Top
logo

మీ భయాన్ని భంగపరచండి ఇలా!

మీ భయాన్ని భంగపరచండి ఇలా!
Highlights

ఫ్రెండ్స్! ఈ ప్రపంచంలో మనం భయపడాల్సింది ఏమైనా వుంది అంటే, అది ఒక్క మన భయమే అంటారు రూజువెల్ట్. ఎందుకంటే ఎంతో...

ఫ్రెండ్స్! ఈ ప్రపంచంలో మనం భయపడాల్సింది ఏమైనా వుంది అంటే, అది ఒక్క మన భయమే అంటారు రూజువెల్ట్. ఎందుకంటే ఎంతో మంది వారు కోరుకున్న జీవితాన్ని, వారు జీవించకుండా వారిని ఆపేది, వారి భయమే కాబట్టి. రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్నసినిమాలో సునీల్ పాత్ర, ఆ ఇంటి గడప దాటలంటే భయపడి నట్టుగా, ఎంతో మంది, వారి భయాలు గీసిన గీతని దాటలేరు. చాలామందికి ఒక దెబ్బ తాకితే కలిగే నొప్పి కన్నా, ఆ దెబ్బ ఎక్కడ తాకుతుందో అనే భయం వలన కలిగే ఆందోళనే ఎక్కువ ఉంటుందట. వాస్తవానికి భయం మంచింది కాదు, చెడ్డది కాదు. ఆ భయానికి మన ప్రతి స్పందననే మనకి మంచి, చెడులను నిర్ణయిస్తుంది. అయితే ప్రమాదాల నుండి మనని సురక్షితంగా ఉంచడానికి, భయం ఒక స్నేహితుడిలా కూడా పని చేస్తుంది. కానీ అదే భయం మనని, తన బందిఖానలో బంధిస్తే మాత్రం మనకి చాల నష్టం అవుతుంది. కాబట్టి ఈ భయాన్ని మనం తెలుసుకొని, మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలకు దీనిని ఒక టూల్ గా వాడుకోవడం మంచిది. మనం భయం యొక్క సూచనలు తీసుకోవాలి, కానీ భయం గుప్పెట్లో గూడు కట్టుకోవద్దు.

అయితే మన చాల భయాలకి మూల కారణం, ఆ విషయంలోని మన అజ్ఞానం లేదా ఆ విషయం మనకి అర్ధం కాకపోవడం. మొట్ట మొదటిసారిగా ఒక వ్యక్తి లిఫ్ట్ వాడిన, లేదా విమానప్రయాణం చేసిన, లేదా ఎలా తనకు అంతగా తెలియని ఎ కొత్త పని చేసిన కూడా, కొంత ఆదుర్త, భయం కలగవచ్చు. కాని ఆ పని కి సంబంధించిన అవగాహనా, జ్ఞానం రాగానే మాత్రం అంత భయం ఉండదు. కాబట్టి అసలు మీకు భయం ఎ విషయంలో వస్తుందో, అది ఎలా పని చేస్తుందో గుర్తించండి. దాని మూలం ఏంటో గుర్తించండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించండి, ఈ విధంగా భయం మీద, మీ తిరుగుబాటును ప్రకటించవచ్చు..

దీనికి ముందుగా మనం, మనని ఎ భయం భయపెడుతుందో ఆలోచించాలి. కొద్దిమందికి జీవితంలో ఏది సదిన్చలేనేమో అని భయం, కొద్దిమదికి ఒక పనిలో ఓడిపోతామనే భయం, కొద్దిమందికి ఇతరుల ప్రేమని కోల్పోతారేమో అని భయం, మరి కొద్ది మందికి..ఆర్ధిక కష్టాలు వస్తాయేమో అని, కొద్దిమందికి ఉద్యోగం రాదేమోనని, మరి కొద్ది మందికి వున్న ఉద్యోగం పోతుందేమో అని, కొద్దిమందికి తమని అందరు విమర్శిస్తారేమో అని, ఎవరైనా అవమానిస్తరేమో అని లేదా ఇతరులు తమకి సరైన గుర్తింపు ఇవ్వరేమో అని, ఇలా రక రకాల భయాలలో బంది అయిపోతారు. ఈ భయాలు మనని ఎలాంటి పని చేయ్యనీకుండా ఒక నిర్జీవ జీవిగా చేసి కట్టిపడేస్థాయి, ఆ సమయంలో ఒక నిస్సహాయ స్థితిలో వున్నట్టు, మన బ్రెయిన్ లో ఒక స్తబ్దతని సృస్టిస్తాయి.

ఎ భయమైన కూడా మన యొక్క ఎన్నో అవకాశాలను మనకి దూరం చేస్తుంది. ఒక అవకాశం మన ముందుకి వచ్చినప్పడు అది ఒక సమస్యల కనపడవచ్చు, ఆ సమస్యని చూసి మనం భయపడగానే, అందులోని అవకాశం మనకి కనపడదు. ఎందుకంటే అప్పడు మన బ్రెయిన్ లో పానిక్ బట్టన్ పని చేస్తూ ఏది ఆలోచించలేము. చాలా మంది వారి కలలను జీవించలేక పోవడానికి కారణం, వారు వారి భయాలతో జీవించడమే, అందుకే ఈ ప్రపంచంలో ఎక్కువమంది కలలను చంపేసింది మాత్రం వారి భయాలే అంటారు. అయితే అలాంటి భయం ఒక మానసిక స్థితి మాత్రమే అని మనం గుర్తించాలి. ఆ భయం పై కంట్రోల్ తెచ్చుకొని దాని స్థానంలో దైర్యం నింపుకోగలగాలి. ఎందుకంటే ఎ భయాన్ని అయితే మనం జయిన్చలేమో, అది మన యొక్క పరిమితిగా మారిపోతుంది. ఆ పరిమితి మన ఎన్నో అవకాశాలకు అడ్డు కట్ట వేస్తుంది. కాబట్టి మన భయాన్ని మనం జయిన్చాల్సిందే.

అయితే భయాన్ని జయించాలంటే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే కుదరదు, బయటికి వెళ్లి పనిలో పడిపోతేనే అది సాద్యం అవుతుంది. అందుకే అంటారు మనం చీకటికి భయపడము, ఆ చీకట్లో ఏదో వుందని భయపడతాము...మనము ఎత్తుగా వున్నా ప్రదేశానికి భయపడము, అక్కడ నుండి ఎక్కడ పడిపోతమేమో అని భయపడతాము, అలాగే మన చుట్టూ వున్నా మనషులకు భయపడము, కానీ వారు ఎక్కడ మనని అవమానిస్తారో అని భయపడతాము. ఫ్రండ్స్ ముఖ్యంగా మీరు గుర్తుకి పెట్టుకోవాల్సింది...మిమ్మలిని చంపలేని ప్రతి భయం, మిమ్మల్ని ఇంకా భలవంతులుగానే మారుస్తుంది అని, కాబట్టి ఈ భయాల నుండి ఎలా భయటపడాలో ఎప్పుడు చూద్దాము.

ఎ భయమైన మీకు రాగానే, వచ్చింది అని మీరు గుర్తించగానే, మొదటి స్టెప్ ఏడూ దీర్గ శ్వాసలు తీసుకోండి. ఎప్పుడైతే దీర్గ శ్వాసలు తీసుకుంటారో మీ బ్రెయిన్ రిలాక్స్ అయ్యి, ఆలోచించగలరు, ఆ తర్వాత ఈ భయం వలన, లేదా మీరు భయపడుతున్న విషయం వలన, ఎక్కువలో ఎక్కువగా మీ జీవితంలో ఏమి అవుతుంది అని ఆలోచించండి. ఒక్క సారి ఇలా ఆలోచించక మీరు వెంబడే ఏమి చేస్తే మీరు కోరుకున్న దైర్యం వస్తుందో ఆలోచించడి. ఈ ఆలోచన స్ట్రాంగ్ గా కావటానికి మీ భయాన్ని జయించి మీరు కోరుకునే విజయాన్ని సాదించినట్టు ఉహించండి. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా మీ లక్ష్యం వైపు ఒక్కో అడుగు ముందుకి వేయండి. ఇంకా కొంచెం భయం అవుతున్న కూడా, ఒక్కో అడుగు వేస్తూనే ముందుకి వెళ్ళండి. ఎందుకంటే దైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం వున్నా కూడా తను కోరుకున్న వైపు ఒక్కో అడుగు వెయ్యడమే. ఫ్రండ్స్ ఇప్పటి వరకు మనం చర్చిన అంశాలను, మీరు భయపడే విషయాల్లో ఆచరణలో పెట్టి, భయం యొక్క బందిఖానలో బంది కాకుండా, దైర్యే సాహసే లక్ష్మి అంటూ ముందుకు సాగండి. అల్ ది బెస్ట్.

Next Story

లైవ్ టీవి


Share it