కేంద్ర ఆర్ధిక మంత్రిని మారుస్తారంటూ ప్రచారం..

కేంద్ర ఆర్ధిక మంత్రిని మారుస్తారంటూ ప్రచారం..
x
Nirmala Sitharaman, K V Kamath(file photo)
Highlights

కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను వేరే శాఖకు బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆర్థికమంత్రి పదవికి మరొకరిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. పనితీరు సరిగ్గాలేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా ప్రధాని యోచిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మంత్రిత్వ శాఖలను ఎనిమిది క్లస్టర్లుగా విభజించి, వాటి పురోగతి, సంబంధిత మంత్రుల పనితీరుపై చర్చించారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో మంత్రివర్గంలో చేరికలు, తొలగింపుల తోపాటు మంత్రిత్వ శాఖల మార్పులు కూడా ఉండవచ్చని ప్రచార సారాంశంగా ఉంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. అయితే కొత్త ఆర్ధిక మంత్రి రేసులో బ్యాంకర్ కెవి కామత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories