వాడకుంటే ఉక్కు అయిన తుక్కు పడుతుంది

వాడకుంటే ఉక్కు అయిన తుక్కు పడుతుంది
x
Highlights

రాణి వాళ్ళ ఇంటికి, చాలా కాలం తర్వాత వచ్చిన ఒక దూరపు చుట్టం వారి టేబుల్‌ మీదున్న కాఫీ కప్పులోని "బూడిద" చూసి అడిగాడు. '' ఈ బూడిదేమిటమ్మాయి..'' అని. ...

రాణి వాళ్ళ ఇంటికి, చాలా కాలం తర్వాత వచ్చిన ఒక దూరపు చుట్టం వారి టేబుల్‌ మీదున్న కాఫీ కప్పులోని "బూడిద" చూసి అడిగాడు.

'' ఈ బూడిదేమిటమ్మాయి..'' అని.

'' అది మా ఆయనది అంకుల్‌!'' అంది రాణి.

''అయ్యయ్యో! ఎన్నాళ్ళయిందమ్మాపోయి? నాకసలు ఆ విషయమే తెలీదు.. ఇంత చిన్న వయసులో అబ్బాయిని తీసుకుపోయి ఆ దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడమ్మా...'' అంటూ సానుభూతి కురిపిస్తున్నాడు చుట్టం.

'' అహ! ఆయన పోలేదంకుల్‌. మా ఆయన మహా బద్దకం. తను సిగరెట్ తాగుతాడు కదా... అప్పుడు ఆష్ ట్రై తెచ్చుకోలేక... అప్పుడప్పుడు ఆ కప్పులో వేసేస్తూ ఉంటారు. అది పారబోయ్యాలని ఎప్పటికప్పుడు అనుకున్నా... నేనూ బద్దకిస్తూన్నానంతే...!'' అంది రాణి నింపాదిగా....

ఇలాంటి బద్దకరత్నాలు మీకు తెలిసివుంటారు...ముక్యంగా ఈ రోజుల్లో

ప్రస్తుతం వున్న జీవన విధానం వలన, గ్రామాల నుండి పట్టణాల వైపు పయనం వలన, కూర్చొని చేసే వృత్తులు ఎక్కువగా పెరగటం వలన, మన రోజువారి జీవితంలో శారీరక శ్రమ చాలా తగ్గిపోవడం జరిగింది, దానితో బద్దకం చాల మందిలో పెరిగి పోతుంది.

అలాగే దీని పర్యవసానంగా రకరకాల శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు కూడా చాల మందికి పెరుగుతున్నాయి. ఇలా రకరకాల అనారోగ్యాలు రావటానికి ఒక ముఖ్య కారణం మన జీవన శైలి అని వైద్యులు అంటున్నారు. అయితే ఈ సమస్య నుండి భయపడటానికి కొన్ని చిన్న వ్యాయామాలు మనకు ఎలా ఉపయోగపడుతాయో చూద్దాము.

ఎక్కువ గంటలు టీవీ చూడటం, స్మార్ట్ ఫోన్ తో గడపడం తగ్గించి వీలైనంత వరకు ఆక్టివ్ గా వుండాలి. దానికోసం ప్రతి గంటకి అలా లేచి పది అడుగులు వెయ్యాలని నిపుణులు చెపుతున్నారు. అలాగే వీలైనంతగా నడవటం, వ్యాయామం చెయ్యడం చాల అవసరం. ఉక్కు ని వాడితే తుక్కు పట్టనట్టే..మన శరీరాన్ని ఎంత వాడితే అంత ఆరోగ్యంగా వుంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories