WHO: కోవిడ్ మరణాలపై భారత్ తప్పుడు లెక్కలు

WHO Report on Covid Deaths | Telugu News
x

WHO: కోవిడ్ మరణాలపై భారత్ తప్పుడు లెక్కలు

Highlights

WHO: కరోనాతో ఇండియాలో 47లక్షల మరణాలు

WHO: భారత్‌లో కరోనా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన దుమారం రేపుతోంది. జనవరి 2020 నుంచి డిసెంబర్ 21 మధ్యకాలంలో ఇండియాలో 47లక్షల మంది కోవిడ్‌తో మృత్యువాత పడ్డారని WHO రిపోర్ట్ పేర్కొంది. భారత ప్రభుత్వం ప్రకటించిన అధికారిక గణాంకాల కంటే మరణాలు 10రెట్లు అధికమని రిపోర్ట్ వెల్లడించింది. వరల్డ్ వైడ్‌గా కరోనా మృతుల సంఖ్య మూడోవంతు భారత్‌లో నమోదయ్యాయని పేర్కొంది. ఇటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య కోటిన్నర ఉందని తెలిపింది. అన్ని దేశాల అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 6మిలియన్లుగా ఉందని పేర్కొంది. ఇండియాలో అన్ని దేశాల కంటే ఎక్కువ మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపింది.

WHO రిపోర్ట్‌పై భారత సర్కార్ మండిపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలను కేంద్రం తప్పు పట్టింది. ఏవో వెబ్ ‌సైట్లు, మీడియా రిపోర్టుల ఆధారంగా గణించడం సహేతుకం కాదని తెలిపింది. ఇక డేటా సేకరించిన విధానం శాస్త్రీయంగా లేదని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కౌంటర్ అటాక్ చేసింది. WHO ప్రకటించిన కోవిడ్ మృతుల సంఖ్య వాస్తవికతకు దూరంగా ఉందని పేర్కొంది. జనన, మరణాల రిజిస్ట్రేషన్‌కు భారత్‌లో పటిష్టమైన విధానాలున్నాయని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories