"విజేతల యొక్క విలువైన 6 లక్షణాలు"

విజేతల యొక్క విలువైన 6 లక్షణాలు
x
Highlights

హాయ్ ఫ్రెండ్స్! ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం "విజేతల యొక్క విలువైన 6 లక్షణాలు"మనషులందరు సమానమే అని మీరు చాలాసార్లు వినేవుంటారు. కాని వాస్తవ...

హాయ్ ఫ్రెండ్స్! ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం "విజేతల యొక్క విలువైన 6 లక్షణాలు"

మనషులందరు సమానమే అని మీరు చాలాసార్లు వినేవుంటారు. కాని వాస్తవ పరిస్థితులను మీరు గమనిస్తే, అన్ని రంగాలలోను, అందరు విజయాలు సాధించినట్టు మీకు కనపడదు. ప్రతి రంగంలోనూ విజేతలు ఒక పది శాతం మించి, మీకు కనపడరు. ముఖేష్ అంబానీ మరియు బిల్ గేట్స్ మరియు ఇలాంటి వ్యక్తులను ఎ రంగం లోనైనా గమనిచండి. మీరు క్రీడారంగంలో చూసిన, వ్యాపార రంగంలో చూసిన, ఆ విజేతల ఆలోచన ధోరణి గమనిస్తే ఇతరులకన్న భిన్నంగా వారి ఆలోచనలు కనబడుతుంది. వారి లక్ష్యాలను సాదించటానికి కావలసినటువంటి మానసిక భలం వారి వద్ద కనపడుతుంది. అయితే ఈ మానసిక భలం వున్నవారు....లేని వారు.....ప్రతి వ్యక్తి ఒక విజేత కావాలని కోరుకుంటాడు. అందరిచే గుర్తించబడాలని, అందరిచే ఆరాధించబడాలని, అలాగే తను కోరుకున్న విషయంలో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటారు.

అయితే గొప్ప విజయాలు సాధించడానికి, విజయాన్ని సాదించలేక ఓటమిని చవి చూసిన వ్యక్తికి ఉన్న వ్యత్యాసం, మీరు దగ్గర నుండి చూస్తే, అది ఆ వ్యక్తి యొక్క కొన్ని ముఖ్యమైన మానసిక లక్షణాలలో ఉంటుంది అని అర్ధం అవుతుంది. కాబట్టి ఎలాంటి మానసిక లక్షణాలు విజేతలను, విజేతలుగా నిలుపుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఒక 6 లక్షణాలు విజేతలకు, పరాజితులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసంగా ఉన్నాయి. ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుని, వాటిని ఆచరించడం ద్వారా, మీరు కూడా మీరు కోరుకున్న రంగం లో విజేతల జాబితాలో చేరవచ్చు.

మొదటిది........విజేతలు శ్రమని నమ్ముకుంటారు: విజేతలు వారి శ్రమనే నమ్ముకుంటారు. ఈ ప్రపంచములో ప్రతి ఫలితం, ఒక కార్యకారణ సంబంధం అని వారికీ తెలుసు. ఏదైనా ఒక ఫలితం వారు కావాలనుకొంటే, ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు గుర్తిస్తారు. ఇది ఈ భౌతిక ప్రపంచంలో ఒక ముఖ్య విషయమని వారు గుర్తిస్తారు. ఎన్నో గొప్ప ఆలోచనలు వున్నా, ఎన్నో గొప్ప ఐడియా లు వచ్చిన, ఎన్నో వనరులు, మనషులు వారి వద్ద వున్నా కూడా, ఒక పని చెయ్యందే ఎ ఫలితం రాదని వారికీ తెలుసు. కాబట్టి వారి పనినే వారి దైవంగా వారు భావిస్తారు. వారి పనినే వారు నమ్ముకుంటారు.

రెండవది....... ప్రపంచం నిద్రిస్తున్న వేళ వీరు శ్రమిస్తూ ఉంటారు: విజేతలకి పని విలువ ఒక్కటే కాకుండా, వారి పోటిధారులకన్న, వారి సహచారులకన్న కూడా ఎక్కువ పని చేస్తారు. ముఖ్యంగా ప్రపంచం అంత అలసి సొలసి ఆనందాన్ని వెతుక్కుంటూ రిలాక్స్ అవుతున్న సమయంలో కూడా వీరు వారి పని చేస్తూ రిలాక్స్ అవుతారు. అందరికి వీరు పని రాక్షసులు గా కనపడిన, ఇతరులు మాటల్లో అలా వినపడిన కూడా, రాత్రి సమయంలో కూడా ఉదయపు సూర్యుడిలా వారి పని వారు చేసుకుంటూ సాగుతారు.

మూడవది..... వీరిని వీరే తీర్చిదిద్దుకుంటారు: వీరు ఒక్క ఫలితాల మీదనే ద్రుష్టి పెట్టరు. ఒక చెట్టుకు మంచి పండ్లు రావాలి అంటే, దాని వేర్లు బాగా ఉండాలనే విషయం వీరికి తెలుసు. కాబట్టి వారి నాలెడ్జ్ ని ఎప్పుడు పెంచుకుంటారు. ఎంత వయస్సు వచ్చిన ఇతరుల నుండి కొత్త విషయాలు నేర్చుకోడానికి సిగ్గుపడరు, అహంకారాన్ని ప్రదర్శించరు. ఎందుకంటే వీరికి తెలుసు... మోర్ లెర్నింగ్ ఇస్ మోర్ ఎర్నింగ్ అని. కాబట్టి ఎప్పటికప్పుడు వారి ఫీల్డ్ లో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వుంటారు, నేర్చుకుంటూ నిత్య విద్యార్థి లా వుంటారు.

నాలుగవది..... సహచరులకు సహాయం చేస్తారు: వీరు తమ లక్ష్యాలు సాదించాలి అంటే ఇతరుల సహాయం కూడా అవసరం అని నమ్ముతారు. వీరు వస్తువులను వాడుకుంటారు, మనషులను ప్రేమిస్తారు. అందువలననే ఇతరులు కూడా విజేతలు కావాలని, వారికీ సహాయపడుతూ వుంటారు. వారికీ తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటారు, వారు ఇవ్వగలిగిన సలహాలను ఇతరులకు ఇస్తారు. అలా తమ సహచరులను కూడా తమ విజయంలో భాగస్వాములుగా చేసుకుంటారు.

ఐదవది...... సృజనాత్మకతతో పని చేస్తారు: వీరికి తెలుసు ప్రతి లక్ష్యాన్ని సాదించే క్రమంలో కొన్ని సమస్యలు వస్తాయని, ఆ సమస్యల సాధనలోనే వారి విజయం దాగి వుందని, కాబట్టి ప్రతి సమస్యని వారి సృజనాత్మకతతో, ఒక కొత్త పద్దతిలో పరిష్కరించడానికి ఆలోచిస్తారు. అందరు ఆలోచించినట్టు కాకుండా, కొత్తగా ఒక పనిని ఎలా చేయవచ్చు అని శోదిస్తారు.

ఆరవది...... రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు: ఎ గొప్ప లక్ష్యాన్ని సాధించాలన్న మన జీవితమలో కొంత రిస్క్ తీసుకోవాలనే విషయం వారికీ తెలుసు. రిస్క్ మరియు రివార్డ్ సమానంగా వస్తాయనే సత్యాన్ని వారు గుర్తిస్తారు. అందుకే ఎలాంటి అవకాశాలు వారి ముందుకి వచ్చిన కూడా, వాటిని పూర్తిగా అర్ధం చేసుకొని, అవసరమైన మేరకు రిస్క్ కూడా తీసుకొని విజేతగా నిలుస్తారు. ఇలా వారు ఎంచుకున్న రంగంలో విజేతగా పేరు తెచ్చుకుంటారు.

ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు ఈ 6 లక్షణాలు యొక్క గొప్పతనం అర్థం అయివుంటుంది. ప్రతి రోజు ఒక్కో లక్షణాలు తీసుకొని, మీరు వాటిని మీ నిజ జీవితంలో ఎక్కడా అమలు చేయగలుగుతారో ఆలోచించండి. ప్రతి లక్షణాన్ని మీ రోజువారీ జీవితంలో అమలులో పెట్టడం వల్లే, మీ ఆలోచనల్లో, మీ పనులలో నిజమైన మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం చర్చించిన అంశాలను మీరు ఆచరణలో పెట్టడం వల్ల, ముఖ్యంగా ఈ 6 లక్షణాలను మీ మానసిక బలంగా మార్చుకోవడం వల్ల, మీరు కోరుకున్న రంగంలో విజేతలుగా నిలువగలుగుతారు. ఆల్ ద బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories