Delhi Floods: యమునా నది మహోగ్రరూపం.. కేజ్రీవాల్ ఇంటి సమీపంలోకి చేరిన వరద

Yamuna River Level In Delhi Rises Further Flooding Near Arvind Kejriwals Home
x

Delhi Floods: యమునా నది మహోగ్రరూపం.. కేజ్రీవాల్ ఇంటి సమీపంలోకి చేరిన వరద

Highlights

Delhi Floods: కశ్మీరీ గేట్ - మంజుకా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద

Delhi Floods: యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఉదయం 7 గంటలకు వరద ఉద్ధృతి వల్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి 500 మీటర్ల దూరంలో వరద నీరు ప్రవహిస్తోంది. హర్యానాలోని ఓ బ్యారేజి నుంచి నీటిని యమునా నదిలోకి విడుదల చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. యమునా నదిలో నీటి మట్టం 208.46 మీటర్లకు చేరింది. ఇది ప్రమాదకర స్థాయి కన్నా మూడు మీటర్లు ఎక్కువ. హర్యానాలోని హత్నికుండ్ జలాశయం నుంచి నీటిని యమునా నదిలోకి విడుదల చేస్తుండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ లోని సివిల్ లైన్స్ ఏరియాలో రింగ్ రోడ్డు వరదలో చిక్కుకుంది. మజ్ను కా తిల- కశ్మీరీ గేట్ ఐఎస్‌బీటీ మార్గాన్ని మూసివేశారు. ఇక్కడి నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ శాసన సభ ఉన్నాయి. పాత ఢిల్లీ వరద ప్రభావిత ప్రాంతం కావడంతో నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటికను ఉపయోగించవద్దని అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 12 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి.

ఢిల్లీ నగరంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు లేవు. అయితే యమునా నదిలోకి హర్యానా నుంచి నీటిని విడుదల చేస్తుండటం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యమునా నదిలో నీరు ఆల్ టైమ్ హైలో ఉంది.

వజీరాబాద్‌లోని సిగ్నేచర్ బ్రిడ్జ్ సమీపంలో, గర్హి మండు గ్రామం వరద నీటిలో మునిగిపోయింది. ఐటీఓ, కశ్మీరీ గేట్, జీటీ కర్నాల్ రోడ్, బోట్ క్లబ్, మోనాస్టరీ మార్కెట్, నీలి ఛత్రి టెంపుల్, యమునా బజార్, నీమ్ కరోలీ గోశాల, విశ్వకర్మ కాలనీ, న్యూ ఉస్మాన్‌పూర్ తదితర ప్రాంతాల్లో నీరు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories