Top
logo

అంతా నా కర్మ నేనా?

అంతా నా కర్మ నేనా?
Highlights

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం.... అంతా నా కర్మ నేనా? ఫ్రెండ్స్! మీరు మ్యాట్రిక్స్ అనే ఇంగ్లీష్ స...

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం.... అంతా నా కర్మ నేనా?

ఫ్రెండ్స్! మీరు మ్యాట్రిక్స్ అనే ఇంగ్లీష్ సినిమా చూసారా! అందులో హీరో అయిన "నియో"కి, అసలు తన జీవితములో జరిగే కష్టనష్టాలకు, ఎవరు కారణం అనే ఆలోచన, అనుమానము బాగా వేదిస్తువుంటుంది....ఇక చివరికి అదే అనుమానాని "మార్ఫిస్" అనే తన లీడర్ని అడుగుతాడు. అప్పడు నియో ప్రశ్నకి సమాధానంగా మార్ఫిస్ నియో ముందు, తన కుడి చేతిలో రెడ్ టాబ్లెట్, ఎడమ చేతిలో బ్లూ టాబ్లెట్ చూయించి, ఆ రెండిట్లో ఏదైనా ఒకటి ఎంచుకొమని చెపుతాడు. అయితే బ్లూ టాబ్లెట్ ఎంచుకుంటే మాత్రం..తన జీవితం అలా ఎందుకు ఉందో, దానిని ఎవరు నిర్నయిస్తున్నారో అనే ఆలోచనలు వేధించకుండా, అనుమానం రాకుండా... "తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందాలా" ప్రశాంతంగా ఉండవచ్చని చెపుతాడు. కానీ రెడ్ టాబ్లెట్ ఎంచుకుంటే మాత్రం, తన జీవితానుభవాలకు మూలమేమిటో తెలుసుకోగలుగుతాడు అని చెపుతాడు. అప్పడు నియో ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకొందామని....రెడ్ టాబ్లెట్ ఎంచుకుని, తన జీవితాన్ని నిర్ణయించే శక్తి ఏంటో తెలుసుకొని, ఆ శక్తిని వాడుకొని ఒక విజేతగా నిలుస్తాడు.

అలాగే ఆ సినిమాలో నియో లాగే, మన జీవితంలో జరిగే ఎన్నో అనుభవాలకి, కష్టాలకి, సుఖాలకి, అసలు భాద్యులు ఎవరు అనే అనుమానం మనలో చాల మందికి రావచ్చు. ఎవరైనా మన జీవితాన్ని ముందుగానే రాసిపెట్టారా, లేదా ఇప్పడు రాస్తున్నారా? అని అనుమానము రావచ్చు. ఇంకా మన జీవితం పూర్తిగా మన చేతిలోనే వుందా లేక అంతా మన కర్మనా? అనే అనుమానం కూడా చాలామందికి వస్తుంది. ముఖ్యంగా కొన్ని కష్టాలు వచ్చినప్పడు కొద్దిమంది..... అంతా నా కర్మా! అని భాదపడుతుంటారు. ఎవరో తమ జీవితాన్ని ఒక బొమ్మని ఆడిస్తున్నట్టు లేదా రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తున్నట్టు... కొద్దిమంది భాదపడతారు. అయితే ఫ్రెండ్స్.... అసలు ఈ కర్మ అంటే ఏంటి అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అసలు నిజంగా మన కర్మ అంటే, ఎవరో మన నుదిటి మీద రాసే వ్రాతన? లేక ఇంకేదైన వుందా! ఇలాంటి అనుమానాలతో కొద్ది మంది పెద్దలను నేను అడిగినప్పుడు వచ్చిన సమాధానాలు మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను.

కర్మ అనే పదం సంస్కృతం నుండి వచ్చిన పదం. కర్మ అంటే మనం మానసికముగా గాని, శారీరకముగా గాని, మనం చేసే పని అని అర్ధం. ముఖ్యంగా మన కర్మల క్రింద మన ఆలోచనలు, మాటలు, చర్యలు మరియు మనం చెప్పటం ద్వారా ఇతరులు చేసే చర్యలు కూడా వస్తాయి. అయితే కర్మ అంటే ఎవరో ఎక్కడో కూచొని మన జీవితం గురించి రాసే విషయం కాదట. కర్మ అనే విషయము, మనం చేసే పని, మన ద్వార జరిగే పని, మన వలన జరిగే పని అని అర్ధమట. మన కర్మ అనగానే మనం గతంలో చేసిన పనుల యొక్క ప్రస్తుత ఫలితం అని అర్ధం. హిందూ దర్మం ప్రకారం అది గత జన్మ పనులు కూడా అయివుండవచ్చు.

అయితే గతములో మనం చేసిన మంచి, చెడు పనుల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం అనుభవిస్తువుంటే, మరి మనం ఇప్పడు చేసే పనుల యొక్క ఫలితాలు, మన భవిష్యత్తులో పొందుతామనే అర్ధం కదా. కాబట్టి ఈ కర్మ అనే విషయంతో మన భవిష్యత్తుని, మనం నిర్మించుకొనే అవకాశం వుంది అని గుర్తించాలి. ఇప్పడు మనం ఎ పని చేస్తున్నాము, దాని ఫలితాలు ఎలావుండవచ్చు అని అంచనా వేసుకోవలసిన అవసరం వున్నది. ఉదాహరణకి...మనకి మామిడి పండ్లు కావాలంటే మనం మామిడి విత్తనం మాత్రమే నాటుతాము కదా, అలాగే ఇది కూడా.

ఫ్రండ్స్ ముఖ్యంగా మనము ఈ విశ్వంలోకి, ప్రపంచంలోకి, ఇతరులకి ఏది ఇస్తామో, మనకు తిరిగి అవి వస్తాయి. అవి మంచైనా లేదా చెడైనా కూడా. అయితే మనకి ఏమికావాలో నిర్ణయించుకొని, దానికి సంభందించిన పనిని మనం చేసుకుంటూ వెళ్లాలి. ఎందుకంటే మన జీవితంలో ఎ గొప్ప పని చెయ్యాలనుకున్న కూడా మన కృషి ముఖ్యము. మనమే ముందు వుండి ఆ పనులు ఒక్కోటి చెయ్యాలి. ఆ తర్వాత దాని ఫలితాలు పొందాలి. ఎప్పుడైతే మన కర్మ యొక్క ప్రభావాన్ని గుర్తించి, మనం అంగీకరిస్తామో మన జీవితం మన చేతిలో ఉన్నట్టే.

అయితే మన జీవితంలో ప్రస్తుతం వస్తున్న కొన్ని ఫలితాలకి, మనకి ఎ సంభంధం లేదని కొన్ని సార్లు అనిపించ వచ్చు...మనం ఇలాంటి కష్టాలు వచ్చే విధంగా, ఎ పని గతంలో చెయ్యలేదని అనిపించవచ్చు. అలా ఎందుకు జరుగుతుంది అంటే.. ఉదాహరణకు ఒక రోజులో మనం చేసే అన్ని పనుల్లో, ఎన్ని పనులు మనం ఎరుక లేదా కాన్షియస్గా చేసాము అని చూస్తే, ఒక్క పది శాతం పనులు కూడా ఎరుకతో లేదా కాన్షియస్గా చెయ్యము. మన ద్రుష్టి లేకుండానే..మన శరీరంలో ఎన్నో పనులు అన్- కాన్షియస్గా జరిగినట్టు, ఎన్నో పనులను మనం అన్- కాన్షియస్గా చేస్తాము. అవి మన ఆలోచనలు అయివుండవచ్చు, మాటలు అయివుండవచ్చు, లేదా చర్యలు కూడా అయివుండవచ్చు, ఇలా అన్- కాన్షియస్గా ఎక్కువ చేస్తాము కాబట్టే, వాటి ఫలితాలు వచ్చినప్పడు, అసలు ఇలా ఎందుకు ఫలితం వచ్చింది, నేను ఏమి చెయ్యలేదు కదా అనుకుంటాము. కాబట్టి అన్- కాన్షియస్గా ఎక్కువ పనులుని చెయ్యకుండా, ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో, అవెర్నేస్స్ తో చేస్తే మనం అన్ని ఫలితాలకి మూలకారణం మనమే అని తెలుసుకుంటాము.

కాబట్టి మన ఆలోచనలు, మాటలు, పనులు మార్చకోడం ద్వారా, మన జీవితాలను మార్చుకోవచ్చు. అలాగే ముందుగా మన జీవితాల్లో ఏమి జరుగుతుంది అనేదానికి, మనమే బాధ్యులం అని భావించాలి. ముక్యంగా మనం గొప్ప గొప్ప విజయాలు సాదించాలి అంటే మాత్రం...మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు అని ఒకే రకంగా వుండాలి. దీనినే త్రికరణ శుద్ధి అని కూడా అంటారు. మన ఆలోచనలు, మాటలు, చర్యలు అన్ని పాజిటివ్ గా వుంటే, మన జీవితంలో అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అయితే కొన్ని గత కర్మల వలన ఏదైనా ఇబ్బంది మీరు ఇప్పుడు పడుతున్న కూడా, మీ భవిష్యత్తు మాత్రం మీ చేతులోనే వుందని గుర్తుకువుంచుకోవాలి. అల్ ది బెస్ట్.

Next Story

లైవ్ టీవి


Share it