Vice President: తదుపరి వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నది ఎవరు? శశిథరూర్? నితీశ్?

Wholl Be The Next Vice President Of India
x

Vice President: తదుపరి వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నది ఎవరు? శశిథరూర్? నితీశ్?

Highlights

Vice President: ఓ పక్క వర్షాకాలపు సమావేశాలు జరుగుతుంటే మరోపక్క ఉపరాష్ట్రపతి పదవికి జగదీఫ్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

Vice President: ఓ పక్క వర్షాకాలపు సమావేశాలు జరుగుతుంటే మరోపక్క ఉపరాష్ట్రపతి పదవికి జగదీఫ్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి స్థానాన్ని ఎవరు బర్తీ చేస్తారా? అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే తెర మీదకు రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు పక్కా ఉప రాష్ట్రపతి అవుతారని అందరూ అంటున్నారు.

ఉపరాష్ట్రపతి దన్‌ఖడ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలు, వైద్యం చేయించుకునే కారణాలు చెబుతూ ఆయన ఈ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు. అయితే పదవీ కాలం ఉండగానే మధ్యలో ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరు వస్తారన్నదే ఇప్పుడు అంతటా ఆసక్తిగా మారింది.

ఉపరాష్ట్రపతి రేసులో ఇద్దరు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్, రెండోది సీనియర్ ఎంపీ శిశిథరూర్. అయితే వీరిద్దలో ఎవర్ని ఎంపిక చేస్తారన్నది మాత్రం సస్పెన్స్.

బీహార్‌‌కు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్‌ కుమార్‌‌ పేరు తెరపైకి రావడం వెనుక కారణం ఏంటంటే.. మరికొన్ని నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రానికి గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రిగా నితీశ్ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇక సీఎమ్ సీట్‌ను కొత్త తరానికి ఇవ్వాలనే కారణంగా నితీశ్‌ను ఇలా ఉప రాష్ట్రపతిగా కుర్చీలో కుర్చోబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ఇదే గనక జరిగితే బీహార్‌‌లో ముఖ్యమంత్రి పదవి బీజేపీ దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. జెడీయుకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా నితీశ్ కుమారుడు నిషాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

మరోవైపు ఉప రాష్ట్రపతి రేసులో ఉన్న మరో వ్యక్తి శశిథరూర్. ఈయన సీనియర్ కాంగ్రెస్ ఎంపీ. అయితే త్వరలో ఆయన హస్తానికి బాయ్ బాయ్ చెప్పి, బీజేపీలో చేరతారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా వార్తలు రావడం వెనుక బలమైన కారణమే ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్రం నిర్మించిన ఎంపీల కమిటీలో ఒక దానికి థరూర్ కూడా నేతృత్వం వహించారు. దీంతో తాజా రేసులో థరూర్ పేరు వినబడుతుంది. ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి స్థానానికి లెఫ్ట్‌ నెంట్ గవర్నర్లకూ ఛాన్స్ ఉంది. డిల్లీ, జమ్మూ కశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories