బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని చెప్పి.. చివరికి..

బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని చెప్పి.. చివరికి..
x
Highlights

రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చిన యువతిని కళాశాల వద్ద దిగబెడతనంటూ మాయమాటలతో దారి తప్పించి లైంగిక దాడి చేసిన ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. ఇక...

రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చిన యువతిని కళాశాల వద్ద దిగబెడతనంటూ మాయమాటలతో దారి తప్పించి లైంగిక దాడి చేసిన ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే భటిండాకు చెందిన బాధిత యువతి కళాశాల సెలవులు ముగియడంతో కళాశాలకు బయలుదేరింది. అయితే ఉదయం రైలు దిగిన యువతి కళాశాలకు చేరుకునేందుకు భటిండా రైల్వే స్టేషన్ బయట టాక్సీ కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో యువతికి పరిచయమున్న ఒక వ్యక్తి తనను కళాశాల వద్ద వదిలిపెడత అన్నాడు. అందుకు ఆ యువతి ససేమీరా అంది. దీంతో యువకుడు ఎదేమైనా ఆ యువతిని తన బైక్ ఎక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం నేను తెలిసిన వాడినే కదా అంటూ నమ్మ బలికాడు. అయితే యువతి ట్యాక్సి కోసం ఎదురుచూసిన రాకపోవడంతో ఆ యువతి కూడా చేసేదేమీ లేక ఆ యువకుడి బైక్ పైకి ఎక్కింది. ఇక ఇదే సరైనా సమయం అనుకొని ఆ యువతితో మాటలు కలిపి మనం బ్రెక్ ఫాస్ట్ చేద్దాం అన్నాడు దానికి యువతి ఓకే అంది. బైక్ పై వెళుతున్న దారిలోనే మధ్యలోనే బైక్ చెడిపోయిందని నిందితుడు అన్నాడు. అప్పుడు ఆ యువతి నేనే ఆటోలో వెళ్తాఅన్నది అందుకు ఆ యువకుడు నో అన్నాడు. మా దొస్తుది దగ్గల్లోనే ఇళ్లు ఉంది అతడు కారులో నిన్ను దిగబెడతాడు అని చెప్పింది. వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేయగానే అతడు కార్ తీసుకొని వచ్చేశాడు. ముగ్గురు కలిసి కారులో పయనిస్తున్న సమయంలోనే తన స్నేహితుడు దొరికిందే సమయంగా భావించి ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

ఎలాగైన తన కోరిక తీర్చమని ఒత్తిడి చేశాడు. అందుకు ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించంది. ఇక ఇంతలోనే కారు దారి తప్పించి పట్టణం శివార్లలోని ఒక గెస్ట్ హౌస్‌కు కారులో చేరుకున్నారు. అక్కడే యువతిని ఒక గదిలో బంధించి లైంగిక దాడికి దిగారు. అలా ఏకంగా పది రోజుల పాటు యువతిపై నిందితుడు, అతడి స్నేహితులు లైంగిక దాడి చేశారు. చివరకు యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేయగా, యువతి ఆచూకీ బయటపడింది. అనంతరం గెస్ట్ హౌస్‌లో నుంచి యువతిని కాపాడి వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించి, నిందితులను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories