ఉదయాన్నే ఉరకలేసే ఉత్సాహంతో నిద్ర లేవడం ఎలా?

ఉదయాన్నే ఉరకలేసే ఉత్సాహంతో నిద్ర లేవడం ఎలా?
x
Highlights

మన నిద్రలో వచ్చే మంచి కలలని తీర్చుకోవటానికి మొదటి మెట్టు, ఆ నిద్ర నుండి లేచి మన కలల వైపు పని మొదలెట్టడం అంటారు. అయితే ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఎన్నో...

మన నిద్రలో వచ్చే మంచి కలలని తీర్చుకోవటానికి మొదటి మెట్టు, ఆ నిద్ర నుండి లేచి మన కలల వైపు పని మొదలెట్టడం అంటారు. అయితే ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి అని మనందరికీ తెలుసు. అలాగే చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవాలనుకుంటారు, కానీ లేవలేకపోతుంటారు. ఫ్రెండ్స్ ఇలా ప్రతీరోజు లేవాలనుకున్న టైం కి లేవలేక ఎంతో మంది ఒక నిస్సహాయ స్థితిని ఫీల్ అవుతారు. దీని నుండి బయటపడి ప్రతిరోజు ఉదయాన్నే విజేతగా ఫీల్ కావాలంటే, అనుకున్న సమయానికి ఉత్సాహంగా లేవలాంటే ఈ పంచ సూత్రాలని అర్ధం చేసుకొని ఆచరించండి, తప్పక విజేతగా నిలుస్తారు.

మొదటి సూత్రం: ఉదయపు ఉద్యమంలో జాయిన్ కండి.

ఎవైరైతే ఉదయించే సూర్యినితో పోటిబడి, తన కన్నా ముందు నిద్ర లేస్తారో, వారు జీవితంలో సూర్యినిలా స్వయం ప్రకాశకులు అవుతారు. మనలో చాలామంది ఉదయం నిద్రలేవాలని అలారం పెట్టుకొని నిద్ర పోతాం, కాని ఆ అలారం రాగానే దాని స్నూజ్ బటన్ నొక్కి తిరిగి నిద్రలో జారుకుంటాము, ఇలా ఇక జరగవద్దు అంటే, మనం అలారంపై మీ ఆఖరిపోరాటం ప్రకటించాలి.

ఆ అలారం మీద విజయం సాదించాలి. దాని కొరకు ఉదయపు ఉద్యమంలో భాగంగా ప్రతి రోజు ఒక్క ఐదు నిముషాలు మాత్రమే ముందుగా లేసె ఉద్యమంలో జాయిన్ కండి.

అవును! ఐదు నిముషాలే... ఎందుకంటే ఒకేసారి ఒక గంట, రెండు గంటలు ముందు లేవటం కన్నా, ఒక్క ఐదు నిముషాలు ముందు అని మొదలు పెట్టి, ప్రతి రోజు మరో ఐదు నిముషాలు పెంచడం ద్వార ఒక్క వారం రోజుల లోపే మీరు ఒక గంట ముందుగా లేవటం అలవాటు అవుతుంది.

అలాగే మీరు ఉదయాన్నే లేవటానికి ఒక మంచి కారణం స్పష్టం చేసుకోండి. మీరు లేవటానికి మీకు సరైన ఒక కారణం వుంటే ఆ కారణమే మీకు ఉత్సాహం ఇస్తుంది, అలాగే మీరు "ఇక ప్రతి రోజు ఐదు నిమిషాల ముందే ఉదయం నిద్ర లేస్తాను" అని మీ కుటుంభ సబ్యులకు ప్రకటించండి.

దాని ద్వార వారి సహకారం కూడా మీకు పెరుగుతుంది. అలాగే నిద్ర లేచిన తర్వాత వీలైనంత త్వరగా చల్ల నీళ్ళతో స్నానం చెయ్యండి. ఇలా చెయ్యడము వల్ల మీ శరీరంలో ఒక కొత్త శక్తి, ఉత్సాహం ఉరకలేస్తూ వస్తుంది.

రెండవ సూత్రం: రోజులో మొదటి పని, మీకు ఇష్టమైన పని మాత్రమే చెయ్యండి.

ఇష్టమైన పని ఎంత కష్టమైన ఎంతో ఆనందంగా మనం చేస్తాము, అయితే ఈ ఆనందం రోజంతా వుండటం చాల ముఖ్యం, అలాగే ఒక రోజు ని మనం ఎలా గడపబోతున్నాము అనే విషయం, ఆ రోజు ఉదయం మనం నిద్ర లేవగనే మొదటి ముప్పయి నిముషాలు ఆ రోజుని నిర్ణయిస్తాయట. కాబట్టి ఆ అర్ధ గంటని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, ముఖ్యంగా ఆ ముప్పయి నిమిషాలని రెండు భాగాలుగా విబజించుకోండి. ఆ తర్వాత మొదటి భాగమైన పదిహేను నిముషాలు మీకు నచ్చిన ఎ పనినైన చెయ్యండి. అది ఎ పనైనా పర్వాలేదు..కాని మీరు ఎంజాయ్ చేసే పని అయి వుండాలి. ఒక వేళ మీకు ఏదైనా చదవడం లేదా ఆడటం ఇలా ఏదైనా పర్వాలేదు...కాని ఆ పని పదిహేను నిముషాలు మాత్రమే అని గుర్తుకి పెట్టుకోండి. ఆ తర్వాత రెండవ పదిహేను నిముషాలు మీకు ఉత్సాహం ఇచ్చే మ్యూజిక్ మాత్రమే వినండి. ఆ మ్యూజిక్ వింటూ డాన్స్ చెయ్యబుద్ది అవుతే చెయ్యండి, లేదా వ్యాయామం చెయ్యండి అప్పుడు మీకు సహజమగానే మీలో ఉత్సాహం ఉప్పొంగుతుంది.

మూడవ సూత్రం: ప్రతిరోజు ఒకే సమయానికి బెడ్ పై వెళ్ళండి.

ఒక పెద్ద బండ రాయిని కూడా... ఒక్కో నీటి బొట్టు పడుతూ, ఆ బండ రాయిపై తమ ప్రభావం ఎలా చుపెడతాయో, అలా క్రమ బద్దంగా ప్రతి రోజు ఎ టైం కి బెడ్ మీదకు వెళతారో నిర్ణయించు కొండి. ఆ తర్వాత ప్రతి రోజు అదే సమయానికి బెడ్ మీదకి వెళ్ళండి, నిద్ర వచ్చిన రాకున్న కూడా మీరు బెడ్ మీదకి వెళ్ళండి. బెడ్ మీదకి వెళ్ళగానే నిద్ర రావాలి అంటే నిద్రకి ఒక గంట ముందు నుండి అన్ని ఎలక్ట్రానిక్స్ కి దూరం వుండండి. పడుకునేప్పుడు కొంచెం సిల్లీ గా అనిపించిన మీ దిండు తో మాట్లాడండి. మీ దిండుకి చెప్పండి మిమ్మల్ని ఉదయాన్నే లేపమని, ఆశ్చ్యరంగా మీకు ఒకో సారి అలారం రాకుండానే, మీకు మెలకువ రావచ్చు. అలాగే వీలైతే రిలాక్స్ పరిచే మ్యూజిక్ మాత్రమే వినండి. అలా చెయ్యడం వల్ల బెడ్ మీదకి వెళ్ళగానే మీకు నిద్ర హాయిగా పడుతుంది. ఉదయాన్నే యురేకా అంటూ మీరు నిద్రలేవవచ్చు.

నాలుగవ సూత్రం: పరిసరాలపై పట్టు సంపాదించండి.

పొద్దు తిరుగుడు పువ్వులు, సూర్యుడి ప్రభావంలోకి వెళ్ళకుండా ఎలా వుండలేవో, అలాగే ఒక మనిషి అతని చుట్టూ వున్న పరిస్థితుల ప్రభావంలోకి వెళ్ళకుండా ఉండలేడు. కాబట్టి మనమీద మన చుట్టూ వున్నా బౌతిక పరిస్థితుల ప్రభావం ఎంతో వుంటుంది, అలాగే మనకి హాయిగా నిద్ర పట్టడానికి, ఉదయాన్నే ఉత్సాహంగా లేవటానికి మనం పడుకునే ప్రాంతంలోని పరిసరాల ప్రభావం కూడా చాల వుంటుంది అని గుర్తించాలి. అలాగే మనం పడుకోడానికి కనీసం ఒక రెండుగంటల ముందే భోజనం చెయ్యండి, దాని వల్ల మీకు నిద్ర బాగా పడుతుంది, అలాగే ఉదయాన్నే అలారం రాగానే దాన్ని స్నూజ్ చెయ్యకుండా ఆ అలారం వాచ్ ని మీ చేతికి అందనంత దూరంగా ఉంచండి. అలాగే మీకు ఇష్టమైన మ్యూజికని అలారం రింగ్టోన్ గా పెట్టండి, రోజు ఆ మ్యూజిక్ వినగానే ఒక ఉత్సాహంగా లేవగలుగుతారు.

ఐదవ సూత్రం: మార్నింగ్ మస్తి గ్యాంగ్ తో మస్తి చెయ్యండి.

ఎ వ్యక్తికైనా స్నేహం అనేది ఒక మంచి వరం, మన ఆనందంలో, దుఃఖంలో పాలు పంచుకునే స్నేహితులు వుండటం అదృష్తం. అందుకే ఒక సరైన సాంగత్యం వల్ల ఎన్నో లాభాలు వుంటాయి అని అంటారు, అందుకోరకే మీ లాంటి లక్ష్యాలు కలిగిన లేదా మీ శ్రేయస్సు కోరుకునే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మిత్రులతో మార్నింగ్ మస్తి గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకోండి. ఆ గ్యాంగ్ ఒకరికి ఒకరు ఉత్సాహపరుచుకోడానికి, మోటివేట్ చేసుకోడానికి అలాగే నిన్న మీరు సాదించిన ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోండానికి, ఆ రోజు మీరు చేయ్యలనుకుంటున్న పనుల గురించి చర్చించడానికి వాడుకోండి, ముఖ్యంగా ఆ చర్చ అయిపోగానే ఇంటి బాల్కనీ లోకి వెళ్లి ఉదయపు చల్ల గాలిని పీలుస్తూ ఆకాశం చూడండి, ఒక మూడు దీర్ఘ శ్వాసలు తీసుకోగానే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది.

ఫ్రెండ్స్ ఈ పంచ సుత్రాలను మీరు ఇప్పటి నుండి నలభై ఒక్క రోజులు పాటించండి, ఆ తర్వాత మీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులను మీరు చూస్తూనే వుంటారు, ఎందుకనే ఈ ప్రపంచంలో ఎందరో గొప్ప విజేతలు ఉదయం ఉత్సాహంగా నిద్ర లేచే వారె. వారి విజయాలే ఆకాశంలోని సూర్యుడి లా ఎప్పటికి నిలిచి వుంటాయి. అల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories