Top
logo

చదవడానికి బద్దకమైతే ఇలా చెయ్యండి

చదవడానికి బద్దకమైతే ఇలా చెయ్యండి
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... 'చదవడానికి బద్దకమైతే ఇలా చెయ్యండి' కొద్దిమంది విద్యార్థులకు చదవు...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... "చదవడానికి బద్దకమైతే ఇలా చెయ్యండి"

కొద్దిమంది విద్యార్థులకు చదవుకోవాలని తెలిసిన, పరిక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరిక వున్నా కూడా, చదువుకోడానికి కూర్చోగానే బద్దకంగా అనిపిస్తుంది. అలా బద్ధకం వారి పాలిట ఒక పెద్ద సమస్యగా మారుతుంది. "బద్ధకం అంటే మనని, మన నిన్న లోనే బంది చేసేది అని అర్ధం అంటారు పెద్దలు". ఫ్రండ్స్ మీకు కూడా చదవాలని అనుకున్నప్పడు బద్ధకంగా అనిపిస్తుందా? ఒక వేళ మీకు కూడా ఇలా అనిపిస్తే, ఇది చాలా సహజమనే గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలామందికి ఏదో ఒక విషయంలో బద్ధకం వుంటుంది, అయితే దీనివలన వారు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులను వాయిదా వేస్తూ వుంటారు. అందుకే పెద్దలు అంటారు...ఈ బద్ధకం సులువైన పనులను కూడా క్లిష్టమైనవిగా మారుస్తుంది, క్లిష్టమైన పనులను అతి క్లిష్టం చేస్తుంది.

ఒక విద్యార్థికి చదువుకోవాలి అనుకోగానే బద్ధకం బలంగా వచ్చి అడ్డుగా నిలబడవచ్చు, ఆ సమయంలో ఆ విద్యార్థికి ఎంతో గిల్ట్ గా ఫీల్ అయ్యి ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ బద్దకాన్ని ఎలా జయించాలో చూద్దాం. చాలామందికి చదువుకోవడానికి బద్ధకంతో ఒక పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని చూస్తే... కొద్దిమందికి చదువుకోవడానికి కావాల్సినంత మోటివేషన్ లేక జరుగుతుంది, మరికోద్దిమందికి చదువుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని నమ్మడం వలన జరుగుతుంది, మరికోద్దమందికి....చదువుకోవడం వల్ల వచ్చే లాభాలు తెలియకపోవడం వలన లేదా చాలామందికి చదువుకోడానికి కావలసిందిగా పరిస్థితులను ఎలా సృష్టించుకోవాలి తెలియక పోవడం వల్ల కూడా చదవటానికి ఇబ్బంది పడతారు, ఇవి చాల ముఖ్యమైన కారణాలు.

మనకి అత్యంత ముఖ్యమైన విషయమైనా చదువుకి అడ్డుగా కొన్ని సందర్భాల్లో ఈ బద్ధకం వస్తూ ఉంటుంది, ఈ బద్ధకం అనేది ఎక్కువ అయితే, ఇది ఒక అలవాటుగా మారి, మన చదువుని చాలా పెద్ద ఎత్తున దెబ్బతీస్తుంది. ఇలా బద్ధకం అలవాటుగా అయిపోయిన తర్వాత, మనకి పరీక్షల్లో మనం అనుకున్న మార్పు రాకపోవడం, పరీక్షల్లో మనం అనుకున్న ఫలితాలు రాక పోవడం వలన మనం చెయ్యాలనుకున్న, ఎన్నో పనులను చేయలేకపోతున్నాం. అయితే ఇప్పడు మనం చర్చించే ముఖ్యమైన కొన్ని విషయాలు మనం ఆచరించడం ద్వారా ఈ బద్దక్కాన్ని జయించవచ్చు.

మొదటిది.......చదవడం వల్ల లాభాలు ఏమిటో స్పష్టంగా రాసుకోండి: ముందుగా మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని, అసలు మీరు ఎందుకు చదువుకోవాలని అనుకుంటున్నారు, ఎవరి కోసం చదువు కోవాలని అనుకుంటున్నారు, అలాగే మీరు మంచిగా చదువు కోవడం వలన ఎన్ని లాభాలు వున్నాయో ఒక పేపర్ పైన స్పష్టంగా వ్రాసుకోండి, చదువు కోవడానికి మీరు ఎన్ని ఎక్కువ కారణాలు వ్రాస్తే అంత ఈజీ గా బద్దకాన్ని మీరు వదిలించుకోవచ్చు.

రెండవది.....చదవక పోవడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో స్పష్టంగా రాయండి: మీరు మీ బద్ధకం చెప్పినట్టే చదవకుండా వుంటే, మీకు ఏమైనా నష్టాలు ఉన్నాయా ఆలోచించడి, మీరు చదవక పోవడం వలన ఎలాంటి ఇబ్బందులను భవిష్యత్తులో అనుభవిస్తారో ఉహించండి, ఇలా మీరు చదవకుండా ఉండిపోతే మీ కుటుంభ సభ్యులు ఎంత బాధపడతారు, అలాగే మీరు ఎన్ని అవకాశాలను కోల్పోతారు, ఎన్ని విషయాల్లో ఆర్ధికంగా నష్టపోతారు, ఇవన్ని ఒక పేపర్ మీద స్పష్టంగా వ్రాయండి. ఇలా వ్రాయటం వలన, ఇన్ని నష్టాలని ఎదుర్కోవడం కన్నా చదువు కోవడం ఉత్తమం అని మన మనస్సు మోటివేట్ అవుతుంది. కొద్దిమందికి ఈ పద్ధతి చాల బాగా పనిచేస్తుంది.

మూడవది......మీ భౌతిక పరిస్థితుల ని సిద్ధం చేసుకోండి: మనం చదువు కోవాలనుకుంటున్నప్పుడు, మన చుట్టూ వున్నా బౌతిక పరిస్థితులు కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి, మీ ఎదురుగా మీకు బాగా నచ్చిన సిన్మా టీవీ లో వస్తుంటే చదవడం కష్టమే, అలాగే ఆకలితో వున్నప్ప్దుడు చదవడం కష్టమే, కాబట్టి మీ చుట్టూ వున్నా పరిస్థితులను ముందుగా మీరు మార్చుకోండి, ఒక రూమ్ లో ఎలాంటి డిస్ట్రక్షన్స్ లేకుండా చేసుకోండి. ఇలా మీ చుట్టూ పరిస్థితులను సెట్ చేసుకోవడం వలన ఎక్కువ సేపు చదువుకోగలరు.

నాలుగవది.....ముందు ఒక స్టడీ ప్లాన్ ని తయారు చేసుకోండి: మీ దగ్గర ఉన్న సమయాన్ని సరైన విధంగా ప్రణాళిక అవసరం ముఖ్యంగా ఆ సబ్జెక్టు ఎంత సమయం కేటాయించడం అంటున్నారు మీ క్యాలెండర్ ప్లాన్ చేసుకోండి ఆ తర్వాత పబ్లిక్ లోనే అతి ముఖ్యమైన విషయాలను చదువుకోడానికి ఈరోజు ఎంత సమయం కేటాయిస్తున్నారు మీ క్యారెక్టర్ లో బంగారు ఆ తర్వాత రోజువారీ విషయాలు ఇక్కడి ముఖ్యమైన దానిని ముందుగా కంప్లీట్ చేయండి ప్రతిరోజూ ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో వీలైతే చదవండి.

అయిదవది........ఒక్కొక్క పని చేసుకుంటూ క్రమశిక్షణతో ముందుకు వెళ్ళండి: మీరు ప్లాన్ చేసుకున్న విషయాన్నీ ఆచరణలో పెట్టటం చాల ముఖ్యం. కాబట్టి మీ ప్లాన్లో ఒక్కో పనిని చేస్తూ వెళ్ళండి, అన్ని ఒకేసారి చేసెయ్యాలని చూడకుండా, ప్రతి రోజు ఒక సమయంలో చదువుతూ వుండటం వలన, ఒక క్రమశిక్షణ ఏర్పడి మీ మనస్సు చదువుతున్న విషయాన్ని బాగా అర్ధం చేసుకుంటుంది.

ఆరవది...........విజయవంతంగా చదువుకున్న తర్వాత మీకు మీరు ఒక బహుమతి ఇచ్చుకోండి: మీరు అనుకున్న విధంగా చదువు కోవడం అవ్వగానే, మీకు మీరు ఒక బహుమతి ఇచ్చుకోండి, అది ఎంత చిన్న బహుమతి అయిన పర్వాలేదు, అది ఒక చాక్లెట్ కావచ్చు, లేదా కొద్ది సేపు మీకు నచ్చే టీవీ ప్రోగ్రాం అయివుండవచ్చు, ఇలా ఏదైనా పర్లేదు. ఇలా బహుమతి మీకు మీరు అలవాటు చేసుకోవడం ద్వార చదువుకుంటే వెంబడే వచ్చే ఆ బహుమతి మీ మనస్సును ఉత్సాహపరుస్తుంది.

ఫ్రెండ్స్ చివరిగా...బద్ధకం అనేది...మన క్రెడిట్ కార్డ్ లాంటిది...అదే వాడేప్పుడు బాగుంటుంది, కానీ బిల్లు వచ్చినప్పుడే దిల్ బాధపడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చర్చించిన విషయాలు ఆచరణలో పెట్టడం ద్వార, మీ బద్దకాన్ని బద్దలు కొట్టి విజేతగా మీరు నిలవగలరు. అల్ ది బెస్ట్.

Next Story