"మీ వ్యాపార అభివృద్దికి వక్తగా మారండిలా"

మీ వ్యాపార అభివృద్దికి వక్తగా మారండిలా
x
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... "మీ వ్యాపార అభివృద్దికి వక్తగా మారండిలా" చాలామంది వ్యాపారంలో విజయం సాధించాలని, లాభం పొందాలని రకరకాల...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... "మీ వ్యాపార అభివృద్దికి వక్తగా మారండిలా"

చాలామంది వ్యాపారంలో విజయం సాధించాలని, లాభం పొందాలని రకరకాల వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఒక ఊర్లో మీరు పరిశీలించిన కూడా ఒక దీపావళికి మొదలు పెట్టిన ఎన్నో కొత్త వ్యాపారాలు, సంవత్సరం తిరిగి మరో దీపావళి వచ్చే వరకు ఎన్ని నిలబడుతున్నాయో మీకు తెలుసా! ఎంత మంది కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతున్నారు...అని చూస్తే.... సగం మంది కన్నా తక్కువే విజయాన్ని, లాభాన్ని చవి చూస్తున్నారు అని మనకు అర్ధం అవుతుంది. వీటికి కారణాలు ఎన్నో ఉండవచ్చు.....అయితే ఎ వ్యాపారానికైనా కూడా సరైన మార్కెటింగ్, అలాగే సరైన సేల్స్ పర్సన్ ఉండటం చాలా అవసరం.

మన వ్యాపారానికి కావలసిన కస్టమర్లను సంపాదించడంలో మార్కెటింగ్ అండ్ సేల్స్ సిబ్బంది పాత్ర చాలా ఉంటుంది. ముఖ్యంగా ఏ వ్యాపారంలో అయినా నమ్మకమే పునాది కాబట్టి, ఆ నమ్మకాన్ని సంపాదించడానికి మన కంపెనీ గురించి, అలాగే మనం అమ్మే వస్తువు గురించి, ఆ వస్తువు వలన వచ్చే లాభం గురించి, స్పష్టంగా కాబోయే కస్టమర్ కి అర్థం చేయించాల్సిన అవసరం ఉంటుంది.

అయితే మన వ్యాపార అభివృద్ధి లో భాగంగా ఒక్కో వ్యక్తికి మన వస్తువు గురించి, మన కంపెనీ గురించి అర్ధం చేయించడానికి చాలా సమయం పడుతుంది. కానీ అదే మీరు వేదికల మీద నుంచి, మీ కంపెనీ గురించి కొద్దిమంది ముందు మాట్లాడగలిగితే, చాలా తక్కువ సమయంలో ఎక్కువ మందికి మీ సేవలు లేదా వస్తువును అందించగలుగుతారు కదా. ఇలా రకరకాల వేదికల మీద నిలబడి మీ గురించి, మీ వస్తువు గురించి మాటలాడటం వలన మీ సమయం చాల ఆదా అవుతుంది, అలాగే ఎక్కువ మందిని తక్కువ సమయంలో కలవగలటం వలన మీ అమ్మకాలు కూడా ఎక్కువగా అయ్యే అవకాశాలు వున్నాయి.

కాబట్టి వీలైనంత వరకు మీ వ్యాపారం అభివృద్ధి చేసుకోడానికి రకరకాల వేదికల మీది నుంచి మీరు కోరుకుంటున్న వస్తువుని అమ్మటం మొదలు పెట్టవచ్చు. అయితే దీనికి కొద్దిమంది చాలా ఇబ్బంది పడిపోతారు. వారికీ వేదికల మీద, నలుగురి ముందు మాటాలాడాలి అంటే ఒక తెలియని ఇబ్బంది, భయం, ఆందోళనకి గురి అవుతారు. ఇలా అవ్వడానికి కారణం వేదిక మీద నిల్చుని చాలా మందిని చూడగానే, తాము ఎలా మాట్లాడుతున్నామో అనే ఒక ఒత్తిడికి గురి అవుతారు. ఆడీయన్స్ని చూస్తే చాలు ఒక రకమైన భయానికి గురి అవుతారు. ఇలాంటి సమస్య మీకు వుంటే మాత్రం వీలైనంత త్వరగా మీరు ఈ భయాన్ని జయించాలి. అలా జయించడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాము.

మొదటిది.....మీరు మీరుగానే వుండండి: వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు చాలామంది వ్యక్తులు ఆందోళనలో రకరకాలుగా మాట్లాడుతారు. అలా మీకు జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు చెప్పలనుకొనే విషయాన్నీ, మీ ఆఫర్ ఏంటో, ఆ ఆఫర్ వారికీ ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ స్పష్టంగా ఆలోచించి పెట్టుకోండి. అలాగే మీరు చెప్పే విషయాన్ని, మీ వ్యక్తిత్వానికి సరిపోయే విధంగా ఉండాలి. అప్పుడే మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలరు. లేకుంటే మీరు ధైర్యంగా మాట్లాడలేరు. కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని మీ ప్రసంగంలో కనపడేటట్టు తయారు చేసుకోండి

రెండవది....మీ పరిచయం పవర్ఫుల్గా వుండాలి: మీ ప్రసంగములో చెప్పాలనుకున్న విషయాల కన్నా ముందు, సభకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మీ పరిచయ కార్యక్రమం లో, మీరు ఇప్పటివరకు సాధించిన విజయాలు, మీరు పొందిన అవార్డులు, రివార్డులు, అలాగే మీరు ఇప్పటికీ ఎంత మందికి సేవలందించారు, ఎలాంటి వ్యక్తులు, సంస్థలు మీ సేవలు అందుకుంటున్నారు. ఇవన్ని కూడా మీ పరిచయంలో భాగంగా ఉంచుకోండి. అప్పుడే అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది.

మూడవది....ఆలోచింపచేసే ప్రశ్నలు వేయండి: మీరు మీ ప్రసంగంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ ప్రశ్నల ద్వారానే వారికి మీ సేవ లేదా మీ వస్తువులు అవసరం అనే ఆలోచన కలిగించాలి. వారి యొక్క అవసరాలను వెలికి తీసే ప్రశ్నలు మీరు ఎక్కువ అడగటం ద్వార వారికీ మీ సేవలు అవసరం అని అర్థం చేయించాలి.

నాలుగవది....వారికి ఈ ప్రసంగం వినటం వలన లాభం ఎంటో చెప్పండి: మీ ప్రసంగం మొదట్లోనే మీ ఆడియన్స్ కి, మీ స్పీచ్ వినటం వల్ల ఎలాంటి ఉపయోగం, ఎలాంటి లాభం ఉంటుందో వారికి చెప్పండి. ఎందుకంటే వారు కేటాయిస్తున్నా సమయానికి వారు ఎలా లాభం పొందుతారో తెలుసుకోవాలి అని వారు కోరుకుంటారు. మీరు ఈ విషయం ముందుగానే చెప్పడం వల్ల, మీ శ్రోతలు పూర్తి ద్యాస ని మీ ప్రసంగంపై పెట్టగలరు.

ఐదవది...........ఏమి చెప్పలనుకుంటున్నారో స్పష్టంగా వ్రాసుకోండి: అయితే ఇప్పటివరకు తెలుసుకున్న అన్నిటిని అమలుపరచడానికి, మీరు మాట్లాడబోవు ప్రసంగాన్ని ముందుగా పేపర్ పై స్పష్టంగా రాసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే మీ ఆలోచనలని పేపర్ పై పెడతారో, వాటిలో మీకు చాలా స్పష్టత వస్తుంది. ఇలా స్పష్టంగా రాసుకున్న ప్రసంగాన్ని మీరు రెండు నుంచి మూడుసార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరిగుతుంది. దీనితో వేదిక నుంచి చాలా బాగా మాట్లాడగలుగుతారు. మీరు కోరుకున్న ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సో ఇప్పటి వరకు చర్చించిన విషయాలను మీరు ఆచరణలో పెట్టి ప్రతి వేదిక మీద విజేతగా నిలిచి మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories