Yogi Adityanath: నెల్లాళ్లలోనే కీలక వాగ్దానాలను అమలు చేసిన సీఎం

Yogi Adityanath Serving as the Ideal CM | Telugu News
x

Yogi Adityanath: నెల్లాళ్లలోనే కీలక వాగ్దానాలను అమలు చేసిన సీఎం

Highlights

Yogi Adityanath: ఆదర్శ సీఎంలా పనిచేస్తున్న యోగీ ఆదిత్య నాథ్

Yogi Adityanath: టార్గెట్ 2024. కేంద్రంలో బీజేపిని మళ్లీ అధికారంలోకి తేవడానికి బీజేపి ఒక మిషన్ లా పనిచేస్తోంది. గెలుపు అవకాశాలున్న రాష్ట్రాలలో మరింత శ్రద్ధతో అడుగులేస్తోంది. చేసిందే చెబుతాం. చెప్పేదే చేస్తాం అంటున్న సీఎం యోగీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి ఏం చేస్తున్నారు? బీజేపీపై ప్రజలలో నమ్మకం కలగడానికి ఆయన పాలనా పరంగా ఎలాంటి మార్పులు చేసుకున్నారు?

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో గతంలోకంటే మరింత నిబద్ధతతో అడుగులేస్తున్నారు. రెండోసారి గెలుపు యోగీలో ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచింది.దాంతో పాలనాపరంగా ఉత్సాహంగా అడుగులేస్తున్నారు.ఎన్నికల వాగ్దానాలను చెకచెకా అమలు చేసేస్తున్నారు. అధికారం చేపట్టి నెల్లాళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపిని గద్దెనెక్కించిన ఫ్రీ రేషన్ పథకానికి మళ్లీ జై కొడుతున్నారు. ఈ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. అలాగే రానున్న ఆరు నెలల్లో పేదలకోసం రెండున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. వంద రోజుల డెడ్ లైన్ లో పదివేలమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని అడుగులేస్తున్నారు. స్మార్ట్ నగరాలను తలదన్నే స్మార్ట్ విలేజీలను కూడా యోగీ నిర్మించబోతున్నారు. అధికారం చేపట్టి మూడు నెలలు పూర్తి అయ్యేలోగా ఈ టాస్క్ లన్నీ పూర్తి చేసుకుని ప్రజల్లో మంచి మార్కులు కొట్టేయాలనే లక‌్ష్యంతో యోగీ అడుగులేస్తున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను పూర్తిగా అదుపులో ఉంచడమే కాక, మంత్రుల మధ్య మంచి సహకారాన్ని, సమన్వయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మసీదులు, ఆలయాల్లో లౌడ్ స్పీకర్ల వివాదంపై యోగీ అద్బుతమైన నిర్ణయం తీసుకున్నారు. లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని ఇప్పటికే నిషేధించిన ముఖ్యమంత్రి దానికి బదులు ఆ ప్రాంగణంలో మాత్రమే వినిపించేలా మైక్రోఫోన్లను వినియోగించుకోమని సూచించారు. ఢిల్లీ జహంగీర్ పురీ ఘటన తర్వాత అనుమతి లేకుండా మతపరమైన ర్యాలీలు చేపట్టరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. యోగీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీల నేతలూ స్వాగతించారు. అలాగే పాకిస్థాన్ నుంచి వచ్చి యూపీలో స్థిరపడిన 63 రైతుకుటుంబాలకు దున్నుకునేందుకు రెండేసి ఎకరాల భూమిని ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ల్యాండ్ మాఫియా, నేరగాళ్లపై ఉక్కు పాదం మోపుతున్నారు. నెల్లాళ్లలోనే దాదాపు రెండు వందల కోట్ల విలువైన ప్రభుత్వాస్తులను స్వాధీనం చేసుకున్నారు. వందమంది మాఫియా, రౌడీ షీటర్లపై బుల్డోజర్లతో ఉక్కుపాదం మోపారు. బుల్డోజర్లతో వాళ్ల ఇళ్లను నేలమట్టం చేశారు. అయితే పేదలు, షాప్ కీపర్లపై బుల్డోజర్లను వినియోగించవద్దని ఆదేశించారు. యోగీ అధికారం చేపట్టగానే చెరకు రైతుల నోటిని తీపి చేశారు. 8 వేల కోట్ల రూపాయలను ఆ రైతులకు సాయం కింద అందించారు.

సంకల్ప యాత్రలో చేసిన వాగ్దానాల మేరకు చదువుకునే విద్యార్ధులకు టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నారు. యూపీలో శాంతి భద్రతలను చక్కదిద్దడంలో భాగంగా 20 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేశారు. 2024 ఎన్నికలలో బీజేపి విజయం కోసం యోగీ ఇప్పటినుంచే ఒక ప్రణాళిక ప్రకారం అడుగులేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories