logo

'వివో' నుంచి సరికొత్త మొబైల్ ఫోన్..

Highlights

చైనా మొబైల్‌ తయారీదారి సంస్థ 'వివో' ప్రతి ఏడాది సరికొత్త ఫీచర్లతో మొబైల్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది....

చైనా మొబైల్‌ తయారీదారి సంస్థ 'వివో' ప్రతి ఏడాది సరికొత్త ఫీచర్లతో మొబైల్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మొబైల్ ప్రియులను ఆకట్టుకోవడానికి మరో సరికొత్త ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివో వి 15 ప్రొలో హై ఎండ్‌ వేరియంట్‌గా 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ స్మార్ట్ ఫోన్ ను గతవారం విడుదల చేసింది. అయితే పూర్తిస్థాయిలో ఈ ఆదివారం నుంచే అందుబాటులోకి వచ్చింది. వివో వి 15 ప్రొలో హై ఎండ్‌ ఫోను ధర రూ. 29,990గా నిర్ణయించింది కంపెనీ. ఇందులో 6జీబీ ర్యామ్‌, 128 స్టోరేజ్‌ వెర్షన్‌ అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు ఇలా ఉన్నాయి.

వివో వి 15 ప్రొ ఫీచర్లు

*ఆండ్రాయిడ్‌ 9.0పై

6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

*క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 675 ప్రాసెసర్

*48+8+5 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా

*32 ఎంపీ సెల్ఫీ కెమెరా

*2340 x 1080 పిక్సెల్స్‌ స్ర్కీన్‌ రిజల్యూషన్‌

*8జీబీ ర్యామ్‌ /128స్టోరేజ్‌

*256దాకా విస్తరించుకునే అవకాశం

*3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

లైవ్ టీవి

Share it
Top