Lunar Eclipse: చంద్రగ్రహణం శరీరం, మనస్సులను ప్రభావితం చేస్తుందా..! వాస్తవాలు ఏంటి..

Will the Lunar Eclipse on November 19 Affect People Body and Mind
x

చంద్రగ్రహణం(ఫైల్ ఫోటో) 

Highlights

*నవంబర్ 19న చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

Lunar Eclipse: నవంబర్ 19న చంద్రగ్రహణం ఏర్పడుతుంది.ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది. 580 ఏళ్ల తర్వాత ఈ సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం వ్యవధి మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుంది. చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న ఇంత సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.

భారతదేశంలో ఈ చంద్రగ్రహణం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలలో కనిపిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం మీ మనస్సు, శరీరాలను ప్రభావితం చేస్తాయా తెలుసుకుందాం.

సౌర వ్యవస్థలో భూమి ఉపగ్రహమైన చంద్రుడికి చాలా చరిత్ర ఉంది. ఇది ఒక ఖగోళ సంఘటనగా చెప్పవచ్చు. చంద్రునికి సూర్యునికి మధ్యగా సరళరేఖ మార్గంలో భూమి వచ్చిన సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది.

ఈ స్థితిని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. చంద్రుడు పూర్తిగా కనిపిస్తే సంపూర్ణ చంద్ర గ్రహణం, పాక్షికంగా కనిపిస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం అనేది ఖగోళ ప్రక్రియ అయినప్పటికీ ఇది మనస్సు, శరీరాలను కూడా ప్రభావితం చేస్తుంది.

జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు మనస్సుకు అధిపతి అని చెప్పారు. ఇది మన ఊహను ప్రభావితం చేస్తుంది. మన మనస్సు చంచలంగా లేదా స్థిరంగా ఉంటుందో అది మన జాతకంలోని చంద్రుని స్థానాన్ని బట్టి తెలుస్తుంది. అంతేకాదు చంద్రగ్రహణం సమయంలో సముద్రంలో అలజడి ఉంటుంది. ఆటుపోట్లలో తేడాలుంటాయి. అలలు వేగంగా వస్తాయి.

ఒక పరిశోధన ప్రకారం చంద్రుడు, సముద్ర అలల వెనుక పెద్ద కారణం ఉంది. అదేవిధంగా మానవ శరీరం కూడా 70 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చంద్రుని ప్రభావం మానవ శరీరంపై కూడా పడుతుంది.

సముద్రంలో లభించే సోడియం, కాల్షియం, పొటాషియం మొత్తం మన శరీరంలోని రక్తంలో కూడా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల సముద్రపు అలల వలె మానవ శరీరం కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. శరీరంలోని జీవరసాయన మార్పుల వల్ల పౌర్ణమి రోజున నేరాలకు పాల్పడే ధోరణి ఎక్కువగా ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories