'Yes Bank': రానా కపూర్ ముగ్గురు కుమార్తెలు ఎన్ని కంపెనీల్లో డైరెక్టర్లో తెలుసా?

Yes Bank: రానా కపూర్ ముగ్గురు కుమార్తెలు ఎన్ని కంపెనీల్లో డైరెక్టర్లో తెలుసా?
x
Highlights

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ను ముంబై సెషన్స్ కోర్టుకు తరలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు. విచారణ కోసం కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది.

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ను ముంబై సెషన్స్ కోర్టుకు తరలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు. విచారణ కోసం కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రానా కపూర్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అరెస్టు చేశారు.

శనివారం, ఈడీ అధికారులు ఎన్‌సిపిఎ అపార్ట్‌మెంట్లలో రానా కపూర్ కుమార్తెలు రాధా, రోష్ని కపూర్ వాంగ్మూలాలను నమోదు చేశారు. అలాగే, రాధా కపూర్ భర్త ఆదిత్య ఖన్నాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరో కుమార్తె బిందు కపూర్ ప్రస్తుతం 18 కంపెనీలలో డైరెక్టర్‌గా ఉండగా, రోష్ని కపూర్ 23 కంపెనీలలో, రాధా కపూర్ ఖన్నా 20 కంపెనీలలో ఉన్నారు. ఈ కంపెనీలలో చాలా వరకు ఒకే రకమైన డైరెక్టర్లు ఉన్నారు.

కపూర్‌పై ఉన్న కేసు స్కామ్.. దెబ్బతిన్న దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డిహెచ్‌ఎఫ్ఎల్) తో ముడిపడి ఉంది, బ్యాంకు ఈ సంస్థకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మార్చాయని ఈడీ అధికారులు ఆరోపించారు. ప్రస్తుతం యస్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం రానా కపూర్ అని ఈడీ అధికారులు భావిస్తున్నారు. డిహెచ్‌ఎఫ్‌ఎల్ లోని ఒక సంస్థకు పొడిగించిన 600 కోట్ల రూపాయల రుణం కూడా ఈడీ దర్యాప్తు పరిధిలో ఉందని వారు తెలిపారు. కొన్ని కార్పొరేట్ సంస్థలకు రుణాలు పంపిణీకి సంబంధించి అతని పాత్రను కూడా కేంద్ర ఏజెన్సీ పరిశీలిస్తోందని, తదనంతరం అతని భార్య ఖాతాల్లో కిక్‌బ్యాక్‌లు వచ్చాయని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

మరోవైపు యస్ బ్యాంకు నుంచి విత్ డ్రా పై రిజర్వ్ బ్యాంక్ మారిటోరియం విధించిన సంగతి తెలిసిందే. రూ.50 వేల వరకు తీసుకోవచ్చని తెలుపడంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. యస్ బ్యాంక్ సహా ఇతర ఏటీఎంలలో కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది. యస్ బ్యాంక్ సంక్షోభం తర్వాత నగదు తీసుకొనేందుకు ఖాతాదారులు ఇబ్బంది పడ్డ విషయం అందరికి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories