వేదిక మీద విజేత కావడం ఎలా?

వేదిక మీద విజేత కావడం ఎలా?
x
Highlights

ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం.... వేదికల మీద మాట్లాడాలంటే వచ్చే భయాన్ని ఎలా జయించాలి అని.. ఫ్రెండ్స్! కొద్ది మంది వక్తలు, వేదికల...

ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం.... వేదికల మీద మాట్లాడాలంటే వచ్చే భయాన్ని ఎలా జయించాలి అని..

ఫ్రెండ్స్!

కొద్ది మంది వక్తలు, వేదికల మీద చాలా అద్భుతంగా, అనర్గళంగా అందంగా మాట్లాడుతూ, వేదిక క్రింద వున్న శ్రోతలను తమ మాటలతో మంత్ర ముగ్ధులను చేస్తు, తమ ప్రసంగం ద్వార తమ ఆలోచనల్ని, అనుభవాలు పంచుకుంటూ, ఒక అమోఘమైన భావనని, ఆలోచనలని వారి శ్రోతల హృదయాల్లో ప్రవేశపెడతారు. ఇక వారి ప్రసంగానికి శ్రోతలు చప్పట్లు కొట్టి అభినందనలు అందిస్తారు, అలాగే జే జే లు పలుకుతూ, సన్మానాలు కూడా చేస్తారు.

ఫ్రెండ్స్! మీరు ఈ ప్రపంచంలో చాల మంది గొప్ప నాయకులని చూస్తే వారిలో ఎంతో మంది మంచి వక్తలు కూడా.. ఉదాహరణకి...మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఒక గొప్ప ఉద్యమం నడపడానికి అతని ఉపన్యాసాలను తన అస్త్రంగా వాడాడు. అలాగే తన శారీరక ఎత్తు తక్కువైన, తన ప్రసంగాల ఎత్తు ఎంతో ఎక్కువగా వుండటం వల్లే, హిట్లర్ తన సైన్యాన్ని, తన జాతి ప్రజలని ఉపన్యాసాలతో ఎంతగానో ప్రభావితం చేసాడు. ప్రస్తుతం మన భారతదేశంలో చూసినా కూడా ఎ నాయకులైతే వేదికల మీద మాట్లాడగలుగుతున్నారో, మాటలతో మేజిక్ చేస్తున్నారో, వారు ఎన్నో ఎన్నికల్లో విజయాలు సాదిస్తున్నారు. ఇప్పటివరకు మీరు కూడా ఎంతోమంది మంచి వక్తలని చూసివుండవచ్చు, అలాంటి వక్తలని, విన్నప్పుడు, చూసినపుడు మనం కూడా అలా మాట్లాడుతే ఎంతో బాగుంటుంది అని, వారిల గుర్తింపు తెచ్చుకోవాలని అనిపిస్తుంది.

ఇలాంటి కోరిక చాల మందికి వున్నా, ఆ కొరికని సాదించే క్రమంలో ఒక్కసారి వెధకపై మాట్లాడటానికి, వేదికని ఎక్కగానే..................... మన కాళ్ళు గతి తప్పుతుంటాయి... మైక్ వద్దకి వెళ్లి.......చేతితో మైక్ని పట్టుకోగానే...చేతిలో చెమటలు ప్రవహిస్తూవుంటాయి. మన గుండె గూడ్స్ బండిలా పరిగెడుతుంది, గతంలో ప్రిపేర్ అయిన ఉపన్యాసం అంతా, గజని సినిమాలో హీరోలా, మన బ్రెయిన్ నుండి ఊడ్చుకు పోతుంది.... మాటలు తడబడతాయి, గొంతు తడారిపోతుంది............నాలిక నావల్ల కావట్లేదు అంటుంది.... చివరికి... చెప్పాల్సింది చెప్పక, ఇంకేదో చెప్పి, పులి నుండి తప్పించుకున్న, జింక పిల్లలా వేదికని దిగివచ్చేస్తారు. అసలు..... నలుగురితో కూచొని చాలా బాగా మాట్లాడే వీరు వేదిక మీదకి వెళ్ళగానే మాత్రం, ఎందుకు మాట్లాడలేక పోయామా అని ఆలోచిస్తూ కూర్చుంటారు.

ఫ్రెండ్స్ ఇలాంటి సమస్యనుండి మనం తప్పించుకోవాలి అంటే, వేదికల మీద విజేతగా నిలబడాలి అంటే, ఈ ఉపన్యాసకళలో మనం ఉద్దండులం కావాలంటే, మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆచరించాలి.... ఆ అమూల్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దామా?

1. వేదిక మీద భయపడాల్సింది ఏమి లేదు, ఒక్క భయానికి తప్ప.

ఫ్రెండ్స్! వేదికల మీద మాట్లాడడానికి భయపడేవారు, ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. భయానికి సంబంధించి అమెరికాలో జరిగిన ఒక సర్వేలో, మనుషుల యొక్క అన్ని భయాలలో మొదటి స్థానంలో ఉన్న భయం, వేదిక మీద మాట్లాడమంటే వచ్చే భయమెనటా.

ఈ భయాన్ని మనం జయిన్చకుంటే మాత్రం, భయంతో వేదికకి దూరం వెళితే మాత్రం, మనకు ఎన్ని మంచి ఆలోచనలు ఉన్నా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఉపయోగం లేకుండా పోతుంది. అందుకై ఈ భయాన్ని జయించడం కొరకు, మనం చేయాల్సిన మొదటి పని.....

మనం ప్రసంగించే విషయంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటో గుర్తించి, మన మనస్సుని, దృష్టిని ఆ విషయాల పైనే పెట్టాలి. అలా చెయ్యడం వల్ల మన మనసు భయం నుండి ప్రసంగం వైపు మరలుతుంది.

అదెలా సాద్యం అని మీకు అనుమానం రావచ్చు.... అదెలా అంటే......

ఎలాగైతే చీకట్లో నడిచే వ్యక్తికి... ఆ చీకటిని చూసి రకరకాల ఉహాలు, భయాలు తన మదిలో రావచ్చు, కాని అదే వ్యక్తి ఆ సమయంలో హనుమాన్ చాలీసా మీద కాని, మరో దైర్యం ఇచ్చే మంత్రం మీద కాని తన దృష్టిని మళ్లిస్తే మాత్రం తన భయం తగ్గుతుంది. అలాగే మన స్పీచ్ లోని ముఖ్యవిషయాల మీద, మన ద్రుష్టి మరల్చటం చాల అవసరం.

2. స్పీచ్ ఇచ్చే అందరు భయపడతారట లేదా అబద్దం చెబుతారట.

స్పీచ్ ఇవ్వడం విషయంలో ప్రపంచ ప్రముఖుల్లో ఒకరైన mark twain ఇలా అంటారు...ఈ ప్రపంచంలో రెండు రకాల వక్తలు మాత్రమే ఉన్నారట, మొదటి వారు స్పీచ్ ఇచ్చేటప్పుడు భయపడతామని చెప్పేవారట, ఇక రెండవ వారు బయపడట్లేదని అబద్దం చెప్పేవారని. కాబట్టి ఫ్రండ్స్

ఎలాంటి వ్యక్తి కైనా, ఎలాంటి వక్తకైన, నలుగురి ముందు మాట్లాడాలంటే, ముందుగా కొంత మేరకు ఇబ్బంది, భయం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి తన ప్రసంగాన్ని మొదలు పెట్టగానే, తమ ఆంగ్జైటీ టెన్షన్ తగ్గుతూ వెళుతుంది, ఆ ప్రసంగం ఒక ప్రవాహంలా ప్రవహిస్తుంది.

3. ఎ విషయం, ఎవరికి చెప్పాలనుకుంటున్నారు.

ఒక వక్త విజయం, ఆ వక్తకి ఎంత నాలెడ్జ్ వుంది అనే విషయము మీద కాకుండా, అతని నుండి ఆడియన్స్ ఎంత నాలెడ్జ్ తీసుకున్నారు అనే దాని మీదే ఆధారపడివుంటుంది. ఒక వక్త యొక్క 90% విజయం వేదికపై వెళ్ళక ముందుకే డిసైడ్ అవుతుంది అంటారు.

ఎందుకంటే ఒక వక్త విజయవంతంగా ఉపన్యాసం ఇవ్వాలి అంటే, తన శ్రోతలు ఎవరు, వారి యొక్క అవసరము ఏంటి, తన శ్రోతల నాలెడ్జ్, వారి పరిస్థితులు, వారి అవసరాలు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడం ద్వారా, వారికి ఉపయోగపడే విధంగా తన సమాచారాన్ని, తన ప్రసంగాన్ని వక్త మలుచుకోగలడు. అలా మలచుకోవడం వల్లే "బరాక్ ఒబామా" తన స్పీచ్ ల ద్వార ఎంతో ప్రభావితం చేస్తూ అమెరికా అధ్యక్షుడైనాడు. ఇలా చెయ్యడం ద్వార మీరు కూడా విజేతలుగా నిలవవచ్చు.

4. స్పష్టంగా, ఇష్టంగా మూడు ముక్కల్లో చెప్పడం ముఖ్యం.

ఒక వక్త తన ప్రసంగంలో, తను చెప్పాలనుకున్న విషయానికి సంబంధించి సమాచారాన్ని పూర్తిగా సేకరించిన తర్వాత, ఆ సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం ఏర్పరచుకోవాలి. తన ప్రసంగాన్ని మూడు భాగాలుగా విభజించికోవాల్సి ఉంటుంది, ఒకటి స్పీచు యొక్క ఓపెనింగ్, రెండు స్పీచు యొక్క క్లోజింగ్, మూడు స్పెచ్చ్ మధ్యలోని అత్యంత ముఖ్యమైన విషయాలు. ఇలా మూడు భాగాలుగా ప్రసంగాన్ని విభజించుకోవడం వల్ల వక్తకి, శ్రోతలకి చాల స్పష్టత పెరుగుతుంది. అలా ప్రిపేర్ చేసుకున్నతర్వాత, ఆ విషయాన్నీ ప్రసంగించేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం అవసరం, అందుకని ముందుగా ఆ ప్రసంగాన్ని రెండు లేదా మూడు సార్లు పెద్దగా భయటికి చదివి ప్రాక్టీసు చెయ్యడం చాల ఉపయోగకరం.

5. ఉత్సాహంతో మాట్లాడటం వల్ల ప్రభావం రెట్టింపు అవుతుంది.

ఒక వక్త తన ప్రసంగాన్ని చాలా బాగా ఇవ్వాలి అనుకుంటే, ఆ అంశంపై ఆ వక్త యొక్క ఉత్సాహం చాలా ప్రభావితం చేస్తుంది. మీరు ఎప్పుడైతే మీ ప్రసంగంలో అత్యంత ఉత్సాహంతో మాట్లాడుతుంటారో, మీ యొక్క ఉత్సాహం శ్రోతలని కూడా చాల ప్రభావితం చేస్తుంది. మీకు మీ ప్రసంగం యొక్క విషయంలో ఇంట్రెస్ట్ ఉందా, లేదా అనే విషయం శ్రోతలకి మీ ఉత్సాహం ద్వార అర్ధం అవుతుంది. కాబట్టి మీరు ప్రసంగించేటప్పుడు చాలా ఉత్సాహంగా ప్రసంగించడం అవసరం. అలా ఎంతో ఉత్సాహంగా భారతదేశ గొప్పతనం గురించి 1893 సెప్టెంబరు 11న చికాగోలో, మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో స్వామీ వివేకానంద చేసిన ప్రసంగం ఎంతో సుప్రసిద్ధమైనదిగా చరిత్రలో నిలిచిపోయింది.

6. మల్లి మల్లి మాట్లాడుతూ వుండటం.

ఎ వేదిక మీద నైనా భయం లేకుండా, అనర్గళంగా, ఉత్సాహంగా ప్రసంగించి, అందరి మన్ననలను పొందాలని అనుకుంటే మాత్రం, రెగ్యులర్గా రకరకాల వేదికలపై మాట్లాడుతూ ఉండాలి. అందుకోసం మీరు ఎ సబ్జెక్టు మాట్లాడాలని అనుకుంటున్నారో ఆ సబ్జెక్టు లో పూర్తిగా మునిగిపొండి...అదే సబ్జెక్టు లో బాగా లోతుగా వెళ్ళండి, ఆ తర్వాత ఆ సబ్జెక్టు మీ గుండె లోతుల్లోకి వస్తుంది, చివరిగా మీ ప్రసంగం ద్వార ఆ సబ్జెక్టు ని మీ శ్రోతల గుండెల్లోకి పంపే పనిని మీరు ఒక వక్తలా చెయ్యగలరు.

ఫ్రెండ్స్... ఎప్పుడైతే ఇలా ప్రసంగించడం మొదలుపెడతామో, అప్పుడు కొద్దిరోజుల్లోనే వక్తగా ప్రతి వేదిక మీద.....మన మాటలని తుటాల్లా పెల్చగలము.......... మన ఆలోచనని అందంగా పంచగలం...మన శ్రోతల చేత శాబాష్ అని అనిపించుకోగలము.... ఎక్కడ అవకాశం వచ్చిన అందిపుచ్చుకొని అశేష విజయాలనిమన అకౌంటు లో వేసుకోగలం. అలా మీరు సాదిస్తారని, సాదించాలని ఆశిస్తూ... అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories