Water Level Increased in Bihar: నేపాల్‌లో భారీ వర్షాలు.. బీహార్‌లో పొంగిపొర్లుతున్న నదులు

Water Level Increased in Bihar: నేపాల్‌లో భారీ వర్షాలు.. బీహార్‌లో పొంగిపొర్లుతున్న నదులు
x
Highlights

Water Level Increased in Bihar: గత కొద్దిరోజులుగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బీహార్ రాష్ట్రంలోని అనేక నదులలో నీటి మట్టం పెరగడం...

Water Level Increased in Bihar: గత కొద్దిరోజులుగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బీహార్ రాష్ట్రంలోని అనేక నదులలో నీటి మట్టం పెరగడం ప్రారంభమైంది. 12 జిల్లాల్లో 29 లక్షల 62 వేల 653 మంది ప్రజలు ఈ వరదల భారిన పడ్డారు. సమస్తిపూర్‌లో, బుద్ధి గండక్ నది ప్రమాదస్థాయికంటే రెండున్నర మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఖగారియాలో కోసి 2.10 మీటర్లు, సీతామార్హిలోని బాగ్మతి ,దర్భంగ నదులు ప్రమాద స్థాయికంటే కంటే 2 మీటర్లు ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. కహల్‌గావ్‌లోని ప్రమాద గుర్తుకు పైన గంగానదీ ప్రవహిస్తోంది. కోసి నదీ నీటి మట్టం కూడా వేగంగా పెరిగింది.

గండక్ నది నీటి మట్టం మరోసారి పెరగడం ప్రారంభమైంది. దాంతో బ్యారేజీ నుండి 2 లక్షల 33 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శరణ్ జిల్లాలోని తారయ్య, పనాపూర్ ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. రెండు ప్రదేశాలలో రోడ్లకు మూడు అడుగుల ఎత్తు వరకు నీరు ప్రవహిస్తోంది. గోపాల్‌గంజ్‌లోని సరన్ ఆనకట్ట తెగడంతో, గండక్ నది నీరు పనాపూర్ , తారయ్య వైపు నీటి వేగం పెరిగింది. మంగళవారం ఉదయం నాటికి ఈ నీరు 32 గ్రామాలకు చేరుకుంది. దీంతో ఇళ్ళు మునిగిపోయాయి, ప్రజలు ప్రాణాలను రక్షించుకునేందుకు పైకప్పుల మీదకు ఎక్కారు.



Show Full Article
Print Article
Next Story
More Stories