డబ్బు మరింత డబ్బుని పుట్టిస్తుందా?

డబ్బు మరింత డబ్బుని పుట్టిస్తుందా?
x
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... డబ్బు మరింత డబ్బుని పుట్టిస్తుందా? ఫ్రెండ్స్! మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ వెళ్లినప్పుడు అక్కడ...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... డబ్బు మరింత డబ్బుని పుట్టిస్తుందా?

ఫ్రెండ్స్! మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ వెళ్లినప్పుడు అక్కడ వున్నా వ్యక్తులు రకరకాల విషయాల గురించి చర్చించవచ్చు, ముఖ్యంగా రాజకీయం గురించి, మీడియా గురించి, టెక్నాలజీ గురించి, సోషల్ మీడియా గురించి ఇలా ఎన్నో విషయాలు చర్చిస్తూన్టారు కదా! ఇలా ఇతర వ్యక్తులు డబ్బు గురించిన టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే ... డబ్బుకు సంబంధించి వారికి రకరకాల అభిప్రాయాలు వున్నాయని మీకు అర్ధం అవుతుంది. ముఖ్యంగా డబ్బు అనే టాపిక్ రాగానే కొద్ది మంది మాట్లాడటానికి ఇష్టపడరు, మరికొంతమంది డబ్బు గురించి మాటలాడటం చేస్తారు... కాని వారి చర్చ చాల వరకు నెగటివ్ గా అనిపించవచ్చు, వారు డబ్బు తప్పుడు పనులు చేస్తేనే వస్తుందని, వాస్తవానికి మంచివారు డబ్బు సంపాదించలేరని, డబ్బు వస్తే ఎలాంటి మనిషికైనా పొగరు వస్తుందని, డబ్బు వున్నవాళ్ళు చాల అహంకారం తో ప్రవర్తిస్తారని, ఈ రోజుల్లో ఏదో స్కాం చేయ్యనిదే డబ్బు ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తారు. వారి మాటలు వింటున్నవారు కూడా కొంతమంది అవును...అవును...అని అనవచ్చు. కానీ ఇది పూర్తిగా వాస్తవమా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

వాస్తవానికి ఇవి అన్ని అర్ధ సత్యాలే.... ఇందులో ఎన్నో అపోహలు...ఇలా ఎన్నో అపోహలు వారు డబ్బు విషయంలో కలిగివుంటారు. అయితే మరి కొద్దిమంది ఎప్పుడైతే డబ్బు అనే విషయం రాగానే , దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడక, ఆ విషయం గురించి పెద్దగా చర్చించక, వారు కొద్దిగా ఇబ్బంది పడుతూ తప్పించుకొంటారు. అయితే వారికీ కూడా కొన్ని నమ్మకాలూ డబ్బు విషయంలో వున్నాయని మనం అర్ధం చేసుకోవాలి. ఫ్రండ్స్! అలాగే మీకు కూడా కొన్ని నమ్మకాలు, డబ్బుకి సంబంధించి ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీకు వారసత్వంగా వచ్చిన ఆ నమ్మకాలు ఏంటో మీరు తెలుసుకోవాలి.

వారసత్వం అని ఎందుకు అంటూన్నాము అంటే...ఈ నమ్మకాలు ఎక్కువగా మనకి మన తల్లిదండ్రుల నుంచి లేదా మనల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా మనము పెరిగే క్రమంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి, రకరకాల విషయాల గురించి, డబ్బు గురించి ఎన్నో నేర్చుకుంటాం. మన చుట్టూ వుండే వ్యక్తులు, మన చుట్టూ జరిగే సంఘటనలు, మన చుట్టూ డబ్బు విషయమై ఏర్పడే సందర్భాలు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి. ఇలా మీరు మీ చుట్టూ వున్నా పరిస్థితుల నుండి, వ్యక్తుల నుండి ఏమి నేర్చుకున్నారో మీకు తెలుసా! మీరు ఈ విషయాల గురించి ఎరుక కలిగి ఉండాలి.

సో ముందుగా మనం అర్ధం చేసుకోవాల్సింది... మన వారసత్వ నమ్మకాల గురించి... ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వారిని మనం గమనిస్తూ ఉంటామో, వారి ప్రభావం మనపై, మన మనస్సుపై, మన నమ్మకాల పై చాలా ఉంటుంది అని అర్ధం చేసుకుంటామో, ఈ విషయంలో మనం ప్రగతి సాదించడం చాల సులభం అవుతుంది. ఇప్పుడు మనకి వారసత్వంగా వచ్చిన నెగటివ్ నమ్మకాలూ ఏమైనా వుంటే.... వాటి ప్రభావాన్ని తగ్గించుకొని, డబ్బు డబ్బుని ఎలా సంపాదిస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీకు ఒక ప్రశ్న అలాగే వున్నట్టు అనిపించవచ్చు. అసలు డబ్బు మరింత డబ్బుని పుట్టిస్తుందా? అని... ఈ ప్రశ్నకి సమాధానం...... అవును..అనే చెప్పాలి. మీ వద్ద వున్నా డబ్బు మరింత డబ్బుని పుట్టించగలదు. అందుకే చాల మనది పెద్ద వారు అంటారు... మొదటి పది లక్షలు సంపాదించటమే కష్టం, ఆ తర్వాత ఆ పది లక్షల రూపాయలే మీకు మరెన్నో లక్షల రూపాయలను తీసుకువస్తుంది అని అంటారు.

దీనిని సులువుగా అర్ధం చేసుకోవడం కోసం...మనం ఒక ఉదాహరణ సహాయం తీసుకుందాం. ఒక రైతు తన పొలంలో పత్తిని పండిచాలని కోరుకుంటే, ఆ పత్తి పంటను పండించడానికి, పత్తి విత్తనాలను ముందుగా సిద్దం చేసుకుంటాడు కదా. అలాగే తన వద్ద వున్నా పత్తికి సంబంధిచిన సరైన విత్తనాలను, సరైన విధంగా, సరైన సమయంలో, సరైన నేలలో నాటడం వల్ల, ఆ విత్తనాలకు సంబంధించిన పంట పండుతుంది అని ఆ రైతుకు తెలుసు. తన కృషి, ప్రకృతి సహకారం వుంటే..చాల మంచి పంట వస్తుంది అని తెలుసు, ఇక మార్కెట్ కూడా బాగా వుంటే.. తనకు మంచి ఆర్ధిక లాభం అని కూడా తెలుసు. అయితే ఆ రైతుకి కూడా తను నాటే ఒక్కో విత్తనం నుండి భవిష్యత్తులో ఎన్ని విత్తనాలు వస్తాయో చెప్పడం చాలా కష్టమవుతుంది కదా. ఈ ప్రపంచంలోనే ఈ విషయం గురించి ఎవ్వరు చెప్పలేరు కదా. కాని ఆ రైతుకి తెలుసు... అంతా అనుకూలిస్తే....తను నాటిన విత్తనలకన్నా ఎన్నో ఎక్కువ రెట్లు విత్తనాలు వస్తాయని మాత్రం తెలుసు. ఇది ప్రకృతి నియమం అని ఆ రైతుకు తెలుసు. తను పంట కోసం పెట్టే విత్తనాలను ప్రకృతిలో ఒక పెట్టుబడిగా తను భావించవచ్చు. సో ఫ్రండ్స్! ఇలాగె మనం కూడా మన వద్ద ప్రస్తుతం వున్న డబ్బుని ఒక విత్తనంలా సరైన పద్దతిలో, సరైన ప్రాంతంలో పెట్టుబడిగా పెడితే మాత్రం, ఎన్నో రెట్ల డబ్బుని మన వద్ద వున్నా డబ్బు పుట్టిన్చగలదు. మరి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెడితే లాభం వుంటుంది. అసలు పెట్టుబడి పెట్టేముందు ఏమి చూసుకోవాలి..ఇలాంటి విషయాలను ముందు ముందు చర్చిద్దాము. సో అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories