ఏఐ సహకారంతో బీజేపీని ఓడిస్తాం: అఖిలేష్ యాదవ్

ఏఐ సహకారంతో బీజేపీని ఓడిస్తాం: అఖిలేష్ యాదవ్
x
Highlights

హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని బీజేపీ పార్టీని ఓడిస్తామని ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్...

హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని బీజేపీ పార్టీని ఓడిస్తామని ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. తాము విభజన రాజకీయాలకు వ్యతిరేకమని, దానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విజన్ ఇండియా ద్వారా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. సానుకూల, అభివృద్ది, ప్రగతిశీల రాజకీయాలే చేస్తామని తెలిపారు.

సమాజ్ వాది పార్టీ అధ్యర్యంలో శనివారం హైదరాబాద్ లో జరిగిన విజన్ ఇండియా సమ్మిట్ లో ఆ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. పరిపాలనలో సాంకేతికత వినియోగం, భవిష్యత్తులో సాంకేతికత రూపాంతరం వంటి అంశాలపై యువతలో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అన్ని ప్రధాన పట్టణాల్లో విజన్ ఇండియా సమ్మిట్ లను నిర్వహిస్తోంది. మొదటి సమ్మిట్ బెంగళూరులో నిర్వహించగా, రెండో సమ్మిట్ హైదరాబాద్ లో నిర్వహించింది.

ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ... రైతులకు, మౌలిక సదుపాయాల కల్పనకు, పట్టణీకరణ, పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ట్రాఫిక్ సమస్య పరిష్కారం, ఆరోగ్య, తదితర రంగాల్లో ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీటిపై సమ్మిట్ లో నిపుణులు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారని వివరించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని నేరాలను కట్టడి చేయడానికి ఉపయోగించాలని చెప్పారు. మానవులకు సరైన దృక్పథాన్ని, సానుకూల ఆరోచనలు కలిగించేలా భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories