హెయిర్ ఫాల్ ను తగ్గించడం కోసం ఆ మందు వాడారు.. చివరకు తోడేలు అయ్యారు..

హెయిర్ ఫాల్ ను తగ్గించడం కోసం ఆ మందు వాడారు.. చివరకు తోడేలు అయ్యారు..
x
Highlights

పురుషుల్లో మేల్‌ హార్మోన్సు అధికంగా ఉండడం వల్ల అవాంఛిత వెంట్రుకలు వస్తాయని వైద్యులు చెబుతుంటే వింటుంటాం. కానీ మొహం మీద ఒక జంతువుకు పెరిగే విధంగా...

పురుషుల్లో మేల్‌ హార్మోన్సు అధికంగా ఉండడం వల్ల అవాంఛిత వెంట్రుకలు వస్తాయని వైద్యులు చెబుతుంటే వింటుంటాం. కానీ మొహం మీద ఒక జంతువుకు పెరిగే విధంగా వెంట్రుకలు పెరిగితే అది కచ్చితంగా భయంకరమైన వ్యాధే అవుతుంది. అలాంటిది స్పెయిన్ లోని కొందరు యువకులకు వచ్చింది. తలపై ఉన్న జుట్టంతా ఊడిపోతూ ఉంటే దానికి విరుగుడుగా 'ఫార్మా క్వమికా' కంపెనీ తయారుచేసిన మందులను వాడారు. అంతే వారి ముఖాలు తోడేలు ముఖాల్లా తయారయ్యాయి. మొఖం, నెత్తిమీద తోడేలుకు మొలిచినట్టు వెంట్రుకలు భయంకరంగా వచ్చాయి. దీన్ని 'వర్‌ఫూల్ఫ్‌ సిండ్రోమ్‌' అని పిలుస్తారు, అలాగే 'హైపర్‌ట్రికోసిస్‌'గా వ్యవహరిస్తారని స్పెయిన్‌ వైద్యనిపుణులు తేల్చారు.

హెయిర్ ఫాల్ ను తగ్గించడం కోసం మందు వాడితే.. 16 మంది యువకులు 'హైపర్‌ట్రికోసిస్‌'వ్యాధి బారిన పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, ముఖాన భారీగా వెంట్రుకలు వచ్చాయని.. అవి అవాంఛితంగా వచ్చాయని గుర్తించారు స్పెయిన్ వైద్య నిపుణులు. తయారీకి వాడిన బ్యాచ్‌ కెమికల్ మొత్తం కలుషితం అయిందని.. 'ఫార్మా క్వమికా' కంపెనీ అనే ఔషధ తయారీ సంస్థ ఈ మందును తయారుచేసిందని తెలిపారు. ఇప్పటికే 'ఫార్మా క్వమికా' లైసెన్స్‌ను రద్దు చేశామని పేర్కొన్నారు. 'క్వమికా' కంపెనీ భారత్‌కు కూడా ఔషధాలను విక్రయిస్తుందని అక్కడి మీడియా కధనాలు ప్రసారం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories