WHO Suggestions on Bakreed 2020 Celebrations: సామాజిక దూరం పాటించాలని హితవు

WHO Suggestions on Bakreed 2020 Celebrations: సామాజిక దూరం పాటించాలని హితవు
x
WHO
Highlights

WHO Suggestions on Bakreed 2020 Celebrations: ముస్లింలకు అత్యంత ప్రధానమైన పండగల్లో బక్రీద్ ఒకటి.

WHO Suggestions on Bakreed 2020 Celebrations: ముస్లింలకు అత్యంత ప్రధానమైన పండగల్లో బక్రీద్ ఒకటి. దీనిని వారంతా గొప్పగా జరుపుకుంటారు. ఈ సమయంలో ఇంటిల్లపాది జంతువులను వధించి, ప్రత్యేక వంటకాలతో సంతోషంగా గడుపుతారు. అయితే ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో ఇలాంటి సంతోషాలకు ఇబ్బంది ఏర్పడింది. ఆనందంగా గడిపే సమయంలో భౌతిక దూరం, మాస్క్ ల వంటివి వాడక పోవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. దీంతో పాటు ఇటీవల కాలంలో మేకల్లో సైతం కరోనా వచ్చినట్టు గుర్తించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకని ప్రపంచ ఆరోగ్య సంస్థ బక్రీద్ నిర్వహణపై పలు సూచనలు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ సహకరించాలని కోరింది.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో నూతన మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) విడుదల చేసింది. బక్రీద్ పండుగ సందర్భంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించింది. సామాజికదూరం పాటించడంతోపాటు మాస్కును తప్పని సరిగా ధరించాలని సూచించింది. జంతు వధ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తను కూడా వివరించింది.

అనారోగ్యం బారినపడిన గొర్రెలను, ఇతర జంతువులను వధించరాదని.., అస్వస్థతతో ఉన్న జంతువులను ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. సాధ్యమైనంత వరకు ఇళ్ల వద్ద జంతు వధకు చేయవద్దని తెలిపింది. అంతేకాదు, బక్రీద్ సందర్భంగా ఒకరినొకరు భౌతికంగా తాకే రీతిలో పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా, చేయి ఊపడం, హృదయంపై చేయి ఆన్చడం వంటి చర్యలతోనూ బక్రీద్ విషెస్ చెప్పవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories