రాహుల్ రాజీనామా చేసి సాధించింది ఏంటి ?

రాహుల్ రాజీనామా చేసి సాధించింది ఏంటి ?
x
Highlights

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్షడి పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే .. అ...

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్షడి పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే .. అ పదవిలో తానూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ తన రాజీనామా లేఖని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు రాహుల్ .. అయితే ఇంతా చేసి రాహుల్ సాధించింది ఏంటి ? అసలు రాహుల్ ఎం అనుకుంటున్నాడు? అయన ప్లాన్ ఏంటి ?

నిజానికి ఏఐసీసీ అధ్యక్షుడుగా రాహుల్ ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా వచ్చే ప్రాబ్లం అయితే ఏమి లేదు . కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసే పని మాత్రమే రాహుల్ ముందున్నట్లు తెలుస్తుంది .. కాంగ్రెస్ లో వయసుతో సంబంధం లేకుండా అందరు రాజకీయం చేస్తున్నారు . మొత్తం కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో 55 మంది సభ్యలు ఉన్నారు . ఇందులో 19 మంది 70 ఏళ్లకి పై బడిన వారే .. ఇక 60 ఏళ్ల లోపు వారు 22 మంది ఉన్నారు .. అయితే మొత్తం సీనియర్ బ్యాచ్ లను పక్కన పెట్టేసే పనిలో ఉన్నారట రాహుల్ .. అధికారాన్ని వీడకుండా పోరాటాలు చేయలేమని పార్టీలో చాలా మందికి అధికార దాహం ఉందని విమర్శిస్తూ రాహుల్ ఓ లేఖ కూడా రాశారు.

దీనితో ఒక్క విషయం మాత్రం పూర్తిగా స్పష్టం అయింది . కొత్తతరం నాయకులూ వస్తేనే పార్టీ మనుగడ ఉంటుందని రాహుల్ భావిస్తున్నారు . అందుకే తానూ రాజీనామా చేస్తే మిగతా సీనియర్ నాయకులూ కూడా రాజీనామా చేస్తారని తద్వారా పార్టీని మెరుగుపరచడం అనేది ఈజీ అని రాహుల్ లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తుంది . 2014 లో అధికారంలోకి వచ్చిన బీజేపి కూడా 70ఏళ్ళు దాటినా ఎవరు కూడా రాజీకీయం చేయొద్దని ఓ సిద్దాంతాన్ని తీసుకువచ్చింది . ఇప్పుడు దీన్నే రాహుల్ అమలు చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి ..

Show Full Article
Print Article
Next Story
More Stories