Vice President Resigns: 2027 వరకు పదవీకాలం ఉన్నా మధ్యలో రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి, మరి ఇప్పుడు ఎవరు ఆ స్థానంలోకి వస్తారు?

Vice President Resigns
x

Vice President Resigns: 2027 వరకు పదవీకాలం ఉన్నా మధ్యలో రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి, మరి ఇప్పుడు ఎవరు ఆ స్థానంలోకి వస్తారు?

Highlights

Vice President Resigns: భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో వెల్లడించారు.

Vice President Resigns: భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో వెల్లడించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుంటి మధ్యలో రాజానామా చేయడం వల్ల ఎవరు ఇప్పుడు ఆ స్థానాన్ని బర్తీ చేస్తారన్నదానిపై పలు రకాల ఊహాగానాలు వస్తున్నాయి.

ఉపరాష్ట్రపతి దన్‌ఖడ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆరోగ్య కారణాలు, వైద్యం చేయించుకునే కారణాలు చెప్పుడూ ఆయనా ఈ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు. అయితే మధ్యలో ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం ఇదే మొదటి సారి. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరైనా వస్తారా? వస్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది? తెలుసుకుందాం..

రాష్ట్రపతి అయినా, ఉపరాష్ట్రపతి అయినా రాజ్యాంగం, పార్లమెంటు నియమాల ప్రకారమే ఎన్నికవుతారు. అదేవిధంగా మధ్యలో రాజీనామా చేయాల్సి వచ్చినా కూడా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారమే రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ అంటే 2027 వరకు ఉన్నప్పటికీ ముందే ఆయన రాజీనామా చేయడం అందరినీ ఇప్పుడు ఆశ్చర్యపరిచింది.

కొత్త ఉపరాష్ట్ర పతిని ఎలా ఎన్నుకుంటారు?

ఎవరైనా మధ్యలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతే ఆ స్థానంలో వేరే వాళ్లు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలో తొలుస్తుంది. అయితే దీనికి సమాధానం ఏంటంటే.. ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన వెంటనే డిప్యూటీ చైర్మన్ ఆయన స్థానంలో పనిచేస్తారు. ఉపరాష్ట్రపతి ప్రధానమైన డ్యూటీ ఏంటంటే రాజ్యసభ్‌కు చైర్మన్‌గా ఉండటం. అలాగే ఇక్క డిప్యూటీ చైర్మన్‌లు కూడా ఉంటారు. కాబట్టి ఉపరాష్ట్రపతి స్థానంలో ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక ఆయనే రాజ్యసభ కార్యకలాపాలకు అధ్యక్షత వహిస్తారు. సమావేశాలు నిర్వహిస్తారు. అయితే డిప్యూటీ చైర్మన్‌ కూడా లేకపోతే రాజ్యసభ్యులు ఎవరైనా వైస్ చైర్మన్ల ప్యానెల్‌లో సీనియర్ సభ్యుడ్ని ఎన్నుకోవచ్చు. అతన్ని తాత్కాలిక చైర్మన్‌ని చేసి బాధ్యతలు అప్పటించవచ్చు.

గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?

2022లో మాజీ ఉపరాష్ట్రపతి, గతంలో రాజ్యసభ చైర్మన్‌గా పనిచేసిన వెంకయ్య నాయుడు పదవీ కాలం 2022లో ముగిసిన తర్వాత కొత్త ఉపాధ్యక్షుడు జగదీష్‌ ఎన్నికయ్యే వరకు రాజ్యసభను డిప్యూటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్యానెల్ నిర్వహించింది.

ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు?

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపాధ్యక్షుడిని లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. నోటిఫికేషన్ జారీ అయిన 60 రోజుల్లోపు ఈ ఎన్నికను నిర్వహిస్తారు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే.. మన రాజ్యాంగంలో తత్కాలిక ఉపాధ్యక్షుడు అనే నిబంధన మాత్రం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories