రాహుల్ గాంధీపై స్వామి చక్రపాణి అసభ్యకర వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై స్వామి చక్రపాణి అసభ్యకర వ్యాఖ్యలు
x
Swami Chakrapani File Photo
Highlights

రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడని అఖిలా భారత హిందూ మహాసభ అధ్యక్షడు స్వామి చక్రపాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెప్ నేత రాహుల్ గాంధీపై స్వామి చక్రపాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడని అఖిలా భారత హిందూ మహాసభ అధ్యక్షడు స్వామి చక్రపాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పుస్తకంలో హిందూ మహాసభ సహ వ్యవస్థాపకుడు సావర్కర్‌కు- నాథూరాం గాడ్సేతో శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్ సేవాదళ్ పంచారని ప్రచారం సాగుతోంది.

కాగా.. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేతో సావర్కర్‌కు శారీరక సంబంధం ఉందని ఆరోపణలు దేశావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీనిపై స్వామి చక్రపాణి ఖండించారు. రాహుల్ హోమో సెక్స్‌వల్ అని విన్నామని ఆయన వ్యాఖ్యానించారు.

పదిరోజుల కిందట వీర్ సావర్కర్ కిత్నే వీర్ పేరిట ప్రచురించిన ఓ పుస్తకాన్ని కాంగ్రెస్ సేవా దళ్‌లో పంపిణీ చేశారు. ఈ పుస్తకంలో పలు ముంద్రించిన పలు అంశాలు వివాదాస్పదమైయ్యాయి. బ్రహ్మచర్యం తీసుకోకముందే గాడ్సే స్వలింగ సంపర్కుడిగా ఉన్నారు. వీర్ సావర్కర్ ఆయన రాజకీయ గురువు కావడంతో ఆయనతో కలిసి బంధం కొనసాగించారని పేర్కొన్నారు.

అయితే దీనిపై కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ మాట్లాడారు. రాహుల్ గాంధీ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మన దేశంలో ఎవరికి నచ్చినట్టుగా ఉండే‎ స్వేచ్ఛ అందరికి ఉందని పేర్కొన్నారు. మైనార్టీ మహిళలను అత్యాచారాలు చేయమని సావర్కర్ అనుచరులను రెచ్చగొట్టేవాడని, మసీదులపై రాళ్లు రాళ్లు విసిరేవాడని పుస్తకంలో పేర్కొన్నారు.

అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. దేశ భక్తులను కాంగ్రెస్ అపఖ్యాతి అంటకడుతుందని విమర్శించారు. సావర్కర్ లాంటి దేశ భక్తులను అనుమానిస్తుందని రామేశ్వర్ శర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ దేశభక్తులు నచ్చరని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ నేత దుర్గేశ్ శర్మ మండిపడ్డారు. సావర్కర్ గురించి పుస్తకంలో రూపొందించిన అంశాలు కొత్తకాదని తెలిపారు. సావర్కర్ తెల్లదొరకు క్షమాపణలు చెప్పిన విషయం అందికి తెలుసని దుర్గేశ్ శర్మ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories