ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్టీవ్‌స్మిత్ కు చేరువలో కోహ్లీ

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్టీవ్‌స్మిత్ కు  చేరువలో కోహ్లీ
x
Kohli, Steve Smith
Highlights

ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెట్లర్లు హావా కొనసాగుతోంది.

ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెట్లర్లు హావా కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్‌లో భారత్ జట్టు ఆటగాళ్లు టాప్-10లో నాలుగు స్థానాల్లో టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు.

ఇటీవల కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదిగా జరిగిన చారిత్రక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు సమిష్టిగా రాణించారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించారు. కాగా.. టెస్టు ర్యాకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానానికి చేరువలో ఉన్నారు. టాప్ పదిస్థానాల్లో నలుగురు భారత బ్యాట్స్‌మెన్‌లకి చోటు దక్కడం విశేషం.

ఇక టీమిండియా బౌలర్లు కూడా తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. బౌలింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేశారు. దీంతో టీమిండియా పేస్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తమ ర్యాంక్స్‌ని మెరుగుపరుచుకున్నారు.

టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విషయానికి వస్తే.. 931 పాయింట్లతో ఆస్ట్రేలియా క్రికెటర్ మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ అగ్రస్థానానికి మూడు పాయింట్లతో 928 రెండో స్థానంలో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ (877), భారత బ్యాట్స్‌మెన్ పుజారా (791), ఐదో స్థానంలో అజింక్య రహానె (759), హెన్రీ నికోలస్ (744), దిముత్ కరుణ‌రత్నె (723), టామ్ లాథమ్ (707), బెన్‌స్టోక్స్ (704), భారత్ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (700) టాప్-10లో నిలిచిన ఆటగళ్ల జాబితాలో ఉన్నారు.

బౌలర్ల జాబితా చూస్తే టీమిండియా జస్‌ప్రీత్ బుమ్రా (5), రవిచంద్రన్ అశ్విన్ (10) స్థానంలో ఉన్నార. ఫేస్ త్రయం ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్ తమ కెరీర్ లో మెరుగైన ర్యాంక్ లు అందుకున్నారు. డే/నైట్ టెస్టులో అదరగొట్టిన ఇషాంత్ 17 వ స్థానంలో కొనసాగుతున్నారు. మరో పేస్ బౌలర్ షమీ 11, ఉమేశ్ యాదవ్ 21వ స్థానంలో కొనసాగుతున్నారు.

ఆల్‌రౌండర్ జాబితాలో భారత్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 2వ స్థానంలో కొనసాగుతుండగా.. అశ్విన్ ఐదో ర్యాంక్‌ సాధించాడు. మొత్తానికి భారత్ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో మెరుగైనా స్థానాల్లో కొనసాగుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories