BAKRID: త్యాగాల పండగ..బక్రీద్..బక్రీద్ నాడు బలి ఇవ్వడం అంటే అర్థం ఏంటి?

What does it mean to sacrifice on Bakrid
x

BAKRID: త్యాగాల పండగ..బక్రీద్..బక్రీద్ నాడు బలి ఇవ్వడం అంటే అర్థం ఏంటి?

Highlights

Bakrid 2025: ప్రతి ఏడాది అరబీ నెల జిల్ హజ్ 10వ రోజు హజ్ పెరునా అని పిలిచే బక్రీద్ పండగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలు జరుపుకుంటారు.

Bakrid 2025: ప్రతి ఏడాది అరబీ నెల జిల్ హజ్ 10వ రోజు హజ్ పెరునా అని పిలిచే బక్రీద్ పండగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలు జరుపుకుంటారు. ఖురాన్ అవతరించిన రంజాన్ మాసంలో జరుపుకునే రంజాన్ పండగ మాదిరిగానే ఈ బక్రీద్ పండగ ఇస్లాం మతస్తులకు ఒక ముఖ్యమైన పండగ అని చెప్పవచ్చు. తమిళనాడు ప్రభుత్వ ఖాజీల సమైక్య కార్యదర్శి తూత్తుకుడి జిల్లా ప్రభుత్వఖాజీ అయిన ముజీబుర్ రహ్మాన్ మస్జిద్ మాట్లాడుతూ..ప్రవక్త ఇబ్రాహిం తన కాలంలో జరిగిన క్రూరమైన పాలనలో భయం లేకుండా దైవ సూత్రాన్ని ప్రకటించారని తెలిపారు.

ఒక రోజు అర్థరాత్రి గాఢనిద్రలో ఉన్న ఇబ్రాహింకు కల వచ్చింది. తన కుమారుడిని తానే దేవుడికి బలి ఇవ్వాలనే కల ప్రవక్తకు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆందోళన చెందాడు. తాను కన్న కలను ప్రవక్త ఇబ్రాహిం తన కుమారుడికి చెప్పాడు. ప్రవక్తఇబ్రాహం కుమారుడు తన తండ్రి అభిప్రాయానికి విరుద్దంగా ప్రవర్తించేందుకు ఇష్టపడకుండా కలలో వచ్చిన దైవ ఆదేశాన్ని వెంటనే నెరవేర్చని తన తండ్రితో ప్రవక్త ఇస్మాయిల్ చెప్పాడు.

కుమారుడు ప్రవక్త ఇస్మాయిల్ అలా చెప్పడం తండ్రికి గుండెలో బాధను కలిగించింది. దానికి ఒక మార్గాన్ని అనుసరించాడు. నన్ను నేరుగా పడుకోబెట్టి నరికేస్తే మీ మనస్సు మారిపోతుంది కాబట్టి నన్ను భూమి వైపు చూస్తూ పడుకోబెట్టి నా తలను నరికి బలి ఇవ్వడంటూ చెప్పాడు. అప్పుడు జిబ్రయిల్ అని పిలిచే దేవదూతను పంపించి అల్లాహ్ ఆ బలిని ఆపాడు. అక్కడ ఒక గొర్రెను ఉంచి ఇస్మాయిల్ కు బదులుగా ఆ గొర్రెన బలి ఇవ్వమి అల్లాహ్ ఆజ్నాపించాడు. కుమారుడు ప్రవక్త ఇస్మాయిల్ ప్రాణాలనే బలి ఇచ్చేందుకు సాహసించిన ఆ తండ్రి త్యాగాన్ని ప్రశంసిస్తూ..ఆ నరబలిని అల్లాహ్ ఆపాడు. ఆ రోజు ఆ ఘటన జ్నాపకార్థం ఒక గొర్రెను బలిఇచ్చిదానికి అందరికీ పంచుకుని తినమని దైవవాణి చెప్పింది. ఈ కారణంగా వల్లే ఖుర్బానీ అనేది బక్రీద్ పండగలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. రంజాన్ రోజుల్లో ఉపవాసం ఉండి ఆహారాన్ని పంచుకుంటారు. కానీ బక్రీద్ పండగలో ఆహారం వలె గొర్రెలు, ఆవులు, ఒంటెల మాంసాన్ని పంచుకుంటార.

Show Full Article
Print Article
Next Story
More Stories