పట్టుదలని ఇలా పట్టుకుంటే, ప్రతి విజయం మీదే!

పట్టుదలని ఇలా పట్టుకుంటే, ప్రతి విజయం మీదే!
x
Highlights

ఒక మనిషి ఎ గొప్ప విజయం సాధించాలనుకున్న, అది సాధించే క్రమంలో ఎన్నో అడ్డంకులు రావచ్చు, అయితే వాటిని తట్ట్టుకొని, వాటిని దాటిన వ్యక్తికే విజయలక్షి...

ఒక మనిషి ఎ గొప్ప విజయం సాధించాలనుకున్న, అది సాధించే క్రమంలో ఎన్నో అడ్డంకులు రావచ్చు, అయితే వాటిని తట్ట్టుకొని, వాటిని దాటిన వ్యక్తికే విజయలక్షి కరుణిస్తుంది. అందుకే విజేత కావాలనుకొనే వ్యక్తి వద్ద ఉండాల్సిన ముఖ్యమైన సంపద పట్టుదల. అప్పుడే తన లక్ష్య సాధనలో, ఎన్ని అడ్డంకులు వచ్చిన ఉడుంపట్టు పట్టి విజేతగా నిలుస్తాడు. అందుకే పట్టుదలని మించిన ఆస్థి అతనికి ఏమీ ఉండదు.

పట్టుదల వున్న వ్యక్తి జీవితంలో ఎన్నో సాధించ గలుగుతాడు. ఎన్నో వందల సార్లు బల్బ్ కనిపెట్టే సమయంలో ఫెయిల్ అయిన ఎడిసన్ కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ఒక రోజు బల్బుని కనిపెట్టి మన అందరికి వెలుగుని ఇచ్చాడు. అలాంటి పట్టుదలని ఎలా మనం పెంచుకోగలమో ఇప్పుడు తెలుసుకుందాము.

విజేతలకి, పరాజితులకి మధ్య వ్యత్యాసం ఏంటి అంటే, విజేతలు తము చెయ్యాల్సిన పనిని అందరూ వదిలేసిన, ఎవ్వరు ఎంకరేజ్ చెయ్యకున్న, కొందరు నిరుత్సాహపరిచిన పట్టుదలతో ఆ పనిని సాధించడం కోసం తమ కృషిని చేస్తూనే వుంటారు. వారినే పట్టుదల కల్గిన వ్యక్తి అని మనం అంటాము. ఆ సమయంలో వారి ఫోకస్ అంతా వారు సాదించబోవు విజయ ఫలితాల మీదే వుంటాయి. వారు వేసే ప్రతి అడుగు తమ లక్ష్యానికి దగ్గరగా తీసుకెలుతుందని వారికీ తెలుసు. చివరవరకు పట్టు పట్టి గట్టిగా నిలిచేవారు మాత్రమే, ఆ నాటి భక్త మార్కండేయుడిలా యముడిని కూడా ఒప్పిస్తారు, నలుగురి మెప్పు సాధిస్తారు, చిరకాలం తారగా నిలుస్తారు.

మనిషి పట్టుదల ఒక కనపడిన అస్త్రంలా ఆ మనిషికి సహాయపడుతుంది, ఎలాగైతే ఎంత పెద్ద బండ రాయి అయినా దాని మీద ఒక్కో నీటి బొట్టు, బొట్టుగా పడుతూ ఉంటే, ఆ రాయి మీద నీటి బొట్టు ప్రభావం ఎలా చూపెడుతుందో, అలాగే ఏ పనినైనా క్రమబద్ధంగా, పట్టుదలతో చేస్తూ ఉంటే ఎంత గొప్ప విజయమైన మనం సాధింగలము.

అబ్రహం లింకన్ తన జీవితంలో ఎన్నో ఓటములు చూసినా, ప్రతి పోటిలో ఓడినా కూడా పట్టుదలతో వుండటం ద్వారనే అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఇలా పట్టుదలగా ఉన్న వ్యక్తి ఇతరులకి మొండివాడు గా కనబడవచ్చు, కానీ ఏ వ్యక్తి అయితే పట్టుదలతో ఉంటాడో, ఆ వ్యక్తికి తన విజయసాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆ అడ్డంకులన్నీకొండలైతే కరిగిపోతాయి, దూదిపింజలైతే ఎగిరిపోతాయి, అలా వారి అడ్డంకులన్నీ దూరమవుతాయి. చివరికి ఒక రోజు విజేతలుగా నిలబెడుతూ మన పట్టుదల మనకి తోడుగా వుంటుంది.

ఒక్కోసారి మనం చేయాలనుకున్న పని మొదలు పెట్టిన తర్వాత, చాలా ఇబ్బందులు లేదా కష్టాలు రావచ్చు, అప్పుడు ఆ పనిని చెయ్యకుండా ఆపటం లేదా ఆ పనిని అక్కడికే వదిలేయటం, మరొకటి చేసుకున్ధములే అనుకోవడం చాల సులభమైన విషయం, కానీ ఆ సమయంలో పట్టుదలతో ఒక్కో అడుగు ముందుకు వేయగలిగితే, అది మనకి చాలా కొత్త ఉత్సాహం ఇస్తుంది. ఎందుకంటే ఒక పని నుంచి తప్పించు కోవడం వల్ల ఎవరికి ఏమీ ఉపయోగం ఉండదు, అలాగే మన మీద మనకి నమ్మకం తగ్గుతుంది, కానీ పట్టుదలతో ఆ పని సాధిస్తే అందరకి ఉపయోగం వుంటుంది. మన ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది.

మీ కష్ట సమయంలో పట్టుదలని పెంచుకోడానికి ముందుగా ఆ పనిని మీరు ఎందుకు మొదలెట్టారో, ఆ కారణాన్ని ఒక సారి గుర్తుకి తెచ్చుకోవాలి. ప్రతి గొప్ప పనికి కొన్ని అడ్డంకులు వస్తాయని అంగీకరించాలి. ఆ పని సాధించడం వల్ల వచ్చే లాభలు గుర్తుకు చేసుకోవాలి. ఆ పని సాధించటం ఇతరులకి ఎలాంటి ఉపయోగాలు వున్నాయో గుర్తుకి చేసుకోవాలి.

కొద్దిమంది వారు చేయాలనుకున్న పని లో కొన్ని ఓటములు కొన్ని ఇబ్బందులు రాగానే ఆ పని మీద వారికి ఇంట్రెస్ట్ పోతుంది, ఆ ఓటమిని తట్టుకోలేక పోతారు. ఒకసారి ఫెయిల్ కావడం వల్ల "అంతా అయిపోయింది" అని ఆ పని వాళ్లు వదిలేస్తారు. కానీ ఫెయిల్యూర్ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలావుంది. ఫెయిల్యూర్ అని మనం చూసేది వాస్తవానికి, ఒక ఫీడ్ బ్యాక్ మాత్రమే అని గుర్తున్చ్కోవాలి. ఫెయిల్యూర్ నుండి నేర్చుకోకపోతే మనకు ఎన్నో నష్టాలు ఉంటాయి. కాబట్టి ఫెయిల్యూర్ ని ఫెయిల్యూర్ లాగా చూడకుండా అది ఒక నేర్చుకునే ఫీడ్ బ్యాక్ లాగా చూసి దాని నుంచి ఏమి నేర్చుకోవాలో నేర్చుకొని, తర్వాత ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది. అలాంటి సమయములోనే మన పట్టుదలే "నడిసముద్రంలో ఒక పడవల" మనని ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది.

కొన్నిసార్లు కొద్దిమంది వారు కోరుకున్న విజయాన్ని పొందడానికి కొంచెం దగ్గరలో ఉండగానే, అలా విజయం వుందని తెలియక ముందుగానే ఆ పనిని వదిలేస్తారు. అయితే మీరు పట్టుదలతో చివరి వరకు కృషి చేయడం వల్ల విజేతలుగా నిలవగలరు. కాబట్టి మన లక్ష్యం నుంచి మనం ఎంత దూరంలో ఉన్నామే తెలియకున్న, చివరి వరకు పోరాటం చెయ్యటం వల్ల, కృషి చెయ్యటం వల్ల, శ్రమించటం వల్ల తప్పక విజేతగా మీరు నిలుస్తారు.

సూర్యుడు ఉదయించటానికి కొన్ని నిమిషాలముందు, ఆకాశం చాల చీకటిగా వుంటుంది, కాని చీకటిని తిట్టుకుంటూ ఉండకుండా, ఎవరైతే కొంత సమయం ఓపికతో ఉంటాడో, అతను అందమైన సుర్యోదయాన్ని ఆస్వాదించగలడు, ఆనందించగలడు.

సో ఫ్రెండ్స్.. మీ లక్ష్యాల విషయంలో మీరు పట్టుద్దల యొక్క పక్షంలోనే నిలబడి గొప్ప విజయాలు సాధించాలని ఆశిస్తూ. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories