Top
logo

"విమర్శలని ఇచ్చి, పుచ్చుకోండి ఇలా!"

"విమర్శలని ఇచ్చి, పుచ్చుకోండి ఇలా!"
Highlights

ఫ్రండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం.... 'విమర్శలని ఇచ్చి, పుచ్చుకోండి ఇలా!' దీరుబాయ్ అంబానీ గురించి వచ...

ఫ్రండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం.... "విమర్శలని ఇచ్చి, పుచ్చుకోండి ఇలా!"

దీరుబాయ్ అంబానీ గురించి వచ్చిన "గురు" అనే హింది సినిమాలో ఒక డైలాగ్ వుంది.... అది "ఇతరులు మీకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెడితే ... మీరు పురోగతిలో వున్నారని అర్ధం" అని అంటాడు హీరో. అంటే విమర్శలు మన ప్రగతి యొక్క పరామర్శలు అని అర్ధం. మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే, మనం ఏదో చేస్తున్నాము అని అర్ధం. మనని ఎవ్వరు విమర్శించకుండా వుండాలంటే.. సులభమైన దారి మనం ఏమీ చేయకుండా వుండాలి, ఏమీ మాట్లాడకుండా వుండాలి, ఒక బొమ్మలా వుండాలి. కాని అలా బ్రతికి ఏమి లాభం చెప్పండి. అలాగే ఇప్పటివరకు మనం ఎలా బ్రతికాము అని తెలుసుకోవాడానికి... ఒక రచయిత దానికి దగ్గర దారి గురించి చెపుతూ...."The best way to look back is to get feedback" అని అంటాడు.

ఫ్రండ్స్ మనం సంఘజీవి కాబట్టి నలుగురితో కలిసి జీవించడం సహజం. ఒకరి సహాయం ఒకరు తీసుకోవాల్సిరావటం సహజం. కానీ ఈ క్రమంలో కొద్దిమంది మన బంధువులు, మిత్రులు మనం ఎ పని చేసిన కూడా ఆ పనిని విమర్శించే వారు వుంటారు. వారు మన పైన వున్నా ఈర్ష వల్ల కూడా మనని మల్లి, మల్లి, విమర్శించవచ్చు. మనం చేసిన పనిలో రంద్రాన్వేషణ చేసే వారు వుంటారు. ఇలా ఎలాగైనా తప్పు పట్టాలి, తప్పు వెతకాలి, లేకుంటే తప్పు సృష్టించైనా విమర్శలు చెయ్యాలి అని అనుకునే వ్యక్తులు వుంటారు. ఇలాంటి వారి మాటాలు మన మనసుకి ఎంతో బాధకలుగుతుంది. వాస్తవానికి వారికి సరియైన విధంగా విమర్శించటం రాకుంటే, మనకే కాదు వారికి కూడా ఎన్నో నష్టాలు వుంటాయి. అందుకే సరైన విధంగా విమర్శించటం కూడా ఒక కళగా చెప్పవచ్చు.

ఒక సద్విమర్శ మన అభివృద్దికి సహాయపడే విధంగా కూడా ఉండవచ్చు. మనం గుర్తించని విషయాన్నీ మనని పరిశీలించే వారు గుర్తించి మనకి ఒక సలహాలాగా చెప్పవచ్చు. అలా మనం చూడని కోణాన్ని, పరిశీలించని విషయాన్నీ ఎదుటి వారు మనకి చెపితే మనకు ఎంతో ఉపయోగం. ఎదుటి అభిప్రాయం మన అభివృద్దికి సోపానం కావచ్చు. ఫ్రండ్స్ "ఇంగ్లీష్ భాషలోని అక్షరాలలో ABCDEF అక్షరాలు అన్ని కలిగి ఉన్న అతిచిన్న పదం ఏమిటో మీకు తెలుసా?.... ఆ పదం feedback మాత్రమే. అందుకే ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ అంటాడు......."We all need people who will give us feedback. That's how we improve అని.

ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు ...విమర్శకి, ఫీడ్ బ్యాక్ కి వున్నా తేడా ఏమిటి అని? ఈ రెండిటికి తేడా....విమర్శ మనని భాధ పెడుతుంది, ఫీడ్ బ్యాక్ మన అభివృద్దికి దారి చూపుతుంది. ఇతరులు మనకి మన పని గురించి ఫీడ్ బ్యాక్ ఇస్తేనే మంచింది. కాబట్టి మనం చేసిన పనికి, మనకి ఎవరైనా ఒక ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. అయితే ఆ ఫీడ్ బ్యాక్, మనకి ఒక విమర్శలా మాత్రమే అనిపించి, కొన్ని సార్లు ఎమోషనలుగా మనం డిస్టబ్ కావచ్చు. కొన్ని సార్లు ఆ విమర్శ, లేదా ఫీడ్ బాక్ తో ఎంతో నేర్చుకొని, అభివృద్ధి కావచ్చు. ఫీడ్ బ్యాక్ వలన డిస్టబ్ కావద్దు అంటే ఎదుటి వారు మనకి సరైన విధంగా, ఒక పద్దతి ప్రకారం ఫీడ్ బ్యాక్ ఇస్తే ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే పెద్దలు అంటారు " ఇతరుల విమర్శ మనకి జల్లుల వర్షంలాగా సున్నితంగా వుండాలి కాని, మన వేర్లనే నాశనం చేసే సునామిలా ఉండకూడదు అని. అలా సున్నితంగా, ఒక జల్లులా మాత్రమే వుండాలి అంటే, దానినే సాండ్విచ్ ఫీడ్ బ్యాక్ అని అంటారు.

అసలు ఈ సాండ్విచ్ ఫీడ్ బ్యాక్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒక బేకరీలో సాండ్విచ్ తిన్నారా? మీరు ఆ శాండ్విచ్ని చూస్తే, దానికి ఇరువైపులా బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా. మరియు ఆ రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో స్టఫ్ అయిన క్యారెట్టు, కీరా, బట్టర్ లాంటివి ఉంటాయి కదా. అలాగే మనవి సాండ్విచ్ ఫీడ్ బ్యాక్ లో కూడా, రెండు బ్రెడ్ ముక్కల్లా ఎదుటి వ్యక్తికి సంబంధించిన ప్రశంశలు వుంటాయి, అలాగే వాటి మధ్యలో మనం ఇవ్వాలనుకున్న ఫీడ్బ్యాక్ లేదా విమర్శ ఉంటుంది. అలా మన విమర్శని రెండు ప్రశంశల మద్యలో వుంచటం ద్వార ఎదుటి వ్యక్తి మన ఫీడ్ బ్యాక్ కి విలువని ఇచ్చి, దానిని అంగీకరించే అవకాశం వుంటుంది. ఇలా ఇతరులు చేసిన పనిలోని మంచి విషయాలు ముందుగా గుర్తించి, ఆ మంచి విషయాలకి సంభందించిన ప్రశంసతో మనం సంబాషణని మొదలెట్టి, ఆ తర్వత మనం ఇతరులు వారి పనిని ఎలా మెరుగు చేసుకోవచ్చు చెప్పి, చివరికి మరొక మంచి ప్రశంషతో మనము సంబాషణ ముగించడమే సాండ్విచ్ ఫీడ్ బ్యాక్.

ముఖ్యంగా మనం ఇలాంటి సాండ్విచ్ ఫీడ్ బ్యాక్ ఎందుకు ప్రోత్సహించాలి అంటే, ఒక పని గురించి అందరికీ అన్ని విషయాలు తెలవకపోవచ్చు, ఎందుకంటే ఒక విషయం గురించి ఇతరుల దృష్టి కోణం వేరు ఉండవచ్చు. మనకి తెలియంది ఏదో, ఎదుటి వ్యక్తికి తెలిసినప్పుడు వారి నుండి ఒక సలహా తీసుకోవడం వలన మనకే లాభం కదా. ఇతరుల సలహాలని వాడుకోవడం నేర్చుకోవాలి.ఒక్క మన అనుభావల నుండి మాత్రమే మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇతరుల అనుభవాలు కూడా మనకి ఎన్నో గొప్ప విషయాలు నేర్పగలవు. కాబట్టి ఎప్పుడు మన పని గురించి ఫీడ్ బ్యాక్ అడగాలి, అలాగే ఇతరుల పనుల గురించి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. ఇలా చెయ్యడం వలన ఇద్దరి మద్య బందం కూడా బలపడుతుంది. మనం చేసే విమర్శలను సద్విమర్శలుగానే ఎదుటి వ్యక్తి చూస్తారు. ఇతరులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారా మనం చెయ్యాల్సిన పనులను చేసి, ఆ ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వ్యక్తికి వచ్చిన ఫలితాల గురించి చెపితే వారు ఎంతో ఆనందిస్తారు. భవిషత్తులో ఎన్నో సహాయాలు చెయ్యడానికి కూడా సిద్దంగా వుంటారు. ఇలా విమర్శల ద్వార మనుషుల మద్య దూరం పెరగకుండా...బంధం బలోపేతం అవుతుంది. సో ఫ్రండ్స్ ఈ రోజు మీరు ఎవరికీ ఈ సాండ్విచ్ ఫీడ్ బ్యాక్ పద్దతిలో ఫీడ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో ఆలోచించడి. అల్ ది బెస్ట్.


లైవ్ టీవి


Share it
Top