కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీస్ చేయి కొరికి.. రక్తాన్ని చొక్కాపై ఉమ్మి..

కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీస్ చేయి కొరికి.. రక్తాన్ని చొక్కాపై ఉమ్మి..
x
Highlights

లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎవరైనా వాహనాలు వేసుకొని రోడ్లపైకి వస్తే...

లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎవరైనా వాహనాలు వేసుకొని రోడ్లపైకి వస్తే ఆరదండాలు వేయిస్తున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడంలేదు. కొంత మంది అయితే పోలీసులపైకి తిరగబడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకుంది. బిదాన్ నగర్ ప్రాంతంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న పోలీసులు అటు వచ్చిన ఓ కారును ఆపారు. ఎందుకు ప్రయాణం చేస్తున్నారని ప్రశ్నించారు.

కారులో ఉన్న డ్రైవర్, మరో యువకుడిని పక్కకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ఇంతలోనే కారు దిగిన 20 ఏళ్ల యువతి పోలీసులపై దాడికి దిగింది. ఆమెతో పాటు ఉన్న యువకుడు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన యువతి ఓ పోలీస్ చేతిని కొరికి ఆ రక్తాన్ని మరో పోలీస్ చొక్కాపై ఉమ్మేసింది. ఈ ఘటనతో షాకైన పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories