Top
logo

"పడుకునే ముందు, ఈ పని చేస్తే చాలు"

"పడుకునే ముందు, ఈ పని చేస్తే చాలు"
Highlights

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే విషయం... 'పడుకునే ముందు, ఈ పని చేస్తే చాలు'. ఫ్రెండ్స్ ! మీరు ప్రతి రాత...

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే విషయం... "పడుకునే ముందు, ఈ పని చేస్తే చాలు".

ఫ్రెండ్స్ ! మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు చివరిగా ఏమి చేస్తారు? టీవీ చూస్తారా, స్మార్ట్ ఫోన్ వాడుతారా, ఏదైనా యుట్యూబ్ వీడియో చూస్తారా, లేదా ఫ్యామిలీ మెంబెర్స్ తో కొంత సమయం గడిపి నిద్రకు ఉపక్రమిస్తారా?

ఎందుకంటే మనం పడుకునే ముందు చేసే పని, రాత్రంగా మనం బ్రెయిన్ పైన ఎంతో ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా టీవీ లో వచ్చే క్రైం ప్రోగ్రామ్స్ లాంటివి ఎంతో దుష్ప్రభావం చూపుతాయట. మరి ఎ పని చేస్తే మనకి బాగా ఉపయోగం ఉంటుందో తెలుసుకోవాలంటే, విజేతలు ఏమి చేస్తారో మనకి తెలియాలి. ఎన్నో రంగాలలో గొప్ప గొప్ప విజయాలు సాదిన్చినవారు, రాత్రి పడుకోవడానికి కొన్ని గంటల ముందు ఎలాంటి పనులు చేస్తారో మీకు తెలుసా? విజేతల దినచర్యని పరిశీలించినప్పుడు, వారి గొప్ప విజయాలకి కారణం, వారు రాత్రి పడుకునేముందు చేస్తున్న కొన్ని పనులు ఎంతగానో సహాయపడుతున్నాయని ఎన్నో ఇంటర్వ్యూ లలో వారు చెపుతున్నారు. ఇప్పుడు మనం వారు చేసే ఆ పనులు ఏంటో, అవి ఎలా వారికీ ఉపయోగపడుతున్నాయో చూద్దాము.

ఫ్రెండ్స్! మన కలల కన్నా, మన వాస్తవం అందంగా, సంతోషంగా వుంటే నిద్రపట్టకపోవడం సహజమే. అలా జీవిస్తున్నవారు చాల అదృష్టవంతులనే చెప్పాలి. కాని మన వాస్తవం అలా లేనప్పుడు కూడా, మనకు సమయానికి నిద్ర రాకుంటే మాత్రం ఈ సమస్య నుండి భయటపడాలి. ఇలా ఈ రోజుల్లో నిద్రలేమీ లేదా ఇన్సోమియా అని సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. నిద్ర కోసం ఎన్నో మందులు వాడాల్సిన పరిస్థితిలోకి వెళుతున్నారు. దీనికి ఒక కారణం మన రోజు వారి జీవితంలో ఒత్తిడి పెరిగిపోవడం. ముఖ్యంగా పడుకునే ముందు మనం ఏమి చేస్తున్నాము అనే విషయం కూడా ఒక కారణం. అందుకే ఒక కవి అంటాడు....తెరిచి వున్నా ప్రతి కళ్ళు వాస్తవాన్ని చూస్తున్నట్టు కాదు, మూసుకున్న ప్రతి కళ్ళు నిద్రిన్స్తున్నట్టు కాదు అని. ఇలా నిద్రలేమికి ఒక ముఖ్య కారణం, చాలమంది వారి ఆఫీస్ పనిని, రోజు చివరివరకు తీసుకురావటమట. యిలా చేయడం వలన చాలామంది త్వరగా పడుకోలేరు, త్వరగా నిద్ర లేవలేరు. కాబట్టి దీనికి పరష్కారం కావాలంటే..ముందుగా మనం "అసలు మన రోజుని మనం ఎలా గడుపుతున్నాము" అని అర్ధం చేసుకోవాలి. అందుకే అంటారు .... "మనం పగలును పకడ్బందిగా గడిపితే, అది మనకి నిద్రని నిండుగా తీసుకువస్తుంది" అని.

అలా పగలుని సరైనవిధంగా వాడుకోవడం చాల ముఖ్యం. అలాగే ప్రతి రోజు ఉదయం ఒక కొత్త ఆశతో, ఒక ఆశయంతో నిద్ర లేచి, ప్రతి రాత్రి సంతృప్తి తో నిద్ర పోయేవారు చాల అదృష్టవంతులే. అలా జరగాలంటే మాత్రం...మన మనసు యొక్క గోల ఆపితేనే, నిద్రకి కావాల్సిన జోల పాట వినపడుతుంది. నిద్ర మనకి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది, ముఖ్యంగా మన ఎన్నో అనారోగ్యాలకి అసలు కారణం నిద్రలేమి కూడానట. అందుకే నిద్ర కూడా ఒక ద్యానం లాంటిదే అంటాడు దలైలామా. అయితే నిద్రలేమికి ముఖ్య కారణం, ఈ రోజుల్లో కొద్దిమందికి ఇన్సోమియా వలన నిద్ర రాకుంటే, చాలామందికి మాత్రం ఇంటర్నెట్ వలన రావట్లేదు అనిపిస్తుంది. కాబట్టి ఈ నిద్రలేమి సమస్య నుండి బయటపడి, నిద్రకి వేల్లెముందు ఎంతోమంది విజేతలు చేస్తున్న, కొన్ని పనులు పడుకోవడానికన్న ముందు మనం కూడా చేసి విజేతలుగా ఎలా నిలబడగలమో ఇప్పుడు చూద్దాం.

మొదటిది......ప్రాపంచిక విషయాలకి అన్ప్లగ్ అవ్వండి.

సూర్యుడు అస్తమించాడు...చంద్రుడు కనపడుతున్నాడు అంటే రోజు వారి పనులకి స్వస్తి చెప్పి, విశ్రాంతికి ఆహ్వానం పలికే సమయమని గుర్తించాలి. కాబట్టి ఒక్క సారి ఆఫీస్ నుండి ఇంటికి రాగానే, భయటికి సంబంధించిన అన్ని విషయాలకు అన్ప్లగ్ అవ్వాలి. తిరిగి రేపటి ఉదయం వరకు అన్ని పనులు వేచిఉండగలవని నమ్మాలి. విజేతలు ఒక్కసారి వారు ఇల్లు చేరుకోగానే, పని అనే మెంటల్ ఫైల్ ని, వారి మైండ్ లో క్లోజ్ చేస్తారు.

రెండవది......ఆ రోజు మీరు సాదించిన విషయాలు వ్రాసుకోండి. ఫీల్ ది గ్రాటిట్యుడు.

మరి కొద్దిమంది విజేతలు ...రాత్రి పడుకోవడానికి ముందు....ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఆ రోజు సాదించిన విషయాలు వ్రాసుకుంటారు. ఆ పని ఎంత చిన్నదైన కాని, ఎంత పెద్దదైన కాని, వాటిని అలా వ్రాసుకుని... అన్ని పనులు చెయ్యడానికి శక్తిని ఇచ్చిన ఆ సృష్టికర్తకి ధన్యవాదాలు చెప్పుకొని పడుకుంటారట.

మూడవది....మిత్రులతో, కుటుంబ సబ్యులతో మాట్లాడండి.

కొద్దిమంది విజేతలు వారి పని ఒత్తిడి నుండి రిలాక్స్ కావడానికి, పడుకునే ముందు వారి కుటుంభ సభ్యులతో కలిసి భోజనం చేసి, ఆ తరవాత ఆ రోజు విశేషాలు మాట్లాడుకొని, నిద్రకి ఉపక్రమిస్తారట, ఇలా చేయడం వలన వారి బంధాలు బలోపేతం అవుతూ, వారికి భరోసా పెరుగుతుంది అని చెపుతున్నారు.

నాలుగవది...పుస్తకాలు చదవండి.

చాలామంది విజేతలు పడుకునే ముందు చేసే ఒక పని వారికీ నచ్చే, ఉపయోగపడే పుస్తకాలు చదవటం. అలా పుస్తకాలూ చదవటం వలన వారికీ కొత్త విషయాలు తెలుస్తూ వుంటాయి, మనసు కూడా ప్రశాంతత చెంది, నిద్రలోకి జారుకుంటారు అని చెబుతున్నారు.

ఐదవది.........నెక్స్ట్ డే ని ప్లాన్ చేసుకొండి.

విజేతలు దాదాపు అందరు వారి నెక్స్ట్ డే ని ప్లాన్ చేసుకొని, వాటి గురించి ఆలోచించి, వాటికీ సంబంధించిన ఒక ప్లాన్తో ప్రశాంతంగా నిద్రలోకి వెలతారట. అలాగే వారి నెక్స్ట్ డే కోసం కావాల్సిన వస్తువులను రెడీ చేసుకొని, ఏది ఎక్కడ ఎప్పుడు అవసరం ఉంటుందో, దాని ప్రకారం అన్ని అమర్చుకొని నిద్రపోతారట.

ఆరవది....ద్యానం చేసుకోండి.

చాలామంది వారి ఒత్తిడి తగ్గించుకోడానికి, వారి సృజనాత్మకతని పెంచుకోడానికి నిద్రకు ముందు ద్యానం ను ఎంచుకుంటున్నారు. దీని వలన వారి నిద్ర యొక్క క్వాలిటీ కూడా చాల బాగా పెరుగుతుందని ఎన్నో పరిశోదనలు చెపుతున్నాయి.

ఏడవది.....రేపటి విజయాలను సంగీతం వింటూ ఉహించండి.

కొద్దిమంది విజేతలు వారు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని, వారికీ నచ్చిన ప్రశాంతమైన సంగీతాన్ని వింటూ...వారి రాబోవు విజయాలను ఉహిస్తూ కొన్ని నిముషాలు గడిపి ఆ తర్వాత నిద్రక ఉపక్రమిస్తారట, అలా చెయ్యడం వలన వారి విజయాలకి ఏది ఎంతో సహాయపడుతుందట.

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలలో, కొన్ని మీరు ఆచరణలో పెట్టడం ద్వార, అనిర్వచనీయమైన ప్రశాంతతని ఇచ్చే...నిద్రా దేవత వడిలో హాయిగా నిదిరించటమే కాకుండా, విజయలక్ష్మి బడిలో విజేతగా కూడా నిలుస్తారు. అల్ ది బెస్ట్.


లైవ్ టీవి


Share it
Top