Top
logo

"ఈ రోజుల్లో ఈ ఆటిట్యూడ్ అవసరం"

"ఈ రోజుల్లో ఈ ఆటిట్యూడ్ అవసరం"
X
Highlights

ఫ్రండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం... 'ఈ రోజుల్లో ఈ ఆటిట్యూడ్ అవసరం' ఫ్రండ్స్ ! మన ఆటిట్యూడ్ లేదా దృక్...

ఫ్రండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం... "ఈ రోజుల్లో ఈ ఆటిట్యూడ్ అవసరం"

ఫ్రండ్స్ ! మన ఆటిట్యూడ్ లేదా దృక్పథమే మన జీవితం యొక్క దశని, దిశని నిర్దేశిస్తుందని మీకు తెలుసా! ముఖ్యంగా గొప్ప భవిష్యత్తు కోరుకొనే వారికీ, వారి పాజిటివ్ దృక్పథమే అత్యంతం ముఖ్యమైంది. వారి పాజిటివ్ దృక్పథం వారి విజయ సామ్రాజ్యానికి చేరటానికి ఒక పాస్పోర్ట్ లా పనిచేస్తుంది. అసలు ఈ దృక్పథం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే....దృక్పథం అంటే మన ప్రపంచాన్ని చూడటానికి వాడె ఒక ఫిల్టర్ లాంటిది లేదా మన కనులకు పెట్టుకునే అద్దాల లాంటిది. అయితే ఆకుపచ్చ అద్దాలు పెట్టుకున్న వారికీ, ప్రపంచంలో అన్ని ఆకుపచ్చగా కనపడుతాయి, అలాగే పసుపు పచ్చ అద్దాలు పెట్టుకున్న వారికీ అన్ని పసుపు పచ్చగా కనపడుతాయి కదా! అలాగే ఈ ప్రపంచాన్ని ఆశావాద దృక్పథం అనే అద్దాలతో కొద్ది మంది చూస్తే, మరి కొద్దిమంది ఈ ప్రపంచాన్ని నిరాశావాద దృక్పథం అనే అద్దాలతో చూస్తారు. మొదటి వారు ఒక గ్లాస్ లోని నీరు చూసి, గ్లాస్ లో సగం నీరు వున్నాయని అంటే, రెండవ వారు ఆ గ్లాస్ సగం కాలిగా వుంది అని అంటారు.

మన దృక్పథం ఎలాంటిదంటే...ఇంట్లో నుండి మనం బయటి ప్రపంచాన్ని చూడటానికి వాడె కిటికీ అద్దాల లాంటివి. మన దృక్పధం మన చిన్న వయస్సులలో స్పష్టమైన, క్లీన్ గా వున్నా గాజు గ్లాస్ లాగే వుంటుంది. అయితే మన వయస్సు ఎదుగుతున్న ....కొద్ది రోజుల్లోనే, రకరకాల మనషుల వలన, రకరకాల పరిస్టితుల వలన మన కిటికీ గ్లాస్ మీద దుమ్ముపడి మరకలు అయినట్టు, మన జీవితంలో జరిగే సంఘటనలు ఎన్నో అపనమ్మకాలని, భయాలను మన దృక్పధం అనే గ్లాస్ పై ముద్రించబడతాయి. అప్పుడు ఆ కిటికీ అద్దాల నుండి ప్రపంచం చూస్తే..ప్రపంచం ఇబ్బందుల యొక్క సమూహం లాగానే కనపడుతుంది. కాబట్టి మన ఇంటి కిటికీ గ్లాస్, రేగులర్గా క్లీన్ చేసుకున్నట్టే...మన దృక్పథాన్ని కూడా సరిచూసుకొని క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకొని పాజిటివ్ దృక్పథం నిలుపుకోవాలి. దీనికి ముందుగా మనం అర్ధం చేసుకోవాల్సింది...ఒక సంతోషంగా వున్నా వ్యక్తి, తన పరిస్థితుల వలన సంతోషంగా వుండడు, అతని పాజిటివ్ దృక్పథం వలెనే సంతోషంగా వుంటాడని. కాబట్టి ఇప్పుడు ఆ పాజిటివ్ దృక్పథాన్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.

మొదటిగా మనం మన ఆలోచనలతో ఎదగగలం, పడిపోగలం అని గుర్తించాలి. మన ఆలోచనలే మన అభివృద్దికి మూలం. అయితే మన పతనానికి మూలం కూడా మన ఆలోచనలే, మనం ఏది ఆలోచిస్తే అది అవుతుంది. కాబట్టి మన ఆలోచనలు ఒక సక్రమమైన దారిలో పెట్టడానికి, పాజిటివ్ ఆటిట్యూడ్ పెంచుకోడానికి, మన విజయాన్ని మనం వీక్షించాలి. దానికోసం మిమ్మల్ని మీరు ప్రస్తుత స్థితిలో కాకుండా, మిమ్మల్ని మీరు ఒక విజయమంతమైన వ్యక్తిగా ఉహించుకోవడం సాధన చెయ్యండి. ఈ సాధన విషయంలోని మీ అంకిత భావమే మీకు విజయాన్ని అందించే భావంగా మారుతుంది. అలాగే ఎవైన సమస్యలు మద్యలో వస్తే మీరు గుర్తుచేసుకోవల్సింది....సమస్యలలోనే అవకాశలు దాగివుంటాయని. అలాగే ఈ సమస్యలో నుండి నేను ఏమి తీసుకోగలను అని మిమ్మని మీరు ప్రశ్నించుకోవాలి. అలాగే మన లక్ష సాధనలో కొంత సాహసం కూడా అవసరము. కాబట్టి కొంత సాహసం చూపాలి, ఎందుకంటే...సాహసం ఉంటేనే కొన్ని కఠిన నిర్ణయాలు మనం తీసుకోగలము.

పాజిటివ్ దృక్పధం నిర్మించుకోడానికి, మీ చుట్టూ పాజిటివ్ మనషులను ఉంచుకోండి, అలాగే మనం రోజు సంభాషణలో వాడె పదాల పదనును కూడా వాడుకోండి. ముక్యంగా మీ పలకరింపు చాల ఉత్సాహంగా వుండాలి. ఎందుకంటే...మన ఆలోచనలు మన పదాలు అవుతాయి, మన పదాలు మన నమ్మకాలుగా మారుతాయి, మన నమ్మకాలకు అనుగుణంగానే మన దృక్పధం వుంటుంది, దానికి అనుగుణంగానే మనం పనులు చేస్తాము, కాబట్టి అలాంటి ఫలితాలు మాత్రమే వస్తాయి.

మీ నెగటివ్ దృక్పథానికి ఎవైన భయాలు కారణమైతే మాత్రం...మీరు మీ భయాలను ఎదురుకోండి. మీరు భయం నుండి ధైర్యం వైపు పయనించాలి. ఎందుకంటే ధైర్యం ఉంటేనే కొత్త పనులు చేస్తాము. అలాగే విజయము వైపు పయనిస్తున్నపుడు కొన్ని సార్లు మీరు ఓటమిని చెందినట్టు అనిపించవచ్చు, కానీ ఆ ఓటమి విజయానికి దిక్సూచి అని గుర్తించటమే మనం పాజిటివ్ దృక్పధం. దాని కోసం మీ మనో భలం పెంచుకోండి, ఎందుకంటే..విజయ భాగంలో వచ్చే అడ్డంకులను ఓటమ్ములా చూడకుండా మీ మనో భలంతో తట్టుకొని నిలబడవచ్చు. ఎప్పడు కూడా మీ శక్తిని అనుమానించకండి, ఎందుకంటే అప్పుడు ఆ అనుమానానికి శక్తిని ఇచ్చిన వారు మీరే అవుతారు. ఎప్పడు మీ ఆలోచనల్ని, అలాగే మీకు ముఖ్యమైన విషయాలలో మీ దృక్పథాన్ని చెక్ చేసుకొని, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ విజయం వైపు పయనం కొనసాగించండి. చివరిగా మీరు విజయాన్ని అందుకున్న తర్వాత, ఇతరులతో మీ విజయం పంచుకోండి, అందుకొరకు అందరిని కలుపుకుంటూ వెళ్ళండి, అప్పడు మీ పాజిటివ్ దృక్పథం వలన మీ నాయకత్వ నీడలో అందరు విజేతలుగా నిలుస్తారు. అల్ ది బెస్ట్.

Next Story