"ఇలా చేస్తే ఏకాగ్రత ఎప్పుడు సాధ్యమే!"

ఇలా చేస్తే ఏకాగ్రత ఎప్పుడు సాధ్యమే!
x
Highlights

మన బలం యొక్క రహస్యం ఏకాగ్రతలో దాగుంది అని పెద్దలంటారు. అలాగే మనిషి ఎ పనిలోనైన ఈ రోజు విజేతగా నిలవాలి అంటే ఏకాగ్రత చాలా అవసరమంటున్నారు నేటి...

మన బలం యొక్క రహస్యం ఏకాగ్రతలో దాగుంది అని పెద్దలంటారు. అలాగే మనిషి ఎ పనిలోనైన ఈ రోజు విజేతగా నిలవాలి అంటే ఏకాగ్రత చాలా అవసరమంటున్నారు నేటి శాస్త్రజ్ఞులు. అసలు ఈ ఏకాగ్రత ఎలా వస్తుంది, ఎలా పోతుందో మీకు తెలుసా! అలాగే కొన్ని విషయాలో మన ఏకాగ్రత సహజంగానే వున్నట్టు అనిపిస్తుంది, కాని కొన్ని విషయాల్లో అసలు కుదరదు. అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా ఫ్రెండ్స్! ముఖ్యం ఒక విద్యార్ధి సినిమా చూస్తున్నప్పుడో, లేదా క్రికెట్ చూస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో చూస్తాడు, కానీ పుస్తకాలూ పట్టుకోగానే మాత్రం ఏవో ఆలోచనలు వచ్చి పూర్తి ద్యాస ని చదువు పై పెట్టలేక పోతాడు. అలా జరగవద్దు అంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాము.

మనం ఏకాగ్రత సాదిస్తున్నాము అని తెలియటానికి కొలమానం ఏమిటంటే...మనం మూడు వారాల పాటు మన చేతిలోని పని మీద మనం ఏకాగ్రతతో సాధన చేస్తే, మనం సరైన దారిలో వున్నట్టే. అలాగే మనము ఎ పని ఏకాగ్రత తో చేస్తున్నమో.. అది ఒక పుస్తం చదవడం అయితే, చదివింది అర్థం కావడం, జ్ఞాపకశక్తి వంటివి పెరుగుతాయని కూడా చెపుతున్నారు. కాబట్టి మీరు ఎ పని చేస్తున్నా కూడా ఆ పనిలో ఎంత నిమగ్నమై చేస్తున్నారో ఒక్క సరి చెక్ చేసుకోండి.

ఇప్పుడు ఈ నిమిషంలో మనం ఏ పని చేస్తున్నామో దానిలోనే పూర్తిగా లీనం కావడాన్ని ఏకాగ్రత అంటారు. కాబట్టి చేస్తున్న పనిలో, చేతిలో వున్న పని మీద ముందుగా పూర్తి ద్రుష్టి పెట్టాలి. ప్రస్తుతం మీరు ఎక్కడ వున్నారో, అక్కడ ఏమి చేస్తున్నారో, ఆ పని పైన మీ ఏకాగ్రత ఎలా వుందో చూసుకోండి.

ఫ్రెండ్స్ ! ఈ రోజుల్లోఉద్యోగులైన, వ్యాపారవేత్త లేదా స్టూడెంట్స్ ఎవరైనా, లేదా పని ఏదైనా సరే ఏకాగ్రత తప్పనిసరి వుండాల్సిందే. కానీ ఇప్పటి స్మార్ట్‌ఫోన్‌లు, క్షణానికో వాట్సాప్‌ మెసేజ్, లేదా పేస్ బుక్ నోటిఫికేషన్, లేదా ఇన్స్టగ్రాము ఫొటోస్ దూసుకువస్తు మన ఏకాగ్రత అసాధ్యం....అనే విధంగా మారుతోంది. ముఖ్యంగా వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు అది ఏకాగ్రతలా అనిపిస్తుంది, కాని మీరు దగ్గరిగా గమనిస్తే అది ఒక వ్యసనం అని అర్ధం అవుతుంది. కాబట్టి వీటన్నింటినీ దాటుకుని మన చేతిలోని పనిపై ఏకాగ్రత నిలపడమెలా అనేది మనం తెలుసుకోవలసిన అవసరం ఈ రోజుల్లో ఎంతో వుంది.

మనము ఏ పనిచేస్తున్నా, మన మనస్సులోకి ఏవేవో ఆలోచనలు వచ్చిపోతువుండటం జరుగుతూవుంటుంది..అవి ఆ రోజుకి సంబందించిన కావచ్చు, లేదా ఏదైనా గత విషయాలు గుర్తుకి రావచ్చు, లేదా మీ భవిషత్తు కు సంబందించిన ఆలోచన అయివుండవచ్చు...అయితే చాలా సందర్భాల్లో అది పెద్ద సమస్యేమీ కాదు అని అనిపిస్తుంది. కానీ పూర్తిగా ఏకాగ్రతని కేంద్రీకరించాల్సిన సందర్భాలు కూడా మన జీవితంలో కొన్ని వుంటాయి. మనము ఏకాగ్రతను అలవర్చుకోవడం వల్ల, లేనిపోని ఆలోచనలు రావడం చాల వరకు తగ్గిపోతాయి. అలాగే మనం చేస్తున్న పని మీద ధ్యాస కూడా కుదురుతుంది. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి.

ఏ పని చేసినా దృష్టి పెట్టి చెయ్యాలని పెద్దలు ఎప్పుడు చెపుతుంటారు. అది నిత్య సత్యం అని మనం గుర్తించాలి. పిల్లలు చురుకుగా, ఏకాగ్రతతో వుండటం నేర్చులోవాలి. అలాగే ఏకాగ్రత లేకుంటే మాత్రం వారు దేనిమీద ద్రుష్టి పెట్టలేక బద్ధకస్తులవుతారు...అలాగే వారి చదువులో కూడా వెనుకపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఏకాగ్రత సాదనతో సాధ్యమే, మీరు కొన్ని పద్దతులు పాటించడం ద్వార ఏకాగ్రతని పెంచుకోవచ్చు.

ఈ ఏకాగ్రతని సాధించటానికి ముందుగా, మన పనికి అంతగా ప్రాధాన్యం లేని విషయాలని మనసు నుంచి, పరిసరాల నుంచి దూరం చేస్తేనే అసలైన వాటిపై ద్రుష్టి పెట్టగలం. కాబట్టి రోజులో మీరు చేయాల్సిన అనివార్యమైన, అతిముఖ్యమైన పనులని గుర్తించండి. ఆ సమయంలో మిగతావాటన్నింటికీ 'నో' చెప్పండి. ఆ గంటా, రెండుగంటలు మీ మొబైల్‌ ఫోనుని దూరంగా ఉంచండి. అలాగే టీవీ లాంటివి లేని ప్రదేశంలో కూర్చోండి.

మరో ముఖ్యమైన విషయం రోజులో ఏ వేళలో మీ మనసు తాజాగా, ఉత్సాహంగా ఉంటుందో గుర్తించండి. ఆ వేళలోనే కీలకమైన పనులు చేయండి. ఒకసారి ఒకటే పని ఎంచుకోండి. ఒకేసారి ఎక్కువ పనులు చేసే మల్టీటాస్కింగ్‌ ఏకాగ్రతకి బద్ధశత్రువనే విషయం మరిచిపోవద్దు. మల్టీటాస్కింగ్‌ చాల సందర్భంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు.

అలాగే ప్రతి రోజు ఉదయం ఒక ఐదు నిమిషాలు, ఆ రోజు మీరు చేయాల్సిన పనుల్ని ఒక్కసారి గుర్తుకు చేసుకోండి. అవన్నీ విజయవంతంగా పూర్తిచేసినట్టూ, నలుగురూ మిమ్మల్ని ప్రశంసించినట్టూ వూహించండి! మీకున్న సానుకూల అంశాలని గుర్తుకుచేసుకోండి. రోజూ ఇలా ఓ అయిదు నిమిషాలు చేసి చూడండి. చక్కటి ఏకాగ్రత మీ సొంతమవుతుంది. ముఖ్యంగా మీ చేతిలోని పనిని పూర్తి శ్రద్ధతో చెయ్యడం మొదలు పెట్టారంటే...ఏకాగ్రతని మీరు ఎంచుకున్నరనే అర్ధం. సో ఫ్రెండ్స్ మనం చర్చించిన అంశాలని ఆచరణలో పెట్టి మీ ఏకాగ్రతని పెంచుకుంటారని ఆశిస్తూ...అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories