మరో షాహీన్‌ బాగ్ ను తలపించిన జాఫ్రాబాద్‌ ఘటన.. భారీగా రోడ్లపైకి వచ్చిన ముస్లిం మహిళలు

మరో షాహీన్‌ బాగ్ ను తలపించిన జాఫ్రాబాద్‌ ఘటన.. భారీగా రోడ్లపైకి వచ్చిన ముస్లిం మహిళలు
x
Highlights

దేశరాజధాని ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు ఆగడం లేదు.. తాజాగా జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ ఏరియా ఆ తరువాత చంద్ బాగ్ లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

దేశరాజధాని ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు ఆగడం లేదు.. తాజాగా జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ ఏరియా ఆ తరువాత చంద్ బాగ్ లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జాఫ్రాబాద్‌ ఘటన అయితే మరో షాహీన్‌ బాగ్ ను తలపించింది. రాత్రికి రాత్రే వందలాది మంది ముస్లిం మహిళలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.

పెద్దయెత్తున రోడ్డుపైకి వచ్చిన మహిళలు.. సీలంపూర్ - మౌజ్‌ పూర్, యమునా విహార్ వైపు వెళ్లే రోడ్డు నెంబర్ 66ని బ్లాక్ చేశారు. ఈ హఠాత్ పరిణామానికి.. ఆ మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా మహిళలు నిరసన తెలిపారు. జాతీయ జెండా చేతబట్టి ఆజాదీ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఒక వైపు నుండి మార్గాన్ని మూసివేశారు. జాఫరాబాద్ మెట్రో స్టేషన్ కాంప్లెక్స్‌లో నిరసన వ్యక్తం చేసిన మహిళలు అక్కడే గంటలకొద్ది గుమిగూడారు. దాంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మెట్రో స్టేషన్‌ను మూసివేసింది. సమాచారం అందిన తరువాత ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు.

ఈశాన్య జిల్లా డిప్యూటీ కమిషనర్ వేద్ ప్రకాష్ సూర్య అక్కడే ఉన్నారు. నిరసన తెలిపిన మహిళలను, ప్రజలను ఒప్పించడానికి అధికారులు ప్రయత్నించారు, కాని వారు ఎంతకీ వినలేదు.. ఈ క్రమంలో పోలీసులు మరియు పారా మిలటరీ దళాలు మహిళలను వెంబడించాయి. అయితే వీరి వైఖరికి నిరసనగా ముస్లిం మహిళలు రోడ్డుపైకి వచ్చి నిలబడ్డారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వరకు జఫరాబాద్‌లో గందరగోళ వాతావరణం కనిపించింది. పోలీసు అధికారులు డ్రోన్ లు ఎగరేసి పరిస్థితిని సమీక్షించారు.

మరోవైపు ఈ ఘటన మరవక ముందే.. చంద్ బాగ్ లో కూడా మహిళలు నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు.. ఆదివారం మధ్యాహ్నం, ఈ ప్రాంతంలో సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ప్రదర్శనకారులు బ్యానర్ పోస్టర్లతో ప్రదర్శన ఇచ్చారు. అదే సమయంలో, గత ఒకటిన్నర నెలలుగా జఫరాబాద్ రహదారిపై ధర్నాపై కూర్చున్న మహిళలు కూడా ప్రధాన రహదారిపైకి వచ్చారు. జాఫ్రాబాద్‌కు సమీపంలోని సీలంపూర్, కర్దంపురిలో సీఏఏ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. అలాగే షాహీన్‌ బాగ్‌ లో గత రెండు నెలలుగా నిరసనలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories