మార్పు మంచిదే!

మార్పు మంచిదే!
x
Highlights

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం...... మార్పు మంచిదే! జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతుంది, అయితే ఈ మార్పు మనకి సంతోషం తెస్తుందా?...

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం...... మార్పు మంచిదే!

జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతుంది, అయితే ఈ మార్పు మనకి సంతోషం తెస్తుందా? లేదా ఇబ్బందిని తెస్తుందా? అనేదే అసలు ప్రశ్న. కొద్దిమంది అసలు మార్పుని ఇష్టపడరు. వారికీ ప్రస్తుతం వున్నా స్తితి లోనే అంతా వుండాలని కోరుకుంటారు. వచ్చే మార్పు వారిని ఎంతో ఇబ్బంది పెండుతుందేమో అని భయపడతారు. వారికీ ఒక ఇల్లు మారాలన్న భయం. ఉద్యోగం మారాలన్న భయం. కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకోవాలన్న భయం. ఈ భయాల కారణంగా ఎలాంటి మార్పు లేకుండా, వారికీ ఎప్పుడు తెలిసిన పరిస్టితులలోనే వుండాలని కోరుకుంటారు. కాని అది అసాద్యం కదా, కాలం మారుతూ వుంటుంది. మారుతున్న కాలం తో పాటు మనం అభివృద్ధి చెందుతూ మారుతూవుండాలి.

అయితే చాలామంది వారి జీవితంలో వచ్చే మార్పు ద్వార సంతోషాన్ని, స్వయం-అభివృద్ధిని( Self-Development) కోరుకుంటారు, అలాగే ఎప్పటికి ఆ అభివృద్ధి కొనసాగించడం అవసరము అన్న విషయం మనలో చాలా మందికి తెలుసు. కానీ తరచూ మన ద్యాస (Focus) మాత్రం రోజువారి విషయాలలో, లేదా తక్షణ సమస్యల వైపే వెళుతుంది, కానీ దీర్ఘకాలిక లక్ష్యం వైపు వెళ్ళదు. దీనికి ముఖ్య కారణం మనం బాహ్యప్రపంచంలో మార్పులైతే కోరుకుంటాం, కాని దానికి తగ్గట్టుగా మన అంత ప్రపంచంలో మార్పులు చేసుకోలేకపోతాం. అలాగే చాలావరకు మన అంత శక్తులని గుర్తించడం, వాటిని మెరుగుపరుచుకోవడం చేయలేకపోతాం. ఉదాహరణకి మీరు శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలనుకుంటే, దాని గురించిన బౌతిక మార్పులైన ఆహార అలవాట్లలో కొన్నిమార్పులు, అలాగే శారీరక వ్యాయామాలు, సరిపోయినంత విశ్రాంతి లాంటి కొన్ని మార్పులు చేసుకోవల్సివుంటుంది. అయితే ఈ మార్పులు ఒక్క రోజులో జరిగేవి కావు కాబట్టి, ఇవి సాధించటానికి కొంత కాలం క్రమబద్ధంగా కొన్ని పనులు చేయాల్సివుంటుంది. అలా చేయాలంటే ముందుగా మనకి ఒక బలీయమైన కోరిక , ఉత్సాహం, క్రమశిక్షన, పట్టుదల లాంటి మానసిక మరియు కొన్ని అంతర్గత శక్తులను గుర్తించి వాడుకోవాల్సి వుంటుంది.

మనం కోరుకునే మార్పుని సాధించి విజేతగా నిలవాలంటే, ముందుగా మన బహింరంగ విజయాలకన్నా, మన అంతర్గత విజయాలు ముఖ్యం అని గుర్తించాలి. మనం ఎ మార్పునైతే కోరుకుంటున్నామో, ఆ మార్పుని ఎందుకు కోరుకుంటున్నాము అనేది మీ అంతరంగంలో స్పష్టత తెచ్చుకోవాలి. ఆ మార్పు లేదా ఆ మార్పు కోసం చేసే పనిని అసలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? అని ఒక నాలుగు ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి. ఆ ప్రశ్నల్లో మొదటిది...ఈ పని చేస్తే లాభం ఏంటి?...రెండు... ఈ పని చేయకపోతే నష్టం ఏంటి?... మూడు..ఈ పని చేస్తే ఎవైన నష్టాలు ఉన్నాయా?... నాలుగు....ఈ పని చేయకపోతే ఏమైనా లాభాలు ఉన్నాయా? అని నాలుగు విధాలుగా ఆలోచించి ఒక స్పష్టమైన ఆలోచనకి వచ్చిన తర్వాత, ఆ కారణాలను ఒక పేపర్ పై వ్రాయండి. ఎప్పుడైతే మీరు ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పారో, మీకు చాల స్పష్టత వస్తుంది. ఇక మీకు ఈ స్పష్టత వచ్చిందో, మీలోని అంతర్గతశక్తికి ఒక ఆజ్యం పోసినట్టు అవుతుంది.

ఎప్పుడైతే మీరు మీ దీర్ఘకాలిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెడతారో, అప్పటినుండి మీ గమనం ఒక పద్దతిలో నియంత్రించబడుతుంది, ముఖ్యంగా మీకు కొత్త కోత్త అవకాశాలు వెతుకుంటూ మీ ముందుకు వస్తాయి. అలాగే ఆ వచ్చే అవకాశాలను మీరు పూర్తి ఆత్మ విశ్వాసంతో అందుకోగలుగుతారు. ముఖ్యంగా మార్పు విషయంలో మీ దృక్పధం ఏమిటి అని మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ వుండండి. మార్పు మంచిదని ముందుగా మీరు గుర్తించండి. మార్పు లేకుంటే ఎలాంటి అభివృద్ధి సాద్యం కాదు. కాబట్టి మార్పుని మనం గ్రహించాలి, గౌరవించాలి. అలాగే రాబోతున్న మార్పులను ముందుగానే పసిగట్టి, వాటిని ఉపయోగించుకోడానికి సంసిద్ధం అయి వుండాలి. ఎప్పుడైతే మీరు మార్పుని ఒక మంచి అవకాశంగా చూస్తారో, ఎప్పుడైతే మార్పుని మీరు కోరుకున్న విధంగా ఉపయోగించుకుంటారో, ఎప్పుడైతే మీరు మీ అభివృద్దికి మార్పుని ఒక మెట్టుగా వాడుకుంటారో, అప్పుడు మీ విజయం తద్యం. అలాగే మీ శ్రమ, మీ కృషి ఒక ప్రవాహములా మీ గమ్యంవైపే పారుతుంది, ఇలా మీరు స్వయం-అభివృద్ధితో, మీరు కోరుకొనే మార్పుని సాధించి విజేతగా నిలుస్తారు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories