బద్ధకం వడి నుండి శ్రమ బడికి రావటం ఎలా?

బద్ధకం వడి నుండి శ్రమ బడికి రావటం ఎలా?
x
Highlights

అది "కృషితో నాస్తి దుర్భిక్షం" అని, అలాగే "వర్క్ ఇస్ వర్షిప్" అనే విషయాన్ని మీరు వినే ఉంటారు. ఇవన్ని కూడా మనం విజయం సాదించాలి అంటే, ఒక్క కలలు వుంటే సరిపోదు, దానికి సరిపోయే కృషి కూడా చేయాలనీ చెబుతున్నాయి.

ఒక బార్య... ఎలాంటి ఉద్యోగం చేయని...తన సోమరి బద్దక రత్న...భర్త తో అంది...."మనం బతికే తీరు గురించి నేను సిగ్గుపడుతున్నాను" అంది.

భర్త: ఎందుకు.... అని ఆశ్చర్యంగా అడిగాడు.

బార్య: మీకు తెలియదా......"నా తండ్రి మన అద్దె చెల్లిస్తాడు. నా తల్లి మన ఆహారం అంతా కొంటుంది. నా చెల్లి మన బట్టలు కొంటుంది, అందుకే....నేను చాలా సిగ్గుపడుతున్నాను అంది.

భర్త: మంచం మీద కూర్చొని... అవును..." నీవు సిగ్గుపడాలి, ఎందుకంటే "మీ ఇద్దరు పనికిరాని అన్నలు మాత్రం....మనకు ఎలాంటి సహాయం చేయట్లేదు" అని బద్దకంగా అన్నాడు ఆ బద్దకరత్న.

ఇలాంటి మనుషులు సమాజంలో వున్నారా అని అంటే... అవును అని చెప్పవచ్చు. కాని వీరు జీవితంలో ఎలాంటి విజయాల్ని పొందలేరు. ఎందుకంటే విజయం శ్రమ ఫలితం కాబట్టి. శ్రమయేవ జయతే! అనే మాట మీరు వినే వుంటారు. అలాగే మన పెద్దవారు ఇంకో మాట కూడా అన్నారు... అది "కృషితో నాస్తి దుర్భిక్షం" అని, అలాగే "వర్క్ ఇస్ వర్షిప్" అనే విషయాన్ని మీరు వినే ఉంటారు. ఇవన్ని కూడా మనం విజయం సాదించాలి అంటే, ఒక్క కలలు వుంటే సరిపోదు, దానికి సరిపోయే కృషి కూడా చేయాలనీ చెబుతున్నాయి. ఒక వ్యక్తి పూర్తి అంకితభావం తో పని చేసినప్పుడు మాత్రమే విజయలక్ష్మిని పొందగలరు. ఎలాంటి విజయ సూత్రం చూసిన కూడా అవి కృషి యొక్క అవసరాన్ని సూచిస్తాయి. అంటే మన కోరికల గురించి, కలల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు, దానికి కావలసిన ప్రణాళిక బద్దమైన శ్రమని మనం చేయాల్సి ఉంటుంది అని తెలుపుతాయి. ఎవరైతే శ్రమిస్తారో వారు సాధిస్తారు. కాబట్టి అదృష్టం వరిస్తే అన్ని అవుతాయని కూర్చోకుండా, మరింత పట్టుదల మరింత కృషిని చేస్తూ ముందుకి వెళ్తే మనం తప్పక విజేతలుగా నిలుస్తాము. కాబట్టి మీ లక్షాన్ని స్పష్టంగా ఎంచుకోండి. దానికోసం అహర్నిశలు పూర్తీ అంకిత భావంతో పని చెయ్యండి. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories