logo

హెచ్ఐవీ సోకిందని తప్పుడు రిపోర్టు.. ప్రాణాలొదిలిన యువతి

హెచ్ఐవీ సోకిందని తప్పుడు రిపోర్టు.. ప్రాణాలొదిలిన యువతి
Highlights

హెచ్ఐవీ సోకిందని తప్పుడు రిపోర్టు.. ప్రాణాలొదిలిన యువతి హెచ్ఐవీ సోకిందని తప్పుడు రిపోర్టు.. ప్రాణాలొదిలిన యువతి

డాక్టర్లు ఇచ్చిన తప్పుడు నివేదిక కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. హెచ్ఐవి ఉందని రిపోర్టులో పేర్కొనడంతో ఈ దారుణం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సిమ్లాకు చెందిన 22 ఏళ్ల యువతి అనారోగ్యంతో చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళింది. ఆమెకు చికిత్సలో భాగంగా రక్త పరీక్షలు చేశారు వైద్యులు. అయితే ఆ పరీక్షలో ఆమెకు హెచ్ఐవి ఉన్నట్టు తప్పుగా పేర్కొన్నారు. ఈ విషయాన్నీ ఆ యువతికి చెప్పగా.. ఆమె షాక్ కు గురైంది. దిగులుతో కోమాలోకి వెళ్లి తుదిశ్వాస విడిచింది. అయితే తల్లిదండ్రులకు అనుమానం వచ్చి మృతదేహానికి పరీక్ష చేయించగా ఆమెకు హెచ్ఐవీ లేదని తేలింది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్థావించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ దర్యాప్తునకు ఆదేశించారు.


లైవ్ టీవి


Share it
Top