UP: గడ్డం మొగుడు వద్దు.. క్లీన్‌ షేవ్‌ మరిదే ముద్దు.. ఈ భార్య ఏం చేసిందో తెలిస్తే మీరు తల గోక్కుంటారు

UP: గడ్డం మొగుడు వద్దు.. క్లీన్‌ షేవ్‌ మరిదే ముద్దు.. ఈ భార్య ఏం చేసిందో తెలిస్తే మీరు తల గోక్కుంటారు
x
Highlights

UP: ఉత్తరప్రదేశ్ లో జరిగే చిత్ర విచిత్రాలు ఏ రాష్ట్రంలోనూ జరగనుంది. నిత్యం ఏదొక వార్తలతో యూపీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నేరాలుఘోరాలు అంటే ముందుగా...

UP: ఉత్తరప్రదేశ్ లో జరిగే చిత్ర విచిత్రాలు ఏ రాష్ట్రంలోనూ జరగనుంది. నిత్యం ఏదొక వార్తలతో యూపీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నేరాలుఘోరాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కూడా ఆ రాష్ట్రమే. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది యూపీ. ఈ వార్త చదివితే ఏం చేయాలో అర్థం కాగా తల గోక్కుంటారు. అవును..తాజాగా ఓ మహిళ తన భర్త గడ్డం నచ్చలేదని..క్లీన్ షేవ్ తో కళ్ల ముందు తిరుగుతున్న మరిదితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. మీరట్ లోని లిసాడి గేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య నిర్ణయంతో కలత చెందిన భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మౌలానా షకీర్ కు అర్షి అనే యువతితో 6 నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటర్ వరకు చదువుకున్న ఈమె పైచదువులను కొనసాగిస్తోంది. తొలిరాత్రే భర్త గడ్డంపై అర్షి అభ్యంతరం చెప్పింది. గడ్డం తీసేది లేదని షకీర్ తేల్చి చెప్పాడు. ఆ తర్వాత ఈ విషయం గురించి ఆమె తనతో చాలా సార్లు గొడవకు దిగినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన తెలిపాడు. షకీర్ ప్రతిరోజూ ఉదయం పనికి వెళ్లపోయిన తర్వాత..ఇంట్లో ఆయన తల్లి సోదరుడు ఉండేవారు. ఈ క్రమంలోనే క్లీన్ షేవ్ తో కనిపించే షకీర్ సోదరుడు ఆమెకు చేరువయ్యాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం అర్షి తల్లిదండ్రులకు తెలపడంతో ఆమెతో ఇకనుంచి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. షకీర్ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories