ఇలా లక్ష్యం పెట్టుకుంటే మీరు ఏదైనా సాధించగలరు

ఇలా లక్ష్యం పెట్టుకుంటే మీరు ఏదైనా సాధించగలరు
x
Highlights

ఫ్రెండ్స్ ! ఎవరైనా జీవితంలో విసుగు చెంది వున్నారు అంటే... - వారు ప్రతి ఉదయం ఉత్సాహంగా నిద్ర లేవట్లేదు అని అర్ధం, అంటే వారికి ఆకర్షనీయమైన లక్ష్యాలు...

ఫ్రెండ్స్ ! ఎవరైనా జీవితంలో విసుగు చెంది వున్నారు అంటే... - వారు ప్రతి ఉదయం ఉత్సాహంగా నిద్ర లేవట్లేదు అని అర్ధం, అంటే వారికి ఆకర్షనీయమైన లక్ష్యాలు లేవు అని అర్ధం. శ్రీ.కో.

పడుకొని మాత్రమే కలలు కనే వారు...ఉదయాన్నే మేలుకుంటారు. కాని కళ్ళు తెరచి కలలు కంటూ, ప్రతి రోజు తమ లక్ష్యాల సాధనలో అడుగులే వేసేవారు...ప్రపంచాన్నే తమ విజయంతో మేలుకోల్పుతారు.

ఫ్రండ్స్....మనం జీవితంలో విజయం పొందడానికి ఉండాల్సిన మొదటి స్థితి, పరిస్థితి ఏంటంటే...మనకి ఒక లక్ష్యాo కలిగి ఉండటం. ఆ తర్వాత ఆ లక్ష్యానికి మనం పూర్తిగా అంకితం అవ్వడం చాల అవసరం. ఎందుకంటే మనకంటూ ఒక లక్ష్యం లేకుంటే...మనం ఇతరుల లక్ష్యం కోసం ఉపయోగించుకోబడతాం.

ఎవరికైతే తమ లక్ష్యం మీద క్లారిటీ ఉంటుందో వారు తమ జీవితంలో ఎన్నో విజయాలు సాధించగలరు. ముఖ్యంగా జీవితంలో ఒక లక్ష్యం వుండటం వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్కికి గురికారు. ఎప్పుడైతే మనం కన్ఫ్యూషన్లో వుండమో అప్పుడు మన యొక్క శక్తి అంతా కూడా అనవసర విషయాల మీద ఖర్చు చెయ్యకుండా, శక్తినంతా మన లక్ష్యం మీదే కేంద్రీకరించగలం.

ఎవరికైతే ఒక స్పష్టమైన లక్ష్యం లేదో, వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో వుంటూ అటూ ఇటూ తెగిన గాలిపటంలా తిరుగుతూ ఉంటారు, కొట్టుకుపోతు వుంటారు. ఎక్కడికి వెళుతున్నాడో తెలియని వ్యక్తి నుంచి ఎలాంటి ఫలితాలను మనం ఆశించలేము. ఎందుకంటే అతనికే ఏమి కావాలో తెలియదు కాబట్టి, అతను ఏ పరిస్థితుల్లో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఎప్పుడూ ఉంటాడో ఎవరికీ తెలియదు. చుక్కాని లేని నావలా సముద్రంపై తిరుగుతువుంటాడు.

మీరు తప్పకుండా క్లియర్ గా ఒక టార్గెట్ ని లేదా లక్షాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో కూడా స్పష్టంగా రాసుకోవాలి. ఆ లక్ష్యసాధనకు ఒక సమయం అంటూ కేటాయించుకోవాలి. ఆ లక్షాన్ని ఎప్పటిలోగా సాధిద్దాం అనుకుంటున్నారో సమయాన్ని నిర్ణయించుకోవాలి, లేకుంటే అది ఒక కోరిక లాగే మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక లక్ష్యానికి, కోరికకి ఉన్న వ్యత్యాసమేంటి అంటే కాలం యొక్క పరిధి మాత్రం. కాలపరిధి లేకుంటే అది ఒక ఆశ, కోరిక మాత్రమే.

మన మనసు దేన్నైనా సాధించగలదు, మన మనస్సులో అనంత శక్తి దాగి ఉంది, కానీ ఆ మనసుకి ముందుగా మనం ఏం కావాలో మాత్రం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్ కి తను ఒక గోల్ చెయ్యాలంటే, తను కొట్టాల్సిన గోల్ పోస్ట్ ఎక్కడవుందో తెలియాలి కదా, అది తెలియకుంటే ఎలా గోల్ చెయ్యలేడో, అలాగే మన మనస్సుకి కూడా మన గోల్ తెలవకుండా దానిని సాధించలేదు.

మనిషి ఏది సాధించి, సృష్టించిన ముందుగా తన మనసులో ఒక ఆలోచనగా, ఒక ఐడియాలా, ఒక ఉహగా చూస్తాడు, ఆ తర్వాతే భౌతిక ప్రపంచంలో ఆ పనిని చేస్తాడు. కాబట్టి మన లక్ష్యం మనకు స్పష్టంగా తెలిసినప్పుడే మన ఆలోచనలు అటు వైపు వెళుతాయి. ఎలాగైతే ఒక శిల్పి తన ముందు వున్న రాయిలో ఒక అందమైన శిల్పాన్ని ఉహించుకొని ఆ తరువాత, ఆ శిల్పంకి అనవసరమైన రాయిని తీసేస్తూ, అందులోని అందమైన శిల్పాన్ని ఎలాగైతే బయటికి తీస్తాడో, అలాగే మన మనసు, మనకి కావాల్సిన లక్షాన్ని సాధించటం గురించి ఊహించుకుంటే , లక్షానికి సంభంధం లేని మిగిలిన అన్ని విషయాలను మన మనసు తొలగిస్తుంది.

మీరు ఒక బైక్ ని కొనాలని అనుకున్న తర్వాత రోడ్ పై వెలుతుంటే ఎక్కువగా మీరు అనుకున్న బైక్లే కనబడతాయి, ఇన్ని రోజులు కూడా ఈ బైక్స్ రోడ్ల మీద వున్నా, ఇప్పుడు ఇవి బాగా కనపడతాయి, అలాగే మిగిలిన బైక్స్ అంతగా కనపడవు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే....మన మైండ్ కి వున్నా (RAS) Reticular Activating System వల్ల ఒక్కసారి మన లక్ష్యం డిసైడ్ కాగానే, ఈ సిస్టం మనకి కావలసినదే చూపెడ్తుంది. అక్కడి నుండి మన మనస్సు అనవసర విషయాలను తొలగించడం వల్ల, రోజు లక్ష్యం వైపు కొంత పని చెయ్యడం వల్ల మన లక్ష్యాన్ని సాధించడం సులభం అవుతుంది.

ఎ లక్ష్యాన్నైనా ఒక పేపర్ పై రాసుకోవడం చాలా ముఖ్యం, ఎప్పుడైతే మన మనసులోని ఆలోచనలను, ఊహలను, కోరికలను పేపర్ పై పెడతామో, వాటిపైన మనకి చాలా స్పష్టత వస్తుంది. ఒక్కసారి ఆ స్పష్టత వచ్చిన తర్వాత, మన లక్ష్యానికి ఒక సమయ పరిధి పెట్టుకొని, తర్వాత వాటిని ఒక పేపర్ పై ప్రత్యేకంగా రాసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కనీసం రోజుకి ఒక్కసారైన చదవాల్సి ఉంటుంది. అలా పేపెర్ పై రాసుకున్నవారు ఎంతోమంది వారి లక్ష్యాలను సాధించి విజేతలుగా నిలిచిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి.

ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, ఆతర్వాత ఆ లక్ష్యాన్ని స్పష్టంగా పేపరుపై వ్రాసుకోవడం, ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఒక కార్యాచరణ ప్రణాళిక తీర్చిదిద్దుకోవడం, ఆ తర్వాత ఉత్సాహంగా రోజు పనిచేస్తూ ముందుకు వెళ్లడం, ఇవన్నీ లక్ష్యసాధనలో ముఖ్యమైన భాగాలే.

అయితే ఆ లక్ష్యాన్ని మనం సాధిస్తున్నట్టు, విజేతగా నిలుస్తున్నట్టు, మన మస్సులో ప్రతిరోజు కనీసం రోజుకి మూడు నిమిషాలు ఊహించడం వల్ల మన మనస్సు చాల శక్తివంతమవుతుంది, అలాగే మన లక్ష్య సాధనలో పట్టుదలని పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజు మన లక్ష్యాన్ని సాధిస్తున్నట్టు ఉహించుకోవటం చాల లాభదాయకం. ముఖ్యంగా మనం ఒక లక్షాన్ని సాధించే క్రమంలో వ్యక్తిగా చాల ఎదుగుతాం, అలా ఒక లక్ష్యం మనకి ఎంతో లాభం చేస్తుంది.

ఫ్రెండ్స్....

చివరిగా.... మన కలలని ఈ యిలలో తీసుకువచ్చే ఏకైక మార్గం, మన కలలని లక్ష్యాలుగా మార్చుకోవడమే. కాబట్టి ఈ రోజే మీ కలలని ఒక పేపర్ పై బంధించి, వాటిని సాధించటానికి మొదటి అడుగు వెయ్యండి. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories