వింగ్‌ కమాండర్ అభినందన్ బదిలీ.. పాకిస్థాన్..

వింగ్‌ కమాండర్ అభినందన్ బదిలీ.. పాకిస్థాన్..
x
Highlights

వింగ్‌ కమాండర్ అభినందన్ బదిలీ అయ్యారు. ఆయనను ఎయిర్‌ ఫోర్స్ అధికారులు బదిలీ చేశారు. ఇప్పటివరకు నిర్వహిస్తున్న శ్రీనగర్ ఎయిర్‌బేస్ నుంచి ఆయనను...

వింగ్‌ కమాండర్ అభినందన్ బదిలీ అయ్యారు. ఆయనను ఎయిర్‌ ఫోర్స్ అధికారులు బదిలీ చేశారు. ఇప్పటివరకు నిర్వహిస్తున్న శ్రీనగర్ ఎయిర్‌బేస్ నుంచి ఆయనను పాకిస్థాన్ సరిహద్దుల్లోని వెస్ట్రన్ సెక్టార్‌కు బదిలీచేశారు. భద్రతా కారణాల రీత్యా ఈ బదిలీ జరిగినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో అభినందన్‌ పాక్ ఎఫ్-16 విమానాన్ని కూల్చివేయడం సంచలనం సృష్టించింది. విమానాన్ని కూల్చి వేసాక పొరపాటున పాకిస్థాన్ ప్రవేశించిన ఆయన రెండు రోజుల పాటు ఆ దేశంలో అభినందన ఉండిపోయారు.

ఈ క్రమంలో భారత్.. పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేయడంతో పాకిస్థాన్ అభినందన్ ను విడిచి పెట్టింది. దాంతో స్వల్పంగా గాయపడ్డ అభినందన్ కొన్నిరోజులుగా బెంగుళూరులో వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. త్వరలోనే మళ్లీ విధుల్లోకి చేరనున్నట్టు ఐఏఎఫ్ అధికారులు చెబుతున్నారు. అయితే, విధుల్లో చేరడానికి ముందు బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఆయన పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇటీవల కొద్దివారాల పాటు వరుస వైద్య పరీక్షలు చేయించుకున్న అభినందన్‌కు రాబోయే వారాల్లో ఐఏఎం మరికొన్ని టెస్ట్‌లు నిర్వహించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories