" మన బలహీనతలని, మన బలంగా మార్చుకోవచ్చా?"

 మన బలహీనతలని, మన బలంగా మార్చుకోవచ్చా?
x
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం " మన బలహీనతలని, మన బలంగా మార్చుకోవచ్చా?" ప్రతి మనషికి కొన్ని భలాలు, కొన్ని బలహీనతలు ఉండవచ్చు. వాటిని...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం " మన బలహీనతలని, మన బలంగా మార్చుకోవచ్చా?"

ప్రతి మనషికి కొన్ని భలాలు, కొన్ని బలహీనతలు ఉండవచ్చు. వాటిని తెలుసుకుంటే ఆ వ్యక్తికి ఎంతో లాభం కలుగుతుంది. కొన్ని సందర్భాలలో మన యొక్క పెద్ద బలహీనతని ఎదుర్కొనే క్రమంలోనే, మన నిజమైన బలం తెలుస్తుంది అంటారు పెద్దలు. అందుకే చాల మేనేజ్మెంట్ కాలేజీల్లో swot అనాలసిస్ నేర్పుతారు. స్వోట్ అనాలిసిస్ అంటే...మన యొక్క స్త్రెంత్, వీక్నేస్స్ , ఆపర్చునుటి, త్రేటూ అన్ని అర్ధం చేసుకోవడం అని అర్ధం. అయితే ఎ వ్యక్తి అయితే తన బలం గురించే మాత్రమే కాకుండా, తన బలహీనత గురించి కూడా తెలుసుకుంటాడో, అలాగే అతని బలహీనతని తన బలంగా మలచుకోగాలుగుతాడో, అతని యొక్క విజయావకాశాలు చాల ఎక్కువగా వుంటాయి. ఉదాహరణకి అమీతాబ్ బచ్చన్ సినిమా రంగంలో అవకాశలకోసం ప్రయత్నిస్తున్నప్పుడు, చాలామంది తన శారీర ఎత్తు వలన హీరో కావటం కష్టం అని భావించేవారు, కాని కొంత కాలం తర్వాత అమీతాబ్ తన నటనతో పాటు, తన శారీరక ఎత్తునే తన బలంగా సినిమాల్లో పేరు తెచ్చుకున్నాడు. ఇలా మనం మన బలహీనత అనుకునే దానిని కూడా బలంగా మార్చుకోవాలి అంటే ముందుగా మన బలహీనతలని తెలుసుకోవాలి. మరి మన బలహీనతలని ఎలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలో తెలియాలంటే మనం ముఖ్యమైన ఒక ఆరు విషయాలు అర్ధం చేసుకోవాలి. ఆ ఆరు విషయాలు ఎంటో ఇప్పుడు చూద్దాము.

మొదటిది.... గుర్తించండి: మీ బలహీనతని జయించాలి అంటే ముందుగా దాన్ని గుర్తించాలి. మీరు ఆ బలహీనత ఉన్నట్టే గుర్తిన్చకుంటే, దానిని ఎలా ఎదుర్కొంటారు. ఎప్పుడైతే మనం ఒక బలహీనతని గుర్తిస్తామే, అప్పుడు మాత్రమే దాన్ని మనం మార్చగలం. కాబట్టి ఒక పేపర్ మరియు పెన్ను తీసుకొని, మీకు తెలిసిన మీ బలహీనతలు ఏంటో ఆ పేపర్ పై వ్రాయండి.

రెండోది..... అంగీకరించాలి: కొద్దిమందికి వారికి వున్న బలహీనతలు తెలిసిన కూడా అవి వున్నట్టు వారు అంగీకరించారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి తనను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టు వీరు ప్రవర్తిస్తారు. కాని ఇలాంటి ప్రవర్తన వలన వారికే నష్టం అని గుర్తించారు. మనం ఒక బలహీనతని మన బలంగా మార్చుకోవాలంటే మాత్రం, ముందుగా ఆ బలహీనత మనకి వుంది అని అంగీకరించాలి.

మూడవది..... నమ్మకస్తుల సహాయం తీసుకోండి: కొన్ని సార్లు మన బలహీనతని మనం గుర్తించలేకపోవచ్చు. ఇది చాల సహజం, అయితే మన నమ్మకస్తులు లేదా మన శ్రేయోభిలాషులు మాత్రం ఈ విషయంలో మనకి సహాయపడగలరు. అదెలంటే...మీరు బాగా నమ్మే ఒక బంధువుని కానీ, ఒక మిత్రున్ని కానీ, ఒక టీచర్ ని కాని సెలెక్ట్ చేసుకొని, మీ గురించి వారిని అడగండి. వారి పరిశీలన ప్రకారం, మీలో వారు చూసిన బలహీనత ఏంటో అడగండి. వారు చెప్పిన విషయాల గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రండి.

నాలుగవది.... సంసిద్ధంకండి..... మీ బలహీనత ఏంటో మీకు తెలిసిన తరువాత, ఆ బలహీనత ఎదుర్కొనే పరిస్థితి వస్తే, ఆ పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్దంగా వుండండి. ముఖ్యంగా ఆ బలహీనత మీకు ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుంది, ఆ బలహీనత యొక్క ప్రభావాన్ని తగ్గియ్యడానికి ఎలాంటి చర్యలు మీరు తీసుకోవాలో ఆలోచించండి. ఆ తర్వాత ఆ చర్యలు తీసుకోండి.

ఐదవది......నైపుణ్యాలను వాడుకోండి: ఒక్క సారి మీ బలహీనత ఏంటో తెలిసిన తర్వాత, ఆ బలహీనతని ఎదుర్కోడానికి, దాని ప్రభావం తగ్గించుకోడానికి, మీరు ఎ నైపుణ్యాన్ని పెంచుకుంటే లాభమో ఆలోచించండి, ఆ నైపుణ్యాని రోజు కొంత పెంచుకుంటూ వెళ్ళండి. మీకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచుకోడానికి ఎక్కడనైన శిక్షణ తీసుకోవాల్సి వస్తే తప్పక తీసుకొనండి. అది మీకు దీర్ఘకాలంలో చాల సహాయపడుతుంది.

ఆరవది... ఇతరుల బలాలతో మీ బలాన్ని కలపండి: కొన్ని పనులు మనం ఒక్కరమే చేయ్యలేము అని గుర్తించండి, అలాగే అన్ని భలాలు మనకే వుండవు, కాబట్టి మీ బలం ఏంటి, అలాగే ఇతరుల భలం ఏంటో మీరు తెలుసుకుంటే, వారి భలాలను, మీ భలాలను కలపడం ద్వార మీరు ఎంత పెద్ద విజయాన్ని అయిన పొందవచ్చు. కాబట్టి మీ భలం ఏంటి, అలాగే మీ భలహీనత ఏంటో స్పష్టంగా తెలుసుకోండి, అంతే కాకుండా, మీ దగ్గరి వారి లేదా మీ టీం మెంబెర్స్ యొక్క భలాలు, బలహీనతలు తెలుసుకోండి. ఆ తర్వాత మీ భలాన్ని, వారి భలాన్ని కలిపి విజయం సాధించవచ్చు.

ఫ్రెండ్స్! అందుకే పెద్దలు అంటారు... ప్రతి బలహీనతలోను ఒక బలం వుంటుంది అని, కాబట్టి మీ భలాలపై ద్రుష్టి పెట్టండి, బలహీనతల పైన కాదు, మీ వ్యక్తిత్వం పై ద్రుష్టి పెట్టండి, పలుకుబడి పై కాదు, మీకు వున్న వనరులపై దృష్టి పెట్టండి, మీ సమస్యలపై కాదు. సో మనం చర్చించిన ఈ విషయాలను మీరు ఆచరణలో పెట్టడం ద్వార, మీ బలహీనతలను కూడా మీ బలంగా మార్చుకొని, మీరు కోరుకున్న రంగంలో, మీరు కోరుకున్న విధంగా, నిజ జీవితంలో ఒక విజేతగా నిలబడగలరు. అల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories