హౌడీ మోడీలో హౌడీ అంటే ఏంటో తెలుసా...?

హౌడీ మోడీలో హౌడీ అంటే ఏంటో తెలుసా...?
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లో అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలతో ముచ్చటించనున్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో మోడీకి ప్రవాస భారతీయులు భారీగా స్వాగతం...

ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లో అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలతో ముచ్చటించనున్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో మోడీకి ప్రవాస భారతీయులు భారీగా స్వాగతం పలికుతున్నారు. దాదాపు 72 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యమున్న హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్‌ స్టేడియం ఇందుకు వేదిక అయ్యింది. ఇప్పటికే ఈ స్టేడియంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మోడీ ప్రసంగం సందర్భంగా వివిధ సాంప్రదాయల నృత్యాలతో అలరిస్తున్నారు. మొత్తం 4వేల మంది కళాకారులతో ఈ ఈవెంట్‌ జరుగుతుంది.

మోడీ హౌడూయూ డూ అనే పదాన్ని రిథిమిక్‌గా హౌడీ మోడీగా రూపుదిద్దుకొని ఈ భారీ ఈవెంట్ కు పేరుగా నిలిచింది. మోడీ కార్యక్రమంలో కార్యక్రమాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంగ్లీషు హిందీ, స్పానిష్‌లలో ఉంటుంది. అమెరికా కాలమానం ప్రకారం అక్కడ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఈవెంట్ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇదిలాఉంటే గతంలో ఎన్ఆర్జీ స్టేడియంలో 2006లో జరిగిన ఆఫ్ షోర్ టెక్నాలజీ సదస్సుకు 59,236 మంది హాజరవ్వడం రికార్డుగా ఉంది. ఈ రికార్డును నేడు బద్దలు కొట్టేందుకు హౌడీ మోడీ సభ వేదిక కానుందని భావిస్తున్నారు.

హౌడీ మోడీ కార్యక్రమం టెక్సాస్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి టెక్సాస్ ను ఎంపిక చేసుకోవడం వెనుక కారణం ఉంది. టెక్సాస్‌ అమెరికా ఆర్థిక రాజధానిగా పేరు పొందింది. ముఖ్యంగా ఇండియా అమెరికా వ్యాపారంలో పదిశాతం టెక్సాస్‌లో జరుగుతుందని, టెక్సాస్ ఇండియా మధ్య 700 కోట్ల డాలర్ల మేర సరుకులు, ఉత్పత్తులు రవాణా అవుతుంటాయి. భారతదేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు ఎక్కువగా టెక్సాస్‌లోనే తమ కార్యాలయాలను తెరిచాయి. దీంతో ఆ ప్రాంతంలో భారతీయులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే హౌడీ మోదీ కార్యక్రమం ద్వారా అమెరికా, ఇండియాలను మరింత చేరువ చేయడానికి వీలు ఏర్పడుతుందని టెక్సాస్ ఇండియా ఫోరం అభిప్రాయపడింది. హౌడీ మోదీ రెండు సంస్కృతుల సమ్మేళన కార్యక్రమం అని టెక్సాస్ ఇండియా ఫోరం అధ్యక్షుడు ప్రణవ్ దేశాయ్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories