Punjab YouTuber: యూట్యూబర్ జస్బీర్ సింగ్ ఫోన్ లో 150 పాకిస్తాన్ కాంటాక్టులు..పోలీసులకు వెల్లడించిన నిందితుడు

YouTuber Jasbir Singh has 150 Pakistani contacts on his phone
x

 Punjab YouTuber: యూట్యూబర్ జస్బీర్ సింగ్ ఫోన్ లో 150 పాకిస్తాన్ కాంటాక్టులు..పోలీసులకు వెల్లడించిన నిందితుడు

Highlights

Punjab YouTuber: పాకిస్తాన్ కోసం భారత్ లో గూఢచార్యం చేస్తున్న కేసులో అరెస్ట్ అయిన పంజాబ్ యూట్యూబర్ జస్బిర్ సింగ్ ఫోన్లో 150 వరకు పాకిస్తాన్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నట్లు విచారణ అధికారులు గుర్తించారు.

Punjab YouTuber: పాకిస్తాన్ కోసం భారత్ లో గూఢచార్యం చేస్తున్న కేసులో అరెస్ట్ అయిన పంజాబ్ యూట్యూబర్ జస్బిర్ సింగ్ ఫోన్లో 150 వరకు పాకిస్తాన్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఆయన 6 సార్లు పాకిస్తాన్ లో పర్యటించి నేరుగా పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ గూఢచారులతో భేటీ అయినట్లు అధికారులు తేల్చారు. గూఢచార్యం కేసులో అరెస్టు అయిన మరో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ కు పరిచయం ఉన్నట్లు గుర్తించారు.

అంతేకాదు పాకిస్తాన్ కు చెందిన మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం యూట్యూబర్ గా ఉన్న నాసిర్ థిల్లాన్ లాహోర్ లో తనను ఐఎస్ఐ గూఢచారి , ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన డానిష్ అలియస్ ఎహ్సాన్ ఉర్ రెహ్మాన్ కు పరిచయం ఉన్నట్లుగా జస్బీర్ సింగ్ వెల్లడించినట్లు సమాచారం. డానిష్ తన నుంచి కొన్ని సిమ్ కార్డులను తీసుకున్నాడని పాకిస్తాన్ నిఘా అధికారి ఒకరికి తన ల్యాప్ టాప్ ను గంటపాటు అప్పగించాలని వివరించినట్లు సమాచారం.

జస్బీర్ ల్యాప్ టాప్, ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలనలు జరుపుతున్నారు. పాకిస్తాన్ మాజీ పోలీస్ అధికారి నాసిర్ థిల్లాన్ యూట్యూబర్ ముసుగులో భారత యూట్యూబర్లతో పరిచయాన్ని పెంచుకుని ఐఎస్ఐ గూఢచారి డానిష్ దగ్గరకు తీసుకెళ్లి వారిని ప్రలోభాలతో గూఢచర్యంలోకి దింపినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. డానిష్ ఏవేవో కార్యక్రమాలకు ఆహ్వానం పేరుతో ఈయూట్యూబర్లను పాకిస్తాన్ హైకమిషన్ కు రప్పించుకుని వారికి టాస్క్ లు అప్పగించినట్లుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories