ఆవు పాలలో బంగారం ఉంది... తీసుకొని లోన్ ఇవ్వాలన్న వ్యక్తి

Dilip Ghoshs statement that Indian cows milk contains gold
x
Dilip Ghosh's statement that Indian cows' milk contains gold
Highlights

ఆవు పాలలో బంగారం ఉంటే ఏం చేస్తాం. ఆ బంగారం ఏ బ్యాంక్ లోనే తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకుంటాం. లేదా నగలు చేయించుకొని ధరిస్తాం. అసలే బంగారం ధర రోజు...

ఆవు పాలలో బంగారం ఉంటే ఏం చేస్తాం. ఆ బంగారం ఏ బ్యాంక్ లోనే తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకుంటాం. లేదా నగలు చేయించుకొని ధరిస్తాం. అసలే బంగారం ధర రోజు రోజుకు పెరిగుతూ ఆకాశాన్ని అంటుతుంది.దీంతో బంగారం కొనేపరిస్థితి లేదు. అలాంటి ఓ జాతీయ పార్టీకి చెందిన నేత వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద చర్చలు దారితీశాయి. ఆయన మాటలతో ఇప్పుడు అందరూ ఆవులను తీసుకొని రుణం ఇవ్వాలని పైనాన్స్ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. చివరికీ ఆ నాయకుడు, పార్టీ నేతలు కూడా ఇరుకున పడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగల్ రాష్ట్రంలో జరిగింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీకి చెందిన ముఖ్య నేత దిలీస్ ఘోష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బుర్ధ్వాన్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ఆవు పాలల్లో బంగారం ఉందని, విదేశీ ఆవుల్లో లేదని, మూపురం ధమని మన దేశ అవుల్లోనే ఉందని దానిని బంగారు ధమని అంటారని వ్యాఖ్యానించారు. ఘోష్ వ్యాఖ్యలను సిరీయస్ గా తీసుకున్నదంకుని ప్రాంతానికి చెందిన వ్యక్తి‎, తన ఆవును తీసుకొని ఓ ప్రముఖ ఫైనాన్స్ సంస్థ వద్దకు వెళ్లాడు. అక్కడ అధికారులను తన ఆవు తీసుకొని లోవు ఇవ్వాలని కోరాడు. దీంతో వారు అవాక్కయ్యారు. ఆవును తీసుకొని లోను ఎలా ఇస్తామని ప్రశ్నించారు. దిలీస్ ఘోష్ ఆవులో బంగారం ఉంది. ఆవు తీసుకొని లోన్ ఇస్తే వ్యాపారం చేసుకుంటాని చెప్పుకొచ్చారు.

దీలీస్ ఘోష్ వ్యాఖ్యలను పలువురు విమర్శిస్తున్నారు. గరల్ గాచా గ్రామ సర్పంచ్ మనోజ్ సింగ్ ఖండించారు. దీలీస్ ఘోస్ కు నోబెల అవార్గు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను పరిగణంలోకి తీసుకొని తన వద్దకు చాలా మంది ఆవులను తీసుకొచ్చి రుణం ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. దీలీస్ ఘోస్ మాట్లాడుతూ మూపురం ధమని, సూర్యరశ్మీ వలన బంగారంలా మారుతుందని అందుకే వ్యాఖ్యానించానని తెలిపారు. దీలిస్ వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories