్యతలు కూడా మొదలవుతాయి. అలా మొదలయ్యే ఆర్థిక బాధ్యతలలో, మొదటిది తన భవిష్యత్తు అవసరాలకోసం డబ్బుని పొదుపు చెయ్యటం, లేదా వాటికీ అనుగుణంగా పెట్టుబడి పెట్టడం. అయితే చాలామంది డబ్బుని దాచుకోవడం కన్న, వాటిని వారి కోరికలపై ఖర్చు చేయ్యటానికే ఇష్టపడుతుంటారు. అవేలాంటి వంటే... తనకి ఇష్టమైన వాహనం కొనుక్కోవడం అయ్యుండొచ్చు లేదా మార్కెట్లో వచ్చిన కొత్త మొబైల్ ఫోన్ అయివుండవచ్చు, లెదా కొత్త బట్టలు, ఫ్రెండ్స్ కి పార్టీలో, ఇలా డబ్బు నీళ్లలా కూడా ఖర్చు పెట్టేస్తారు కొందరు.

సంపాదించినా డబ్బుని మొత్తం ఇలా ఖర్చు పెడితే ఎప్పటికి సరైన ఆర్ధిక స్థిరత్వం ఆ వ్యక్తికి రాదు. అయితే ఇలాంటి వాళ్ళ అప్పుడప్పుడు క్రెడిట్ కార్డ్ లాంటివి కూడా విరివిగా వాడటం, లేదా ఫ్రెండ్స్ వద్ద, కొలీగ్స్ వద్ద, ప్రతి అవసరానికి అప్పు చేయటం కూడా అలవాటు చేసుకుంటారు. ఇలా వారి ఆర్ధిక ప్రయాణం ఎన్నో కష్టాల్లో పడిపోతుంది. ఇలా జరగవద్దు అంటే మాత్రం...కొంత ఆర్ధిక క్రమశిక్షణ చాల అవసరం. ఎవరికైతే ఆర్ధిక క్రమశిక్షణ ఉంటుందో వారు ఆర్ధిక స్థిరత్వాన్ని త్వరగా పొందగలరు.

ఆర్ధిక స్థిరత్వం సాదించటంలో మొదటి మెట్టు... మీ డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలుసుకోండి, చాల మంది డబ్బులు బాగానే సంపాదిస్తారు...వారి కోరికలు తీరాలంటే ఇంకా సంపాదించాలి అనుకుంటారు, కాని వారు ప్రస్తుతం సంపాదిస్తున్న డబ్బు ఎక్కడికి వెళుతుంది, ఎలా వెళుతుంది, ఎందుకు వెళుతుంది అనే విషయాలపై స్పష్టత కలిగి వుండరు. ఆ స్పష్టత మనకి రావాలి అంటే ఒక పేపర్ మరియు పెన్ను తీసుకొని, మీ ప్రతి నెల సంపాదనని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో వ్రాయండి. అది ఎంత చిన్న ఖర్చు అయిన ఫర్వాలేదు లేదా ఎంత పెద్ద ఖర్చు అయిన ఫర్వాలేదు, కాని ప్రతి రూపాయి ఎటు పోతుందో మీకు తెలియాలి. ఉదాహరనణకి మీరు ఒక బకెట్లో నీళ్ళు నింపాలని ట్రై చేస్తూవుంటే... ఆ బకెట్కి ఒక పెద్ద రంధ్రం ఉందనుకుందాం, ఆ విషయం మీకు తెలియకుంటే....మీరు ఎన్ని నీళ్ళు తెచ్చి పోసిన కూడా ఆ శ్రమ అంతా ఆ రంధ్రం వలన వృధా అవుతుంది కదా. అలాగే మీ డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియకుంటే మీకు చాల ఇబ్బంది కలుగుతుంది. సో ఈ రోజు నుండి మీ ప్రతి ఖర్చుని ఒక పుస్తకంలో వ్రాయటం మొదలెట్టండి... ఈ ఒక్క మార్పు కూడా మీ ఆర్ధిక అంశంలో, మీ ఆర్ధిక స్థిరత్వం వైపు ఎంతో మార్పుని తీసుకురాగలదు. ఇంకా కొన్ని విషయాల గురించి వచ్చే వ్యాసాలలో చర్చిద్దాము. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories