Amit Shah: మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం

We Will Make It A Maoist-Free Country Says Amit Shah
x

Amit Shah: మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం

Highlights

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్ హర్షణీయం

Amit Shah: ప్రధాని మోడీ నేతృత్వంలో గడిచిన పదేళ్లలో మావోయిస్టులు, ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీగఢ్‌తోపాటు దేశం మొత్తాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి చేశామన్నారు. మావోయిస్టులు దేశ అభివృద్ధికి అతిపెద్ద శత్రువులని షా చెప్పుకొచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీస్ బలగాలను అమిత్ షా అభినందించారు. మావోయిస్టులను అరికట్టేందుకు ఛత్తీస్‌గఢ్‌లో ఈపాటికే 250 శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 80 మందికి పైగా మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశామని షా గుర్తు చేశారు. మరో 125 మందికి పైగా అరెస్ట్ అయ్యారని, 150 మందికి పైగా లొంగిపోయారని ఆయన వివరించారు. ఛత్తీస్‌గఢ్‌తోపాటు దేశమంతా మావోయిస్ట్ రహితంగా మారుతుందని షా భరోసా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories