Delhi Assembly Elections: కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..ఓటేసిన ప్రముఖులు

Delhi Assembly Elections: కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..ఓటేసిన ప్రముఖులు
x
Highlights

Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది....

Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలని 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేయనున్నారు. 699 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు.

వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కేజ్రీవాల్ నేత్రుత్వంలోని అప్ ఉవ్విళ్లూరుతుండగా 25ఏళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ కూడా గెలవని కాంగ్రెస్..ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారా మిలటరీ దళాలు, 35వేల మంది ఢిల్లీ పోలీసులు 19వేల మంది హోంగార్డులను పోలింగ్ భద్రత కోసం వినియోగిస్తున్నారు.

తొలి గంటలోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ నిర్మాణ్‌భవన్‌లో దేశ ప్రధమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నా్రు. కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటుల వేశారు. ఢిల్లీ సీఎం అతిశీ కాల్ కాజీలో, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేడీ అరవింద్ స్కూల్ లో ఓటు వేశారు. ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఆయన సతీమణీ సీమ, ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా రాజ్‌నివాస్ మార్గ్‌లో ఓటు వేశారు.

ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఇంటి దగ్గర నుంచి సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు.. పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటు వేసేందుకు ఉదయం నుంచి ఓట్లరు బారులు తీరారు. అయితే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. QMS ద్వారా పోలింగ్‌ కేంద్రాల దగ్గర రద్దీ ఎలా ఉందనే విషయం ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. 220 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి. 19వేల మంది హోంగార్డులు, 35 వేల 626 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories