"విజేత కావాలంటే ఈ అయిదు మాటలు మీరు వాడకూడదు"

విజేత కావాలంటే ఈ అయిదు మాటలు మీరు వాడకూడదు
x
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... "విజేత కావాలంటే ఈ అయిదు మాటలు మీరు వాడకూడదు". "మాటే మంత్రం..మనసే బంధం...." అని వేటూరి...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... "విజేత కావాలంటే ఈ అయిదు మాటలు మీరు వాడకూడదు".

"మాటే మంత్రం..మనసే బంధం...." అని వేటూరి సుందరామ్మూర్తి గారి కలం నుండి వచ్చిన "సీతాకోకచిలుక" సినిమాలోని పాట మీరు వినేవుంటారు. ఆ పాటలో రచయిత అన్నట్టు...మన మాటలు ఎదుటివారి మనసు మీద, మన మనసు మీద కూడా మంత్రాల్లా పనిచేస్తాయి. అయితే మన మాటలు మంత్రాలలా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ మరియు ఇంపాక్ట్ చెయ్యాలంటే మాత్రం, మనం ఎలాంటి పదాలు వాడలో తెలియాలి, అలాగే ఎలాంటి పదాలు వాడకూడదో కూడా తెలియాలి.

ఫ్రెండ్స్! మన రోజు వారి భాషలో మనము వాడె కొన్ని పదాలకి "గన్ పౌడర్" తో నిండిన బుల్లెట్లలా చాల శక్తి వుంటుంది. ముఖ్యంగా ఆ పదాలు మన అంతచేతన మనస్సులో కొన్ని భావాలను సృష్టించి మనని ప్రభావితం చెయ్యగలవు. అందుకే మన రోజువారీ జీవితంలో మనం ఎలాంటి పదాలు ఎక్కువగా వాడుతున్నామో చూసుకోవాలి, ముఖ్యంగా ఎ పదాలు నష్టపరుస్తాయో తెలుసుకోవాలి.

అయితే విజేతలందరికీ తెలుసు... పాజిటివ్ పదాలు, పాజిటివ్ పనులకి దారితీస్తాయని, అలాగే ఆ పాజిటివ్ పనులు తిరిగి, వారు వాడె పదాలని కూడా ప్రభావితం చేస్తాయని. అందుకే విజేతల మాటలు వింటే, వారు ఎప్పుడు కూడా "కొన్ని మాటలు" వాడరు. ముక్యంగా అయిదు మాటలు వాడకుండా వారిని వారు ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటారు, దానికి కారణం ఏంటంటే...వారు వాడె పదాలతో, వారు ఇతరులకు "ఎనర్జీ వైబ్స్" పంపుతారని వారు గుర్తించటం వలెనే. అలాగే విజేతలకి తెలుసు "ఒక వ్యక్తి తనలో తను మాట్లాడుకొనే "సెల్ఫ్ టాక్" లో కూడా ఎలాంటి పదాలు వాడితే ఉపయోగం ఉంటుందో.

ఈ విషయలు తెలియక చాలామంది "నెగటివ్ పదాలు" వారి సెల్ఫ్ టాక్ లో వాడుకొని, వారిని వారే ఇబ్బంది పెట్టుకుంటారు, అలాగే ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. వాస్తవానికి ఆ పదాలలో, ఆ మాటలలో తప్పు లేకపోవచ్చు. కానీ ఆ పదాల లోపల, లేదా మాటల ద్వార వచ్చే భావంలో లోపం ఉంది, కాబట్టి వాటిని వాడకుండా మనం జాగ్రత్త వహించాలి. ఇప్పుడు విజేతలు సాదారణంగా వాడని అయిదు మాటలు ఏమిటో చూద్దాం.

ఇందులో మొదటి పదం .... "కానీ".

ఎవరినా మీతో....మీ డ్రెస్ బాగుంది, కాని దాని డిజైను బాలేదు అని అంటే....అప్పడు మీరు ఎలా ఫీల్ అవుతారు. అది ఒక పొగడ్తలా అనిపిస్తుందా మీకు లేక విమర్శల అనిపిస్తుందా ఒక్కసారి ఆలోచించండి. చాల సార్లు "కాని" లేదా "BUT" అనే పదం తర్వాత నెగటివ్ సెంటెన్స్ అనిపిస్తుంది. ఎప్పుడితే "కాని" అంటున్నామో...ముందు చెప్పిన విషయం యొక్క ప్రాముక్యత పోతుంది. కాబట్టి విజేతలు వారి సంభాషణలో "కాని" అనే పధం వాడకుండ, అవసరమైతే "మరియు" లేదా AND అనే పదాన్ని ఎక్కువగా వాడుతారు.

రెండు........... "అసాద్యం".

విజేతలు ఈ Impossible పదాన్ని Im'Possible అన్నట్టు చూస్తారు. అసాధ్యం అనే పదంలో కూడా వారికీ సాధ్యం అనే భాగమే కనపడుతుంది. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ "అసాద్యం" అనే పదం వాడగానే లేదా వినగానే, మన మనస్సు క్లోజ్ అయిపోతుంది. ఉదాహరణకి...ఒక వ్యక్తి ఇతరులను తన ఇంటిలోనికి రానీయకుండా ఇంటి తలుపులు మూసివేసిన విధముగానే, అసాద్యం అనగానే...మనం అనుకుంటున్నా విషయంలో మన మనస్సు తన తలపులు ముసివేస్తుంది. చాల సందర్భాల్లో ఒక పని చేసి చూసే వరకు ఆ పని చెయ్యడం సాధ్యమో, అసాద్యమో ఎవ్వరికి తెలియదు. గాలికన్న బరువైనవి వస్తువులు ఆకాశంలో ఎగరడం అసాధ్యమని చాలామంది నమ్మారు, కానీ రైట్ బ్రదర్స్ మాత్రం అలా అనుకులేదు, కాబట్టే వారి మనస్సు వారికీ ఒక దారి చూపింది. ఒక పని అయ్యే అవకాశం వుందో లేదో తెలియనప్పడు, ఈ అసాద్యం అనే పదం వాడకండి. ఎందుకంటే ఈ పదాన్ని మన అంతచేతన మనస్సు అంగీకరించిన తర్వాత ఈ పని ఎప్పటికి సాధ్యం కాదు.

మూడు..... "ప్రయత్నిస్తా"

ప్రయత్నం అనే పదం వినడానికి చాల బాగా వుంటుంది. కాని మనం "నేను ప్రయత్నిస్తాను" అని చెప్పినప్పుడు, మనం నిశ్చయంగా, ఆ పనికి పూర్తిగా సిద్ధంగా లేమని అర్ధం. ప్రయత్నిస్తాను అంటే...ఫలితాన్ని ఇస్తాను అని అన్నట్టు కాదు. అసలు ట్రై చేస్తా అన్నారంటే, దాని అర్ధం రెండు విషయాలట. ఒకటి ట్రై చేస్తా అంటే బాద్యతకి భరోసా లేదని! రెండు ట్రై చేస్తా అంటే ఆ పని చెయ్యగలనని నమ్మకం లేదని అర్ధమట! కాబట్టి విజేతలు "నేను ప్రయత్నిస్తాను" అని అనకుండా, దానికి బదులుగా వారు ఎల్లప్పుడూ "నేను చేస్తాను" అని, లేదా "నేను చెయ్యను" అని అంటారు. ఇప్పటి నుండి మీరు ఎప్పుడు ట్రై అనే పధం వాడినా కూడా, ఒక్క క్షణం ఆగి, మీరు ఆ పదం వెనక అంతర్లీనమైన మీనింగ్ ఏంటో గుర్తించండి.

నాలుగు... "అంతా వారి వలెనే"

"చిత్రం భళారే విచిత్రం" సినిమాలో బ్రంహానంధం.. తన ప్రతి సమస్యకి తన తాత నే కారణం అంటాడు, ఎందుకు అంటే మా తాత కోట్లు సంపాదించి వుంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అంటాడు. ఇలా కొద్ది మంది వారి ప్రతి సమస్యకి కారణం వేరే వారు అని BLAME గేమ్ అడుతువుంటారు. ఇలా "అంత వారి వలెనే" అనే మాట కూడా, మనని ఒక విషయంలో బాధ్యతని తీసుకోకుండా, ఇతరుల మీద తప్పుని మోసే సందర్బాలలో ఎక్కువగా వాడతాము. అయితే ఇలా మనము మన ఫలితాలకి ఇతరులని కారణంగా నిందిస్తూ పొతే...మన జీవితం యొక్క రిమోట్ కంట్రోల్, మనం ఇతరులకి ఇస్తున్నట్టే... కాబట్టి ఇలా ఇవ్వకుండా మన లైఫ్ రిమోట్ కంట్రోల్ మన దగ్గేరే వుంచుకోవాలి అంటే మాత్రం...ఈ మాట వాడటం మనం ఆపెయ్యాలి. మన విజయానికి, మన ఓటమికి మనమే పూర్తి బాద్యత తీసుకోవడం వలన విజేతగా నిలుస్తాము అని గుర్తించాలి.

అయిదు...అంత సీన్ లేదు.

ఎవరైనా మనని ఒక విషయములో పొగిడినప్పుడు లేదా మనలో వున్నా ఒక టాలెంట్ ని గుర్తించి అభినందిన్చినపుడు, మనం చాలా సందర్భాల్లో నాకు "అంత సీన్ లేదండి" అనే పదం వాడుతాము. దీనివల్ల ఎదుటి వ్యక్తి ఇచ్చిన అభినందనని స్వీకరించకుండా, మనని మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. అలాగే ఇతరులు వారి కలల గురించి మనకి చేప్పినప్పుడు కూడా, మనం ఇలాంటి పదాలు వాడితే వారి భవిష్యత్తుకు మనం నష్టం చేస్తున్నట్టే, కాబట్టి మన విషయంలో అయినా లేదా ఇతరుల విషయంలో "అంత సీన్ లేదు" అనే పదాన్ని లేదా మాటని వాడకుండా ఉండాలి.

ఫ్రండ్స్! ఇలా ఈ అయిదు మాటలను మనం వాడకుండా వుండటం వలన, అలాగే సరైన మాటలనే మనం వాడటం వలన, మన మాటలను మంత్రాలలా వాడగలము, అలాగే మనసుల మద్య బంధాలను కూడా బలోపేతం చేసి ఒక విజేతలా నిలబడగలము. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories