ఆవేశం అన్ని వేళల మంచిది కాదు.

ఆవేశం అన్ని వేళల మంచిది కాదు.
x
Highlights

కొద్దిమంది ప్రతి చిన్న విషయానికి తెగ ఆవేశపడి పోతారు. అలా చెయ్యడం ద్వార వారు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు, వారు కూడా ఎన్నో సమస్యల్లో ఇరుక్కుంటారు. ఈ విషయాన్నీ అర్ధం చేసుకోడానికి...ఒక కథ సహాయం తీసుకుందాం.

కొద్దిమంది ప్రతి చిన్న విషయానికి తెగ ఆవేశపడి పోతారు. అలా చెయ్యడం ద్వార వారు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు, వారు కూడా ఎన్నో సమస్యల్లో ఇరుక్కుంటారు. ఈ విషయాన్నీ అర్ధం చేసుకోడానికి...ఒక కథ సహాయం తీసుకుందాం....

ఒక ఫ్యాక్టరి కొత్త గా నియమితమైన ఎండి, తన ఫ్యాక్టరీలో మొదటి రోజు నడుస్తున్నప్పుడు, ఒక యువకుడిని గమనించాడు. ఆ యువకుడు....ఏమీ చేయకుండా గోడపై వాలి రిలాక్స్ అవుతున్నాడు.

ఆ ఎండి, ఆ యువకుడిని సమీపించి, కోపంతో నీ జీతం నెలకి ఎంత వస్తుంది? అని అన్నాడు

అప్పుడు....ఆ యువకుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత "నేను నెలకు రూ 9000 / - సంపాదిస్తాను సర్. ఎందుకు? అని అని అడిగాడు.

సమాధానం చెప్పకుండా, ఎండి తన వాలెట్ తీసి రూ 27000 / - నగదు తీసి మరియు ఆ యువకుడికి ఇచ్చి, నీకు మూడు నెలల జీతం ముందు ఇస్తున్నాను... నీలాంటి వ్యక్తి నాకు వద్దు, ఈ ఫ్యాక్టరి లో ఇంకో సారి నాకు కనపడకు అని అన్నాడు. ఆ డబ్బులు తీసుకొని ఆ యువకుడు వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వస్తున్నా మేనజర్ని చూస్తూ...ఆ యువకుడు మన ఎ డిపార్ట్మెంట్ లో చేస్తాడు అని అడిగాడు.

వెంటనే... మేనేజర్... "అతను పిజ్జా డెలివరీ చెయ్యడానికి వచ్చాడు సర్ ...! " అని అన్నాడు.

ఈ ఎం.డి లాగేనే కొద్ది మంది ముందు వెనక ఆలోచించకుండా ఎన్నో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు. ఆ తర్వాత తీరికగా బాధపడతారు. ఇలా జరగవద్దు అంటే ముందుగా మనం మన ఆవేశాన్ని అదుపులో వుంచుకోవాలి. అలాగే అనవసర అహాన్ని కూడా వదిలించుకోవాలి. ఎవరికైతే అనవసర అహం, ఆవేశం ఉంటాయో వారు ఎన్నో విధాలుగా నష్టపోతారు. ముఖ్యంగా వారి అన్ని బంధలలోను ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఏదైనా సమస్య రాగానే వెంబడే రియాక్ట్ కాకుండా మెల్లిగా రెస్పాండ్ అవ్వాలి. అప్పుడే మనం జీవితంలో మన లక్ష్యాలని సాదించగలం. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories